MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Dhanush political entry: విజయ్ బాటలోనే ధనుష్ రాజకీయం... జెండా ఆవిష్కరించిన అభిమాన సంఘం

Dhanush political entry: విజయ్ బాటలోనే ధనుష్ రాజకీయం... జెండా ఆవిష్కరించిన అభిమాన సంఘం

Dhanush political entry: తమిళనాట స్టార్ హీరోలపై రాజకీయా వార్తలు ఆగడంలేదు. మొన్న విశాల్, నిన్న సూర్య,అజిత్.. నేడు ధనుష్. విజయ్ ముఖ్యమంత్రి అయిన తరువాత స్టార్ హీరోల పొలిటికల్ ఎంట్రీలపై అందరిచూపు పడింది. ఇంతకీ ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్ అయ్యిందా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 07 2026, 02:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తమిళ రాజకీయాల్లో సంచలనం..
Image Credit : Instagram

తమిళ రాజకీయాల్లో సంచలనం..

తమిళనాడు రాజకీయాల్లో కోలీవుడ్ దళపతి విజయ్ సృష్టించిన సంచలన విజయం... ఇప్పుడు ద్రవిడ రాజకీయలనే పూర్తిగా మార్చేసింది. రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిసారే ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి, విజయ్ సరికొత్త చరిత్ర సష్టించారు. కమల్ హాసన్ వంటి మహామహులకే సాధ్యం కాని ఈ రాజకీయ అద్భుతాన్ని విజయ్ సాకారం చేయడంతో, ఇప్పుడు కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ అటువైపు అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. విశాల్, సూర్య, అజిత్ పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటికే పలు వార్తలు వినిపిస్తున్న వేళ.. తాజాగా మరో స్టార్ హీరో ధనుష పేరుకూడా ఈ లిస్ట్ లో చేరింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నారా?
Image Credit : X

ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నారా?

ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారనే ప్రచారం తమిళనాట జోరుగా సాగుతోంది. తాజాగా ధనుష్ అభిమాన సంఘం నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఒక అధికారిక జెండాను ఆవిష్కరించడం హాట్ టాపిక్‌గా మారింది. కేవలం జెండా రూపకల్పనకే పరిమితం కాకుండా, తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని అభిమాన సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. ఇది పక్కా పొలిటికల్ స్కెచ్‌తోనే జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మామ రజినీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడంతో.. ధనుష్ ఆ ప్లేస్ ను తీసుకోవాలని చూస్తున్నట్టు సమాచారం.

34
విజయ్ పంథాలోనే గ్రౌండ్ వర్క్?
Image Credit : Asianet News

విజయ్ పంథాలోనే గ్రౌండ్ వర్క్?

ముఖ్యమంత్రి విజయ్ బాటలోనే ధనుష్ కూడా ఇప్పుటి నుంచే గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి పూర్తి ప్రణాళికతో పక్కాగా బరిలోకి దిగుతారని కోలీవుడ్ వర్గాల్లో గట్టి చర్చ నడుస్తోంది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) సాధించిన విజయ ప్రస్థానం అందించిన స్ఫూర్తితో, ధనుష్ అభిమానులు కూడా క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకునేందుకు కార్యాచరణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం కేవలం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

44
అధికారిక ప్రకటనపై ఉత్కంఠ
Image Credit : X

అధికారిక ప్రకటనపై ఉత్కంఠ

మరోవైపు, తన పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో ఇంత పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నప్పటికీ... హీరో ధనుష్ వైపు నుంచి గానీ, ఆయన పీఆర్ టీమ్ నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ధనుష్, కేవలం అభిమాన సంఘాల గుర్తింపు కోసమే ఈ జెండాను అనుమతించారా, లేదా దీని వెనుక దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే స్వయంగా ధనుష్ స్పందించే వరకు వేచి చూడక తప్పదు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
టీవీకే విజయ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR: ఆ రోజు ధైర్యం చెప్పడానికి కుటుంబ సభ్యులెవరూ రాలేదు, చాలా బాధ పడ్డా.. జూ.ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగం
Recommended image2
Bigg Boss Telugu 10: కవరింగ్ స్టార్ రోహిత్ అంటూ నామినేట్ చేసిన త్రిగుణ్, షాలినికి ఇచ్చి పడేసిన రామ్ ప్రసాద్
Recommended image3
Allu Sneha: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న అల్లు అర్జున్ భార్య.. ఫ్యామిలీని చూసుకుంటూనే బిజినెస్ లో సంపాదన
Related Stories
Recommended image1
Bhanu Chander: బ్లూ ఫిల్మ్ కేసులో భానుచందర్ ను ఇరికించాలని చూస్తే.. కాపాడిన హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Venkatesh: వెంకటేష్ తనయుడు అర్జున్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఫిక్స్.. దగ్గుబాటి వారసుడు మొదటి సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved