Asianet News TeluguAsianet News Telugu

BiggBoss Telugu 6: బిగ్‌బాస్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ఆరో సీజన్‌ ఎప్పట్నుంచంటే.. క్లారిటీ ఇచ్చేసిన నాగ్‌

`బిగ్‌బాస్‌ తెలుగు 5` షోలో మరో ఇంట్రెస్టింగ్‌ విషయం తెలియజేశారు హోస్ట్ నాగార్జున. నెక్ట్స్ సీజన్‌కి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. అది త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. 

nagarjuna confirm bigg boss telugu 6th season when will start
Author
Hyderabad, First Published Dec 19, 2021, 11:31 PM IST

ఇండియన్‌ బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగులో ఐదు సీజన్లు పూర్తయ్యాయి. ఆదివారం(డిసెంబర్‌ 19) జరిగిన గ్రాండ్‌ ఫినాలేతో ఐదో సీజన్‌ విన్నర్‌ తేలిపోయింది. అంతా అనుకున్నట్టు సన్నీ విన్నర్‌ అయ్యారు. అత్యంత ఉత్కంఠభరితమైన గేమ్‌లో సన్నీ విన్నర్‌గా గెలవడం విశేషం. విన్నింగ్‌ సందర్భంగా ఆయన ట్రోఫీతోపాటు యాభై లక్షల ప్రైజ్‌మనీ, మూడు వంద గజాల ఫ్లాట్‌, బైక్‌ దక్కాయి. సుమారు ఆయన కోటి రూపాయల వరకు ఆయన విన్నింగ్‌ వల్ల పొందారు. 

ఇదిలా ఉంటే ఈ షోలో మరో ఇంట్రెస్టింగ్‌ విషయం తెలియజేశారు హోస్ట్ నాగార్జున. నెక్ట్స్ సీజన్‌కి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. అది త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. ఎప్పుడో తొమ్మిది నెలలకు కాకుండా కేవలం కొత్త ఏడాది ప్రారంభమైన రెండు నెలలకే ప్రారంభమవుతుందన్నారు. అంటే ఫిబ్రవరిలోగానీ, మార్చి మొదటి వారంలోగా ప్రారంభం కానుంది. ఆరో సీజన్‌కి కూడా నాగార్జునే హోస్ట్ గా చేయనున్నట్టు ఆయన చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. గత 4, 5 సీజన్స్ కరోనా వల్ల వాయిదా పడుతూ సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యాయి. కానీ ఆరో సీజన్ కి మాత్రం అంత టైమ్‌ తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. 

ఇది బిగ్‌బాస్‌ ప్రియులకు గుడ్‌ న్యూసే అని చెప్పొచ్చు. దీంతో మరో రెండు నెలల్లో మరో బిగ్‌బాస్‌ సీజన్‌ ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. ఇక బిగ్‌బాస్‌ తెలుగు మొదటి సీజన్‌ 2017 జులైలో ప్రారంభమైంది. ఎన్టీఆర్‌ హోస్ట్ గా చేయగా, 70 రోజులపాటు జరిగిన ఈ రియాలిటీ షోలో శివబాలాజీ విన్నర్‌ అయ్యారు. 2018లో నాని హోస్ట్ గా జూన్లో బిగ్‌బాస్‌ రెండో సీజన్‌ ప్రారంభమైంది. 112 రోజులపాటు జరిగిన ఈ షోలో కౌశల్‌ మందా విజేతగా నిలిచారు. 

మూడో సీజన్‌ 2019 జులైలో ప్రారంభమైంది. రాహుల్‌ సిప్లిగంజ్‌ విన్నర్‌ అయ్యారు. దీనికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. నాల్గో సీజన్‌ కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించగా, కరోనా కారణంగా సెప్టెంబర్‌లో ప్రారంభమై 105రోజులపాటు జరిగింది. అభిజిత్‌ విన్నర్‌ అయ్యారు. ఇక ఐదో సీజన్‌ సెకండ్‌ వేవ్‌ కారోనా కారణంగా సెప్టెంబర్‌లో ప్రారంభమైంది. నాగ్‌ హోస్ట్ చేసిన ఈ సీజన్‌లో వీజే సన్నీ విన్నర్‌ అయ్యారు. ఇది కూడా 105రోజులపాటు జరిగింది. 

also read: Bigg Boss 5 Winner Sunny: బిగ్ బాస్ 5 విజేతగా అవతరించిన సన్నీ

Follow Us:
Download App:
  • android
  • ios