MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • BiggBoss Telugu5 grand finale:సన్నీని కోటీశ్వరుడిని చేసిన బిగ్ బాస్ షో.. విన్నర్ గా అతడికి దక్కింది ఎంతంటే!

BiggBoss Telugu5 grand finale:సన్నీని కోటీశ్వరుడిని చేసిన బిగ్ బాస్ షో.. విన్నర్ గా అతడికి దక్కింది ఎంతంటే!

మూడు నెలల గృహవాసం, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరం, ఎటువంటి ఎంటర్టైన్మెంట్ లేకుండా, కడుపు మాడ్చుకొని.... కంటి నిండా నిద్ర లేకుండా కలిసి ఉన్న వాళ్ళతోనే మానసిక, శారీక యుద్ధం. బిగ్ బాస్ హౌస్ లో మనుగడ సాధించాలంటే చాలా సంకల్పం కావాలి.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 19 2021, 11:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మానసికంగా దృఢంగా ఉన్నవాళ్లే హౌస్ లో ఉండగలరు. నిద్ర లేస్తే నాలుగు గోడల మధ్య జీవితం. పక్కనే ఉన్న వాళ్లతోనే పోరాటాలు. ఇష్టం లేకపోయినా గొడవలు... ఇలా బిగ్ బాస్ హౌస్ కలర్ఫుల్ గా కనిపించే నరకం. మరి అలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కొని టైటిల్ విన్నర్ కావడం సామాన్యమైన విషయం కాదు. ఈ షోపై సమాజంలో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ మంచి కూడా లేకపోలేదు. మనిషిలోని నిజమైన వక్తిత్వత్వం, పోరాటతత్త్వం, ఓ విషయంపై స్పందించే తీరు వంటి విషయాలు బిగ్ బాస్ హౌస్ నేర్పిస్తుంది. 
 

28

గత ఐదు సీజన్స్ గా అప్రతిహతంగా బిగ్ బాస్ షో నడుస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఈ షోని ఎంతగానో ఆదరిస్తున్నారు. బుల్లితెర షోల్లో బిగ్ బాస్ టాప్ రేటెడ్ షోగా ఉంది. కాగా నేడు బిగ్ బాస్ 5 BiggBoss Telugu5 grand finale) టైటిల్ విన్నర్ గా విజె సన్నీ అవతరించాడు. ఉత్కంఠ మధ్య సాగిన టైటిల్ పోరులో సన్నీ విజేతగా నిలిచారు. 

38

19 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 లో సన్నీ(Sunny), షణ్ముఖ్, శ్రీరామ్, మానస్, సిరి ఫైనల్ కి చేరుకున్నారు. విజేతను నిర్ణయించేది ప్రేక్షకుల ఓట్లు కాగా.. సిరి ఐదవ స్థానం, మానస్ నాలుగవ స్థానం, శ్రీరామ్ మూడవ స్థానం దక్కించుకోవడం జరిగింది. 
 

48

ఇక టైటిల్ కోసం షణ్ముఖ్, సన్నీ పోటీపడ్డారు. ఇక హౌస్ నుండి బిగ్ బాస్ వేదిక మీదకు సన్నీ, షణ్ముఖ్ (Shanmukh)లను తీసుకొచ్చిన నాగార్జున(Nagarjuna) విన్నర్ ని ప్రకటించారు. పంచభూతాల సాక్షిగా ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా విజేత నిర్ణయం జరిగిందని, ప్రేక్షకులే విజేతను నిర్ణయించారని తెలియజేశాడు. చివరిగా సన్నీని బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా ప్రకటించడం జరిగింది. 

58

దీనితో సన్నీ కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ లో ఆనందం వెల్లివిరిసింది. ఇక సన్నీ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. మరి బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా సన్నీకి దక్కిన బహుమతుల జాబితా చూస్తే మైండ్ బ్లాక్ కావలసిందే. 

68


విజేతగా సన్నీ ట్రోఫితో పాటు  ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు గెలుచుకున్నారు. అలాగే సువర్ణభూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు 300 స్క్వేర్ యార్డ్ ఫ్లాట్ ని ఇవ్వడం జరిగింది. షాద్ నగర్ లో ఈ ప్లాట్ కేటాయించగా.. దాని ప్రస్తుత విలువ రూ. 25 లక్షలు. 

78

వీటితో పాటు ఆయనకు టీవీఎస్ కంపెనీ తరపున అపాచే బైక్ గిఫ్ట్ గా దక్కింది. ఈ బైక్ మార్కెట్ ధర లక్షన్నర వరకు ఉంది. కాగా 15వారాలు సన్నీ హౌస్ లో ఉన్నాడు. రెమ్యునరేషన్ రూపంలో మరికొంత సొమ్ము అతనికి దక్కుతుంది. సన్నీ రెమ్యూనరేషన్ రూ. 20 - 25 లక్షల వరకూ ఉండొచ్చని సమాచారం. అలా మొత్తంగా సన్నీ కోటి రూపాయలకు పైనే ఈ షో ద్వారా రాబట్టాడన్న మాట. 
 

88


అన్నింటికీ మించి బిగ్ బాస్ విన్నర్ అన్న ఇమేజ్ ఆయన కెరీర్ కి బాటలు వేస్తుంది. ఈ ఫేమ్ అతనికి పరిశ్రమలో అవకాశాలు తెచ్చిపెడుతుంది. బ్రాండ్ వాల్యూ పెరగడం ద్వారా మంచిగా ఆర్జించేందుకు మార్గాలు ఏర్పడతాయి. కాగా శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజీత్ తెలుగు బిగ్ బాస్ షో విన్నెర్స్ గా ఉన్నారు. ఈ లిస్ట్ లో సన్నీ వచ్చి చేరాడు. 

Also read Bigg Boss 5 Winner Sunny: బిగ్ బాస్ 5 విజేతగా అవతరించిన సన్నీ

Also read BiggBoss Telugu 6: బిగ్‌బాస్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ఆరో సీజన్‌ ఎప్పట్నుంచంటే.. క్లారిటీ ఇచ్చేసిన నాగ్‌
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranveer vs Deepika: బాక్సాఫీస్ దగ్గర భార్యదే పైచేయి.. భర్త వెనుకబడింది ఇక్కడే!
Recommended image2
Vijay Divorce: రూ.250 కోట్లు అడిగిన సంగీత.. విజయ్ ఇచ్చేది రూ.35 కోట్లేనా? అసలు నిజమెంత?
Recommended image3
Tollywood Editor: తీవ్ర విషాదం..గుండెపోటుతో టాలీవుడ్ ఎడిటర్ మృతి.. పవన్, రామ్ పోతినేని సినిమాలకు కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved