టైట్ ఫిట్ లో బిగ్ బాస్ తేజస్వి హాట్ పోజులు... చైర్ లో ఆ కూర్చోవడమేంటీ బాబోయ్!
క్రేజీ పోజుల్లో కవ్వించింది తేజస్వి మాదివాడ. టైట్ ఫిట్ లో అమ్మడు అందాలు కొట్టొచ్చినట్లు కనబడుతుంటే కుర్రాళ్ళు కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు.
Tejaswi Madivada
బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన తేజస్వి మాదివాడకు బీబీ జోడిలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వచ్చింది. స్టార్ మా ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని జోడీలుగా ఎంపిక చేసి డాన్స్ రియాలిటీ షో స్టార్ట్ చేసింది. ఈ షోలో అఖిల్ సార్థక్, తేజస్వి మాదివాడ ఒక జోడీగా పోటీపడుతున్నారు.
Tejaswi Madivada
ఇక తేజస్వి మాదివాడ కెరీర్ సప్పగా సాగుతుంది. 2021లో తేజస్వి మాదివాడ నటించిన కమిట్మెంట్ మూవీ విడుదలైంది. ఈ మూవీకి హైప్ తెచ్చేందుకు తేజస్వి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అడల్ట్ మూవీస్ లో నటిస్తే తప్పేంటి అన్న తేజస్వి మాదివాడ... ఆఫర్స్ వస్తున్నప్పుడు కూడా ఐస్ క్రీం లాంటి అడల్ట్ కంటెంట్ మూవీ చేశాను అన్నారు. ఇంత చేసినా కమిట్మెంట్ మూవీని ఆడియన్స్ పట్టించుకోలేదు.
Tejaswi Madivada
తెలుగు అమ్మాయి అయిన తేజస్వి మాదివాడ మహేష్-వెంకటేష్ ల మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో సమంత ఫ్యామిలీ మెంబర్ గా చిన్న పాత్ర చేశారు. అనంతరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఐస్ క్రీం అనే అడల్ట్ కంటెంట్ మూవీ చేశారు.
Tejaswi Madivada
ఐస్ క్రీం మూవీ అట్టర్ ప్లాప్. అనంతరం కేరింత, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, బాబు బాగా బిజీ లాంటి చిత్రాల్లో కొంచెం ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేశారు. 2017లో బాలకృష్ణుడు చిత్రం తర్వాత ఆమెకు చాలా గ్యాప్ వచ్చింది.
Tejaswi Madivada
బిగ్ బాస్ సీజన్ 2(Bigg Boss Telugu) లో పాల్గొన్న తేజస్వి మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే ఆమె కనీసం ఫైనల్ కి కూడా వెళ్ళలేదు.హౌస్లో అందాల ప్రదర్శన పైనే దృష్టి పెట్టిన తేజస్వి మాదివాడ 7వ వారం ఎలిమినేట్ అయ్యారు. ఆ సీజన్ విన్నర్ గా కౌశల్ నిలిచాడు.
ఇక హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో తేజస్వికి అవకాశం దక్కింది. ఓటీటీలో కూడా తేజస్వి ప్రభావం చూపలేకపోయారు. ఆమె తక్కువ రోజుల్లోనే ఎలిమినేట్ కావడం జరిగింది. కెరీర్ పరంగా ఆమెకు ఏమీ కలిసి రాలేదు. కనీసం ఓటీటీలో అవకాశాలు వస్తాయని ఆశపడుతున్నారు.