MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీసత్య మోసానికి రగిలిపోతున్న అర్జున్ కళ్యాణ్... ఎందుకు ప్రేమించానని తలబాదుకుంటున్నాడా?

శ్రీసత్య మోసానికి రగిలిపోతున్న అర్జున్ కళ్యాణ్... ఎందుకు ప్రేమించానని తలబాదుకుంటున్నాడా?

అర్జున్ కళ్యాణ్ ప్రయత్నం, త్యాగం బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఆమె మాయలో పడి ఎలిమినేటైన అర్జున్ కళ్యాణ్ బాధపడుతున్నట్లు సమాచారం. దానికి కారణం శ్రీసత్య ఈ మధ్య శ్రీహాన్ దగ్గర కావడమే.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 03 2022, 09:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


ప్రేమకోసమై వలలో పడినే పాపం పసివాడు... అన్నట్లు శ్రీసత్య కోసం అర్జున్ కళ్యాణ్ పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడూ ఆమె సేవలో తరించాడు. పూవు చుట్టూ తేనెటీగ తిరిగినట్లు తిరిగాడు. గేమ్ పక్కన పెట్టి శ్రీసత్యను పూజిస్తూ బ్రతికాడు. ఆమె కోసం శిక్షలు కూడా అనుభవించాడు. అవమానాలు, విమర్శలు చెప్పుకుంటూ పోతే శ్రీసత్య వలన అర్జున్ కళ్యాణ్ పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. 

26
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


చివరకు హౌస్ నుండి ఎలిమినేట్ కావడానికి శ్రీసత్య కారణమైంది. శ్రీసత్య వలెనే అర్జున్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఆడలేదు. వీక్ కంటెస్టెంట్ గా ఇంటి సభ్యుల్లో, ప్రేక్షకుల్లో నిలిచాడు. సరైన స్టాండ్ లేని అర్జున్ కళ్యాణ్ ఇంట్లో ఉండటానికి అర్హుడు కాదని ప్రేక్షకులు బయటకు పంపేశారు. 
 

36


ఎలిమినేషన్ డే కూడా అర్జున్ తన కంటే శ్రీసత్య గురించే ఎక్కువ మాట్లాడాడు. అసలు శ్రీసత్య బిగ్ బాస్ ఇంటికి వెళుతుందని తెలిసి షోకి అప్లై చేశానన్న భయంకరమైన సీక్రెట్ బయటపెట్టాడు. శ్రీసత్య చిన్న కన్నీటి బొట్టు కార్చినందు చిన్నపిల్లాడిలా స్టేజ్ పై ఏడ్చాడు. నువ్వు గేమ్ ఆడు నేను బయట విషయాలు చూసుకుంటా అని హామీ ఇచ్చారు. 
 

46
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


ఇంత చేసినా అర్జున్ పై శ్రీసత్యకు కొంచెం కూడా మనసు కలగలేదు. లవ్ ఫెయిల్యూర్ అని చెప్పుకునే శ్రీసత్య స్ట్రాంగ్ అందుకే మగాళ్లకు  దూరంగా ఉంటున్నారని అందరూ భావించారు. అయితే ఆ అభిప్రాయాలు చెల్లాచెదురు అవుతున్నాయి. హౌస్లో శ్రీసత్య లవ్ ఇంట్రెస్ట్ కూడా ఉన్నాడని తాజా పరిణామాలతో అర్థం అవుతుంది. 
 

56
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

కంటెస్టెంట్ శ్రీహాన్ ని ఆమె దగ్గరవుతున్న ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అర్జున్ ఎలిమినేట్ అయ్యాక శ్రీసత్య శ్రీహాన్ తో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఎప్పుడూ శ్రీహాన్ తోనే శ్రీసత్య గడుపుతుంది. తన పర్సనల్ విషయాలు అతడితో చెప్పుకుంటుంది. చేతిలో చెయ్యేసి మాట్లాడుతుంది. అర్జున్ ని టచ్ చేయకుండా మాట్లాడమని చెప్పిన శ్రీహాన్ ని మాత్రం ఏదైనా ఓకే అంటుంది. 
 

66
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

ఇద్దరూ ఒకే బెడ్ పై కలిసి పడుకోలేదు అని ఇనయా వారిద్దరినీ గట్టిగా అడిగింది. మా రిలేషన్ కి ఒక క్లారిటీ ఉందని, పేరుందని శ్రీహాన్ సమర్ధించుకున్నాడు. వీరిద్దరి మధ్య ఒక బాండింగ్ కొనసాగుతుందని షో చూస్తున్నవారికి అర్థం అవుతుంది. శ్రీహాన్-శ్రీసత్య వ్యవహారం బయట నుండి చూస్తున్న అర్జున్ కళ్యాణ్ రగిలిపోతున్నాడని, తప్పు చేశానని బాధపడుతున్నాడంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
సంజూ శాంసన్ vs కీర్తి సురేష్ .. వీరిలో నెంబర్ 1 ఎవరో తెలుసా..?
Recommended image2
Maheshbabu కోసం కదిలి వచ్చిన పవన్ కళ్యాణ్‌, వెంకటేష్‌, నాగార్జున.. కట్‌ చేస్తే సినిమా ఫ్లాప్‌
Recommended image3
1000 Crore Heroes: వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిన హీరోలు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved