MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 6: లీకైన కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్... హైయెస్ట్ ఎవరు? లోయస్ట్ ఎవరు?

Bigg Boss Telugu 6: లీకైన కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్... హైయెస్ట్ ఎవరు? లోయస్ట్ ఎవరు?

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్స్ లీక్ అయ్యాయి. దీంతో హైయెస్ట్ ఎవరో? లోయస్ట్ ఎవరో? తేలిపోయింది. మరి ఈ సీజన్ కి ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో చూద్దాం...  

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 08 2022, 12:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

21 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ తెలుగు 6 గ్రాండ్ గా ప్రారంభమైంది. గత రెండు సీజన్స్ తో పోల్చుకుంటే ఈసారి హౌస్లోకి తెలిసిన ముఖాలు వెళ్లారు. సింగర్ రేవంత్, అభినయశ్రీ, చలాకీ చంటి, బాల ఆదిత్య, ఫైమా, కీర్తి, సుదీప లాంటి సెలెబ్రిటీలు షోలో భాగమయ్యారు. మరి ఈ కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్స్ ఎంత? ఎవరు హైయెస్ట్? ఎవరు లోయస్ట్ అనే విషయం తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సీజన్ కి గాను అత్యధికంగా ఓ కంటెస్టెంట్ రోజుకు రూ. 60 వేలు తీసుకుంటుండగా అత్యల్పంగా మరో కంటెస్టెంట్ కేవలం రూ. 15 వేలు తీసుకుంటున్నారట. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

బిగ్ బాస్ సీజన్ 6 ఫస్ట్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సీరియల్ నటి కీర్తి భట్ రోజుకు రూ. 35 వేలు తీసుకుంటున్నారట. ఇక నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్ సుదీప్ అలియాస్ పింకీ రూ. 25 వేలు ఛార్జ్ చేస్తున్నారట. అనూహ్యంగా యూట్యూబర్, సిరి లవర్ శ్రీహాన్ రోజుకు రూ. 50 వేలు అందుకుంటున్నాడట. 

38

కాగా పెద్దగా ఫేమ్ లేని యాంకర్ నేహా చౌదరి సైతం బాగానే వసూలు చేస్తున్నారట. ఆమె రోజు వారి రెమ్యూనరేషన్ రూ. 30 వేలు అని సమాచారం.  మోడల్ అండ్ యాక్ట్రెస్ శ్రీసత్య కూడా రోజుకు రూ.30 వేలు తీసుకుంటున్నారట.  కొన్ని సినిమాల్లో నటించిన వైజాగ్ కుర్రాడు అర్జున్ కి రోజుకు రూ.35 వేలు పారితోషికం ఇస్తున్నారట. ప్రస్తుతం ఇతడు సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు. 
 

48


టాప్ బుల్లితెర సెలబ్రెటీగా చేతినిండా ఈవెంట్స్, షోస్ తో చలాకీ చంటి బిజీ. జబర్దస్త్ కమెడియన్ గా మంచి సంపాదన కలిగిన చలాకీ చంటి రోజుకు రూ. 50 వేలు తీసుకుంటున్నాడట. మాజీ ఐటెం గర్ల్ అభినయశ్రీ రోజుకు రూ.20 వేల ఒప్పందంపై బిగ్ బాస్ షోకి వచ్చినట్లు సమాచారం. కొన్నాళ్లుగా ఆమె వెండితెరకు దూరమయ్యారు.  సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన గీతూ రాయల్ రోజుకు రూ.25 వేల వరకు తీసుకుంటున్నట్లు వినికిడి. 
 

58

చైల్డ్ ఆర్టిస్ట్ గా సంచలనాలు చేసిన బాల ఆదిత్య హీరోగా కూడా కొన్ని చిత్రాలు చేశారు. ఈ మధ్య తెరమరుగైన బాల ఆదిత్య రోజుకు రూ.35 వేలు తీసుకుంటున్నారట.ఇక బిగ్ బాస్ కపుల్ మరీనా, రోహిత్ రోజుకు చెరో రూ.40  వేలు తీసుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. సీరియల్ నటి వాసంతి కృష్ణన్ రెమ్యూనరేషన్  రోజుకు రూ.25 వేల అట. 

68

సై ఫేమ్ షానికి రోజుకు రూ.30 వేలు ఆఫర్ చేశారట. వెండితెర అవకాశాలు లేని ఈ నటుడికి ఇది మంచి అవకాశమని చెప్పాలి. అలాగే ఆర్జే సూర్య  రోజుకు రూ.40 వేల వరకు ఛార్జ్ చేస్తున్నాడట. యూట్యూబ్  బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి కూడా బాగానే తీసుకుంటున్నాడట. రోజుకు రూ. 30 వేలు ఆయన రెమ్యూనరేషన్ అని వినికిడి. కంటెస్టెంట్ ఆరోహి రావు అత్యల్పంగా కేవలం రూ.15 వేలు తీసుకుంటున్నారట. ఈ సీజన్ కి ఈమెదే అతి తక్కువ రెమ్యూనరేషన్ అట. 
 

78


 కాగా ‘జబర్దస్త్’ కమెడియన్ ఫైమా  రోజుకి రూ.25 వేలు అందుకుంటున్నారట. ఇక సొంత ఇంటి కలతో హౌస్లోకి వచ్చిన ఫైమా ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మరో కంటెస్టెంట్ రాజశేఖర్ కు రోజుకు రూ.20 వేల పారితోషికం ఇస్తున్నారట.ఏమాత్రం ఫేమ్ లేని నటి ఇనయ సుల్తానాకి కూడా అతి తక్కువ రెమ్యూనరేషన్ రోజుకి రూ.15 వేలు ఇస్తున్నారట. 
 

88

ఇక ఈ సీజన్ కి హైయెస్ట్ రెమ్యూనరేషన్ సింగర్ రేవంత్ తీసుకుంటున్నాడట. ఆయన రోజుకు రూ. 60 వేలు ఛార్జ్ చేస్తున్నారట. ఇతర కంటెస్టెంట్స్ ఎవరూ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ పొందడం లేదు. ఇండియన్ ఐడల్ విన్నర్ అయిన రేవంత్ మంచి ఇమేజ్ కలిగి ఉన్నారు. ఈ కారణంతో నిర్వాహకులు భారీగా ఆఫర్ చేశారు. అందుతున్న సమాచారం ప్రకారం ఇవి బిగ్ బాస్ తెలుగు 6 కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్స్.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Recommended image2
Nayanthara : 31 కోట్ల ఇల్లు.. స్టూడియో, ఖరీదైన ఫ్లాట్లు.. నయనతార ఆస్తుల చిట్టా ఎంత పెద్దదో తెలుసా?
Recommended image3
Pavan Sadineni: ప్రేమ పేరుతో మోసం.. టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని అరెస్టు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved