MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇనయాకు ఆ అబ్బాయి పై రగులుతుంది మొగలిపొద... చికెన్ కి కక్కుర్తి పడి హౌస్లో ఉన్న అఫైర్స్ లీక్ చేసిన గీతూ!

ఇనయాకు ఆ అబ్బాయి పై రగులుతుంది మొగలిపొద... చికెన్ కి కక్కుర్తి పడి హౌస్లో ఉన్న అఫైర్స్ లీక్ చేసిన గీతూ!

బిగ్ బాస్ హౌస్ లో మొదలైన ప్రేమ కథలు గురించి గీతూ బిగ్ బాస్ తో చెప్పేసింది. బిగ్ బాస్ చికెన్ చూపించి టెంప్ట్ చేయగా మొత్తం చెప్పేసింది. ఇనయ, అర్జున్ లు వేరువేరుగా ఇద్దరు కంటెస్టెంట్స్ ని ఇష్టపడుతున్నట్లు వెల్లడించింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 04 2022, 11:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


బిగ్ బాస్ మంగళవారం ఎపిసోడ్ కొంచెం ఆసక్తికరంగా సాగింది. బిగ్ బాస్ స్వయంగా హౌస్ లో తన బర్త్ డే జరుపుకున్నారు. బర్త్ డే నేపథ్యంలో కంటెస్టెంట్స్ ఆయన్ని ఎంటర్టైన్ చేయాలని ఆదేశించారు. అలాగే మధ్య మధ్యలో ఆయన ఇచ్చే సర్ప్రైజ్ లకు రెస్పాండ్ కావాలని సూచించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

బిగ్ బాస్ ఆదేశం మేరకు ఇంటి సభ్యులు తమ తమ స్టైల్ లో ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఆర్జే సూర్య మిమిక్రీ చేశాడు. ఫైమా కామెడీ స్కిట్స్ తో నవ్వులు పూయించింది.ఓ సాంగ్ కి శ్రీహాన్-శ్రీసత్య అదిరిపోయే కెమిస్ట్రీ కురిపిస్తుంటే అర్జున్ వాళ్ళను చూస్తూ ఉండిపోయాడు. అతడి ముఖంలో ఈర్ష్య, బాధ కొట్టొచ్చినట్లు కనిపించింది. మనసులో ఏమనిపించినా చేసేది ఏమీ లేదు. అది బిగ్ బాస్ హౌస్ ఎవరి ఇష్టం వారిది. మనకు నచ్చిన అమ్మాయి వేరే అబ్బాయికి దగ్గర అవుతుందని నొచ్చుకోవడానికి లేదు.

37
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

  అనంతరం సీక్రెట్ రూమ్ లోకి గీతూని పిలిచిన బిగ్ బాస్ వేడి వేడి చికెన్, కోక్ ఆఫర్ చేశాడు. అయితే అది తినాలంటే చిన్న కండీషన్ పెట్టారు. హౌస్ కి సంబంధించిన మంచి గాసిప్ చెప్తే.. చికెన్ తినొచ్చు అన్నాడు. గాసిప్స్ చెబుతానని గీతూ ఒప్పుకుంది. 
 

47
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

దానికి గీతూ... ఇనయ-ఆర్జే సూర్య మధ్య సంథింగ్ సంథింగ్ అని చెప్పింది. సూర్య పెద్దగా రెస్పాండ్ కావడం లేదు కానీ, ఇనయాకు ఆయనపై రగులుతుంది మొగలిపొద అని చెప్పింది. అలాజీ శ్రీసత్యను లైన్ లో పెట్టడానికి అర్జున్ తెగ ట్రై చేస్తున్నాడని, ఇందాక శ్రీసత్యతో శ్రీహాన్ డాన్స్ చేస్తుంటే ముఖం మాడ్చుకున్నాడని ,బాల ఆదిత్య ఎప్పుడూ దీపు దీపు అంటున్నాడు. అది నచ్చడం లేదు అని వరుసగా మూడు గాసిప్స్ చెప్పింది. గీతూ గాసిప్స్ కి ప్రసన్నమైన బిగ్ బాస్, చికెన్ తినమన్నాడు. 
 

57
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

అరగంటకు పైగా సీక్రెట్ రూమ్ లో ఉన్న గీతూతో బిగ్ బాస్ ఏం చెప్పాడనే క్యూరియాసిటీ అందరు కంటెస్టెంట్స్ లో కలిగింది. దాన్ని కూడా గీతూ మైండ్ గేమ్ ఆడి ఉపయోగించుకుంది.బిగ్ బాస్ తన గురించి ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో వీడియోలు చూపించాడని అబద్దం చెప్పింది. ఇక బిగ్ బాస్ ఇచ్చిన చికెన్ ఎవరికీ పెట్టకుండా ఊరించుకుంటూ తింది.

67
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

అనంతరం మరో కంటెస్టెంట్ ఫైమాను బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లోకి పిలిచాడు. ఆమె ముందు ఫిజ్జా ఉంచాడు. ఆ ఫిజ్జా తినాలంటే ఒక సీక్రెట్ టాస్క్ పూర్తి చేయాలని ఆదేశించాడు. అర్థరాత్రి కంటెస్టెంట్స్ అందరి నిద్ర మూడు సార్లు చెడగొట్టాలి. దానికి కారణం నువ్వని తెలియ కూడదు. అలాగే నువ్వు సీక్రెట్ టాస్క్ పెర్ఫార్మ్ చేస్తున్నావని ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడాలని సూచించాడు.సక్సెస్ ఫుల్ గా సీక్రెట్ టాస్క్ పూర్తి చేస్తే కెప్టెన్సీ కంటెండర్ గా అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చని చెప్పాడు.  అంగీకరించిన ఫైమా బయటికి వచ్చింది.మంగళవారం  ఎపిసోడ్ ఈ ఆసక్తికర పరిణామాలతో ముగిసింది. 
 

77
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


కాగా ఫైమా బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ఎంత సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తుందో రేపు ఎపిసోడ్ లో చూడాలి.  నిన్న నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయ్యింది. మెరీనా, ఇనయా, ఆదిరెడ్డి, ఫైమా, ఆదిత్య, చంటి నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు. ఈ వారం ఆరోహిరావు హౌస్ ని వీడడం జరిగింది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Posani Krishna Murali: ఆమె ఐటెం గర్ల్, హీరోయిన్ గా పనికిరాదు అన్నారు.. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్
Recommended image2
Manchu Manoj: బండి సంజయ్‌ కొడుకు కేసుపై మంచు మనోజ్‌ సంచలన పోస్ట్.. న్యాయానికి అధికారం అడ్డురాకూడదంటూ కామెంట్‌
Recommended image3
Trisha: ఎట్టకేలకు అధికారికంగా హింట్‌ ఇచ్చిన త్రిష.. విజయ్ సీఎం అయ్యాక ఫస్ట్ పోస్ట్.. నెట్టింట రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved