MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శివాజీ చిన్న కొడుకు కాలేజ్ టాపరా, అంతలా భయపెట్టి కొట్టి చదివించారా.. ఫ్రెండ్స్ ని కూడా ఇంటికి రానివ్వడట

శివాజీ చిన్న కొడుకు కాలేజ్ టాపరా, అంతలా భయపెట్టి కొట్టి చదివించారా.. ఫ్రెండ్స్ ని కూడా ఇంటికి రానివ్వడట

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 7 ఎంతటి వినోదాన్ని అందించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీజన్ 7 అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ఫినాలే ముగిసిన తర్వాత కూడా ఆడియన్స్ బిగ్ బాస్ ని మరచిపోవడం లేదు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 03 2024, 02:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 7 ఎంతటి వినోదాన్ని అందించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీజన్ 7 అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ఫినాలే ముగిసిన తర్వాత కూడా ఆడియన్స్ బిగ్ బాస్ ని మరచిపోవడం లేదు. పల్లవి ప్రశాంత్ విషయంలో జరిగిన వివాదాలే అందుకు కారణం. మరో వైపు శివాజీ కెరీర్ లో కూడా మునుపటి జోష్ వచ్చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

శివాజీ హౌస్ నుంచి బయటకి వచ్చాక ఆయన నటించిన 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఈటివి విన్ ఓటిటిలో జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో శివాజీ వరుసగా యూట్యూబ్ ఛానల్స్ లో, టివి ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ వెబ్ సిరీస్ లో శివాజీ ముగ్గురు పిల్లల తండ్రిగా టీచర్ గా నటిస్తున్నారు. 

37

తొలిప్రేమలో పవన్ కళ్యాణ్ కి చెల్లిగా నటించిన వాసుకి శివాజీ భార్యగా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ విశేషాలు చెబుతూ శివాజీ తన ఇద్దరు కొడుకుల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నప్పుడు ఒక తండ్రిగా మీ తనయులని గుర్తు చేసుకున్నారా అని ప్రశ్నించగా.. నా చిన్న కొడుకు లోని పోలికలు ఈ వెబ్ సిరీస్ లో పిల్లాడిలా కనిపించాయి అని అన్నారు. 

47

మా చిన్న కొడుకు రిక్కీ క్యరెక్టర్ తో బాగా కనెక్ట్ అయ్యా. అయితే వెబ్ సిరీస్ లో శివాజీ చిన్న కొడుకుకి చదువుపై ఆసక్తి లేనట్లుగా ట్రైలర్ లో చూపించారు. కానీ రియల్ లైఫ్ లో తన చిన్న కొడుకు రిక్కీ చాలా బాగా చదువుతాడు అని శివాజీ అన్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో రిక్కీకి 95 శాతం మార్కులు వచ్చినట్లు శివాజీ తెలిపారు. 

57

అంటే ఒకరకంగా పుస్తకాల పురుగు అన్నమాట. నాతో రిక్కీ మాట్లాడే విధానం కానీ.. నవ్వుతూనే నాపై సెటైర్లు వేయడం, ఆర్గుమెంట్ చేయడం లాంటివి రిక్కీ చేస్తాడు. అలాంటి లక్షణాలన్నీ వెబ్ సిరీస్ లో చిన్న పిల్లవాడి పాత్రలో కనిపించినట్లు శివాజీ తెలిపారు. చదువు విషయంలో నా పిల్లలని ఎప్పుడూ కొట్టాల్సిన అవసరం రాలేదు. ఇద్దరూ బాగా చదువుతారు. 

67

రిక్కీ అయితే నేను స్టేట్ ఫస్ట్ వస్తాను అనే కాన్ఫిడెట్స్ తోనే ఎప్పుడూ చదువుతాడు. ఒక్క మార్కు తగ్గినా బాధపడతాడు. చిన్నప్పటి నుంచి చదువు విషయంలో భయపెట్టాను కానీ ఎప్పుడూ కొట్టలేదు అని శివాజీ అన్నారు. ఇక రిక్కీ తన ఫ్రెండ్స్ ని కూడా ఎప్పుడూ ఇంటికి తీసుకురాలేదు. రిక్కీ రెండేళ్లకో మూడేళ్లకో స్కూల్ మారుతూనే ఉన్నాడు. కాబట్టి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. ఏరా మీ ఫ్రెండ్స్ ఎవ్వరూ మన ఇంటికి రారేంటి అని కూడా అడిగినట్లు శివాజీ తెలిపారు. 

77

పెద్ద కొడుకు కిన్నికి కూడా ఎక్కువగా ఫ్రెండ్స్ లేరు అని అన్నారు. బహుశా ఫ్రెండ్స్ ని తీసుకువస్తే నేను తిడతానేమో అని భయం కావచ్చు అని శివాజీ అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
CM Vijay Trisha: సీఎం విజయ్ తో ఒకే కారులో త్రిష, ముఖ్యమంత్రి అయ్యాక ఫస్ట్ టైమ్ కలిసి కపించిన జంట
Recommended image2
Pushpa 3: పుష్ప 3 రిలీజ్ డేట్ ఫిక్స్ ? జగపతి బాబు ఇచ్చిన మాస్ అప్‌డేట్!
Recommended image3
TV Actresses: తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ 10 గ్లామరస్ బ్యూటీలు.. వీళ్ళ అందం ముందు హీరోయిన్లు కూడా బలాదూర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved