MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ హౌస్ లోకి క్రేజీ కపుల్... ఈ మధ్య విడాకుల వార్తలతో పాటు వివాదాల్లో నిలిచిన జంట!

బిగ్ బాస్ హౌస్ లోకి క్రేజీ కపుల్... ఈ మధ్య విడాకుల వార్తలతో పాటు వివాదాల్లో నిలిచిన జంట!

బిగ్ బాస్ సీజన్ 6 కి సమయం ఆసన్నమైంది. మరి హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరనే విషయంలో అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఓ క్రేజీ కపుల్ షోకి ఎంట్రీ ఇస్తున్నట్లు హాట్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.   

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 28 2022, 05:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


తెలుగు ప్రేక్షకులు హాట్ ఫేవరేట్ షో బిగ్ బాస్ తెలుగు 6 మరికొన్ని రోజుల్లో స్టార్ మాలో ప్రసారం కానుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా నాలుగోసారి బాధ్యతలు తీసుకోనున్నారు. సీజన్ 3 నుండి బిగ్ బాస్ హోస్టింగ్ చేస్తున్న నాగార్జున వరుసగా నాలుగోసారి బాధ్యతలు తీసుకోనున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


ఇప్పటికే బిగ్ బాస్ ప్రోమోలు అదరగొడుతున్నాయి. షోపై మరింత ఆసక్తి పెంచేస్తున్నాయి. గత ఐదు సీజన్స్ కి మించి లేటెస్ట్ సీజన్ సక్సెస్ చేయాలని నిర్వాహకులు ప్లాన్ లో ఉన్నారు. షోకి మంచి టీఆర్పీ వస్తున్నప్పటికీ కంటెస్టెంట్స్ విషయంలో ఒకింత నిరాశ వ్యక్తం అవుతుంది. ముక్కు ముఖం తెలియనివాళ్లను ఎంపిక చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ ఆరోపణలను అధిగమించాలనే ఆలోచన మేకర్స్ లో ఉంది. 

35

కంటెస్టెంట్స్ లో అధిక భాగం బాగా తెలిసిన వెండితెర, బుల్లితెర, సోషల్ మీడియా సెలెబ్రిటీలు ఉండేలా చూసుకోనున్నారట. ఈ క్రమంలో ఓ క్రేజీ కపుల్ నేమ్స్ తెరపైకి వచ్చాయి. అది ఎవరో కాదు సింగర్స్ హేమ చంద్ర, శ్రావణ భార్గవి. భారీ పారితోషికం ఇచ్చి మరీ వీరిద్దరినీ ఒప్పించారనేది టాక్. 
 

45


అందులోనూ ఇటీవల వీరి జీవితాల్లో కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. మనస్పర్ధలతో విడిపోయినట్లు పుకార్లు చెలరేగాయి. అయితే తాము కలిసే ఉన్నట్లు ఈ జంట ప్రకటించారు. విడాకుల వార్తల్లో నిజం లేదని స్పష్టత ఇచ్చారు. అనంతరం శ్రావణ భార్గవి నటించిన భక్తి గీతం వివాదాస్పదమైంది. ఏకంగా టిటిడి చర్యలకు సిద్ధం కావడంతో పాటు విమర్శలు వెల్లువెత్తడంతో ఆ సాంగ్ తొలగించారు. 
 

55


ఈ నేపథ్యంలో వీరిద్దర్నీ హౌస్ లోకి పంపడం బాగా ప్లస్ అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారట. అయితే హేమ చంద్ర సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. శ్రావణ భార్గవి పాపకు తల్లి. బిగ్ బాస్ ఆఫర్ ఒప్పుకొని హౌస్ లోకి వెళతారని ఖచ్చితంగా చెప్పలేము. కాగా గతంలో భార్యాభర్తలైన హీరో వరుణ్ సందేశ్, వితికా షేరు షోలో పాల్గొన్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image2
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Recommended image3
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved