MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వాడి పేరు చెప్పను.. బిగ్ బాస్ న్యాయంగా జరిగి ఉంటే రిజల్ట్ వేరుగా వచ్చేది, శివాజీ హాట్ కామెంట్స్

వాడి పేరు చెప్పను.. బిగ్ బాస్ న్యాయంగా జరిగి ఉంటే రిజల్ట్ వేరుగా వచ్చేది, శివాజీ హాట్ కామెంట్స్

శోభా శెట్టి గొడవతో తనని నెగిటివ్ గా చూపించే ప్రయత్నం చేశారని శివాజీ ఆరోపించారు. శోభా శెట్టి పరాకాష్టకు వెళ్ళింది. అందుకే మా ఇంట్లో ఆడపిల్లలు అయితే.. అంటూ కోపంగా ప్రవర్తించానని శివాజీ అన్నారు.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Dec 31 2023, 05:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ సీజన్ 7 ముగిసింది. కానీ ఆ హీట్ ఇంకా తగ్గలేదు. బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే తర్వాత బయట జరిగిన అల్లర్లు, వాహనాలపై దాడులతో సరికొత్త వివాదం రాజుకుంది. తన అభిమానులని పల్లవి ప్రశాంత్ రెచ్చగొట్టేలా వ్యవహరించాడని, పోలీసులకు సహకరించలేదని అతడిని అరెస్ట్ చేశారు. అయితే పల్లవి ప్రశాంత్ బెయిల్ పై బయటకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఈ క్రమంలో బిగ్ బాస్ షోలో హైలైట్ అయిన మరో కంటెస్టెంట్ నటుడు శివాజీ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.  శివాజీ వరుసగా టివి ఛానల్స్ కి, యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ బిగ్ బాస్ హౌస్ లో జరిగిన సంగతులపై తన అభిప్రాయం చెబుతున్నారు. ఈ క్రమంలో శివాజీ చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 

36

ముఖ్యంగా శోభా శెట్టి గొడవతో తనని నెగిటివ్ గా చూపించే ప్రయత్నం చేశారని శివాజీ ఆరోపించారు. శోభా శెట్టి పరాకాష్టకు వెళ్ళింది. అందుకే మా ఇంట్లో ఆడపిల్లలు అయితే.. అంటూ కోపంగా ప్రవర్తించానని శివాజీ అన్నారు. గేమ్ ఒక దశకు వచ్చాక విన్నర్ ఎవరో.. ఎవరెవరికి ఏ స్థానాలు దక్కుతాయో కూడా నేను అంచనా వేసా. 

46

ఒక సమయంలో ప్రశాంత్ చేతిలో నేను రాసా.. 1, 2, 3 స్థానాల్లో మనం ముగ్గురమే ఉండబోతున్నాం అని శివాజీ అన్నారు. అయితే ఊహించని విధంగా ఒక వ్యక్తిని హైలైట్ చేస్తూ వచ్చారు. బిగ్ బాస్ కూడా అతడిని పొగడడం మమ్మల్ని పక్కన పెట్టడంతో నాకు కాలింది. అతడి పేరు నేను చెప్పను కానీ ఊహించని విధంగా అతడిని కావాలనే హైలైట్ చేశారు. 

56
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

పలుసార్లు పౌల్ గేమ్ ఆడిన వ్యక్తిని రన్నరప్ చేశారు అంటూ శివాజీ పరోక్షంగా అమర్ దీప్ పై ఫైర్ అయ్యారు. ఇలాంటి తప్పిదాల వల్ల నాగార్జున గారికి బ్యాడ్ నేఁ రాకూడదు. అందుకే నేను శోభా శెట్టి విషయంలో నాగార్జునతో గట్టిగా మాట్లాడినట్లు శివాజీ పేర్కొన్నారు. గేమ్ న్యాయంగా జరిగి ఉంటే టాప్ 3లో ప్రశాంత్, నేను, యావర్ ఉండేవాళ్ళం అని శివాజీ అన్నారు. 

66

ఏది ఏమైనా రిజల్ట్ వచ్చేసింది కాబట్టి దానిని మనం గౌరవించాలి. నేను కామన్ మ్యాన్ కి సపోర్ట్ ఇవ్వాలని అనుకున్నా అది చేశా. అలాగని ప్రశాంత్ కి పూర్తిగా నేను సపోర్ట్ చేయలేదు. వాడి గేమ్ వాడు ఆడాడు గెలిచాడు అని శివాజీ అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image2
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Recommended image3
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved