- Home
- Entertainment
- సుమ షోలో బిగ్ బాస్ సోహైల్ కన్నీళ్లు.. తేడాగాడంటూ ట్రోల్స్ చేశారని చెబుతూ ఆవేదన..
సుమ షోలో బిగ్ బాస్ సోహైల్ కన్నీళ్లు.. తేడాగాడంటూ ట్రోల్స్ చేశారని చెబుతూ ఆవేదన..
`బిగ్ బాస్ 4` రియాలిటీ షోలో పాపులర్ అయ్యారు సోహైల్. ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన `సుమ అడ్డా` షోలో కన్నీళ్లు పెట్టుకోవడం హాట్ టాపిక్ అవుతుంది.

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా దూసుకొచ్చాడు సోహైల్ ర్యాన్. బిగ్ బాస్ విన్నర్ కంటే సోహైలే బాగా పాపులర్ అయ్యాడు. అటు చిరంజీవి, ఇటు నాగార్జున ఆయన్ని బాగా ఎత్తేశారు. దీంతో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సోహైల్. వరుసగా సినిమాలకు కమిట్ అయ్యాడు. అవి ఒక్కొక్కటి విడుదలవుతున్నాయి. హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు సోహైల్.
ఇప్పటికే సోహైల్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. `లక్కీ లక్ష్మణ్`, `ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు` చిత్రాల్లో నటించాడు. ఈ సినిమాలు విడుదలై మెప్పించలేకపోయాయి. `లక్కీ లక్ష్మణ్` కాస్త ఫర్వాలేదనిపించినా, ఎస్వీకృష్ణారెడ్డి రూపొందించిన `ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు` చిత్రం డిజాస్టర్ అయ్యింది. తన సినిమాలకు అనుకున్నంత రెస్పాన్స్ రాకపోవడంతో సోహైల్ ఫ్రస్టేట్ అయ్యాడు. ట్రోల్స్ చేస్తున్నారని, తన సినిమాని చంపేస్తున్నారని ఆవేదన చెందాడు. ఇప్పుడు `మిస్టర్ ప్రెగ్నెంట్`తో రాబోతున్నాడు.
తాజాగా సుమ షోలో కన్నీళ్లు పెట్టుకున్నాడు సోహైల్. సుమ కనకాల యాంకర్‌గా చేస్తున్న `సుమ అడ్డా` షోలో పాల్గొన్నాడు సోహైల్. ఆయన హీరోగా నటించిన మరో సినిమా `మిస్టర్ ప్రెగ్నెంట్` చిత్రం ఈ నెల 18న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా `సుమ అడ్డా`లో పాల్గొన్నారు. ఇందులో తనదైన పంచ్‌లు, డైలాగులతో అదరగొట్టాడు. ఆద్యంతం నవ్వులు పూయించాడు. షోని సందడిగా మార్చేశాడు.
కానీ చివర్లో సుమ ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. రియాలిటీ షో నుంచి వచ్చానని, అంతా చిన్న చూపుచూస్తున్నట్టు తెలిపారు. ట్రోల్స్ చేసి దారుణంగా మాట్లాడుతున్నారంటూ ఆయన ఆవేదన చెందాడు. ఇందులో సోహైల్ చెబుతూ, `లైఫ్‌లో ముందుకు ఎలా వెళ్లాలి, యాక్సెప్ట్ చేస్తారా? లేదా రియాలిటీ షో నుంచి వచ్చిండు అని అంటుంటే భయమేస్తుంటది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు సోహైల్.
`మిస్టర్ ప్రెగ్నెంట్` సినిమాని యాక్సెప్ట్ చేసినప్పుడు, ఫస్ట్ గ్లింప్స్ వచ్చినప్పుడు ఏందిరా ఈ తేడాగాడు అంటూ అది ఇది అని ట్రోల్స్ చేశారని వాపోయాడు సోహైల్. సరదాగానవ్వులతో సాగుతున్న షోని ఒక్కసారిగా గుంబనంగా మార్చేశాడు. సోహైల్ కన్నీళ్లు పెట్టుకోవడంతో అటు సుమ, ఇటు అలీ రేజా, రూపా, దీప్తి అంతా షాక్ అయ్యారు. సుమ అడ్డాకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది.
బిగ్ బాస్ 4 సీజన్ పూర్తయ్యాక సోహైల్ సైన్ చేసిన మొదటి మూవీ `మిస్టర్ ప్రెగ్నెంట్`. శ్రీనివాస్ వింజనంపతి దర్శకత్వం వహించారు. అప్పిరెడ్డి నిర్మించారు. ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు విడుదలవుతుంది. ఈ నెల 18న రిలీజ్ చేస్తున్నారు. ఇందులో సోహైల్ ప్రెగ్నెంట్ గా కనిపించబోతున్నారు. సరికొత్త కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఆద్యంతం వినోదాత్మకంగా, ఎమోషనల్‌గా సాగుతుందని తెలుస్తుంది. సినిమాపై నమ్మకంతో ఉంది యూనిట్.