బిగ్ బాస్ లవర్స్ ఆశలపై నీళ్లు... అనూహ్యంగా రద్దు, సెట్ కూడా పీకేస్తున్నారట!
బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. ఈ క్రమంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2 కి ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు హల్చల్ చేశాయి. త్వరలో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ ప్రసారం అవుతుందనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా రద్దయినట్లు వార్తలు వస్తున్నాయి.

Nagarjuna
బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ సక్సెస్. భారీ టీఆర్పీ దక్కించుకుంది. ఫినాలే అయితే ఏకంగా 21 టీఆర్పీ తెచ్చుకున్నట్లు సమాచారం. నాగార్జున హోస్టింగ్, కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్ అదిరిపోయింది. ప్రేక్షకులు సీజన్ 7 కి కనెక్ట్ అయ్యారు.
Nagarjuna
బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరవుతారనే ఉత్కంఠ నడిచింది. ముఖ్యంగా శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ పేర్లు టైటిల్ రేసులో వినిపించాయి. ఫైనల్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు.
Nagarjuna
బిగ్ బాస్ తెలుగు 7 సక్సెస్ నేపథ్యంలో ఓటీటీ వెర్షన్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూర్తి అయ్యిందని, కొందరు సెలెబ్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. బర్రెలక్క, భోలే షావలి, నయని పావనితో పాటు మరికొందరు పార్టిసిపేట్ చేస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి.
Nagarjuna
ఫిబ్రవరి నుండి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ప్రారంభం కానుందన్నారు. అయితే అనూహ్యంగా షో రద్దు అయ్యిందట. అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ వేయడానికి నిర్ణయించిన ప్రదేశం కూడా వేరే ఛానల్ మరో షోకి బుక్ చేసుకుందట. ఈ క్రమంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2 కి ఛాన్స్ లేదంటున్నారు.
Nagarjuna
2022లో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ వన్ ప్రసారం అయ్యింది. ఓ మోస్తరు ఆదరణ దక్కించుకుంది. హీరోయిన్ హిమబిందు విజేతగా నిలిచింది. కారణం తెలియదు కానీ... గత ఏడాది ఓటీటీ వెర్షన్ ప్రసారం కాలేదు. సీజన్ 6 అట్టర్ ప్లాప్ కావడం కూడా దీనికి కారణం. 2024లో కూడా బిగ్ బాస్ ఓటీటీ లేదు అంటున్నారు.