బిగ్ బాస్ 8 టోటల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ చేసిన ఆదిరెడ్డి... డేట్ కూడా ఫిక్స్!
బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ వీరే అంటూ ఆదిరెడ్డి విడుదల చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఈసారి హౌస్లోకి వెళ్ళేది ఎవరో ఆయన చెప్పేశారు. అలాగే సీజన్ ఎప్పుడు మొదలయ్యేది కూడా హింట్ ఇచ్చారు. మరి ఈ సీజన్ కంటెస్టెంట్ ఎవరో చూద్దామా?

Bigg Boss Telugu 8
బిగ్ బాస్ రియాలిటీ షో సామాన్య జనాల్లోకి కూడా వెళ్ళిపోయింది. ఒకప్పుడు యూత్ కి, చదువుకున్న వాళ్లకు మాత్రమే ఈ షో ఎక్కేది. సీజన్స్ పెరిగే కొద్దీ బిగ్ బాస్ షో అంటే ఏమిటో పెద్దవాళ్ళు, నిరక్షరాస్యులు కూడా అర్థం చేసుకుంటున్నారు. సీజన్ 7 సక్సెస్ కి కారణం కూడా అదే.
రైతుబిడ్డ ట్యాగ్ తో హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ కి గ్రామీణ ప్రాంతాల ఆడియన్స్ ఎక్కువగా ఓటు వేశారు. ఒక సామాన్యుడిని విన్నర్ చేశారు. సీజన్ 6 డిజాస్టర్ కావడంతో డీలా పడిన మేకర్స్ కి సీజన్ 7 సక్సెస్ జోష్ ఇచ్చింది. ఇదే జోరులో సీజన్ 8 ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Adi Reddy
బిగ్ బాస్ లవర్స్ ని ఆకర్షించే అత్యంత కీలక అంశం కంటెస్టెంట్స్ ఎవరు. షో సక్సెస్ దీని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే నిర్వాహకులు ఈ విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకుంటారు. కాగా సీజన్ 6 కంటెస్టెంట్, బిగ్ బాస్ రివ్యూవర్ సీజన్ 8 కంటెస్టెంట్స్ వీరే అంటూ ఒక వీడియో విడుదల చేశాడు.
ఆదిరెడ్డి అందిస్తున్న సమాచారం ప్రకారం సీజన్ 8 కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం.. యూట్యూబర్ బంచిక్ బబ్లు, హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ సోనియా సింగ్, నటి హేమ, ఫార్మింగ్ నేత్ర, నేత్ర మాజీ భర్త వంశీ, రీతూ చౌదరి, సురేఖావాణి లేదా ఆమె కూతురు సుప్రీత, కిరాక్ ఆర్పీ, కుమారి ఆంటీ, బర్రెలక్క, హీరోయిన్ కుషిత కల్లపు,
బుల్లెట్ భాస్కర్, చమ్మక్ చంద్ర, అమృత ప్రణయ్ వచ్చే అవకాశం ఉందట. అలాగే నీతోనే డాన్స్ 2.0 పాల్గొన్న ఒక జంట, లేదా జంటలో ఒకరు రావచ్చట. అంజలీ పావని, యాంకర్ శివ, నయని పావని, యాంకర్ స్రవంతి చొక్కారపు, మాస్టర్ చెఫ్ సంజయ్, రైతుబడి రాజేంద్రరెడ్డి, ప్రసాద్ టెక్ ఇన్ యూట్యూబర్, ఫారిన్ లో సెటిలైన వ్లాగర్స్ లో ఒకరు ఉండొచ్చు అంటున్నారు.
reva party hema
నటి హేమ ఆల్రెడీ ఒక సీజన్ లో పాల్గొన్నారు. రేవ్ పార్టీ కేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తున్న నేపథ్యంలో మరో ఛాన్స్ ఇవ్వొచ్చు. నయని పావని గత సీజన్ లో కాంటెస్ట్ చేసింది. అయితే కేవలం ఒక వారానికే ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొన్న శివకు మరో ఛాన్స్ రావచ్చని అంటున్నారు.
Bigg Boss Telugu 8
ఇక బిగ్ బాస్ సీజన్ 8 గతంలో మాదిరే సెప్టెంబర్ 1 నుండి ప్రారంభం అవుతుందట. అయితే ఆదిరెడ్డి కేవలం అంచనా వేసి ఈ కంటెస్టెంట్స్ పేర్లు చెప్పారు. ఇది అధికారిక సమాచారం కాదు. ఆదిరెడ్డి చెప్పిన పేర్లలో కొందరు అయితే కచ్చితంగా హౌస్లోకి వెళతారు.