3 సార్లు చావు దాకా వెళ్ళొచ్చా.. ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ ఆవేదన,
జీవితంలో తాను పడ్డ కష్టాలు.. అనుభవాలను ఆడియన్స్ తో పంచుకున్నారు బిగ్ బాస్ ఫేమ్.. ట్రాన్స్ జెంటర్ స్టార్ ప్రియాంకసింగ్. అవమానాలు భరించలేక 3 సార్లు చావాలి అనుకున్నారట ప్రియాంక.
ప్రియాంక సింగ్ ఈపేరు ఒకప్పుడు ఎవరికీ తెలియదు.. కాని ఇప్పుడు ప్రియాంక సింగ్ అంటే ఒక స్టార్. ట్రాన్స్ జెండర్స్ అంటే చిన్న చూపు చూస్తున్న ఈ సమాజాంలో.. వారికి కూడా ఒక గుర్తింపు, గౌరవం ఇచ్చేలా.. వారి కాళ్ళ మీద వారు నిలబడుతూ.. గౌరవంగా బ్రతికే వారు ఉన్నారు. వారిలో ప్రియాంక సింగ్ కూడా ఒకరు. అవ్వటానికి ట్రాన్స్ అయినా.. ప్రియాంక సింగ్ గ్లామర్ ముందు ఆడవాళ్లు కూడా తక్కువే..బ్యూటీని అంతలా మెయింటేన్ చేస్తూ.. స్టార్ గా ఎదుగుతూ ఉంది ప్రియాంక.
అయితే ప్రియాంకసింగ్ జబర్థస్త్ ఫాలో అయ్యే కొంత మందికే తెలుసు.. అంతే కాదు ఒకప్పుడు ఎవరికీ తెలియని ఈ బ్యూటీ.. బిగ్ బాస్ తరువాత అందరికి సుపరిచితురాలు అయ్యింది. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా ఇప్పుడు అందరిలో ప్రియాంక పాపులర్ అయ్యింది. పుట్టుకతో అబ్బాయి అయినా కూడా .. తనలో ఉన్న అమ్మాయి లక్షణాలను గుర్తించి.. తనను తాను అమ్మాయిగా మలుచుకుంది ఈక్రమంలో తాను అనుభవించిన నరకం. అవమానాలు.. ఆటు పోట్లు తలుచుకుని ఎమోషనల్ అయ్యిందిపింకీ.
ఎన్నో కష్టాలు చూసి.. అవమానాలు ఎదుర్కొని.. చావాలనుకున్న ఆలోచనను కూడా జయించి.. దైర్యంగా ఈరోజు అమ్మాయిగా సొసైటీలోను .. అటు ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపును తెచ్చుకుంది ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ. ఇక సోషల్ మీడియాలో ఆమె చేసే హడావిడి అంతా ఇంతా కాదు.. హీరోయిన్లు సైతం అసూయా పడే అందం పింకీ సొంతం. బిగ్ బాస్ తర్వాత పింకీ క్రేజ్ మరింత పెరుగుతూ వస్తుంది.
అటు పలు టీవీ షోస్ లోను.. ఇటు సోషల్ మీడియాలోను నిత్యం తన ఫోటోలను షేర్ చేస్తూ.. కుర్రకారు హృదయాలను దోచుకుంటుంది. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక .. తానూ అమ్మాయిగా మారడానికి కంటే ముందు.. మారిన తరువాత తాను ఫేస్ చేసిన సమస్యల గురించి .. అనేక సందర్భాలలో తానూ పడిన అవమానాల గురించి.. ఓపెన్ అయ్యింది పింకీ. అంతే కాదు ఇంత వరకూ ఆమె ఎక్కడ చెప్పని కొన్ని రహస్యాలు కూడా ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది పింకీ.
చిన్నతనం నుంచి అమ్మాయి లక్షణాలు ఉండటంతో.. చిన్నతనంలోనే తన అక్క డ్రెస్ లు వేసుకుని మురిసిపోయిందట పింకీ.. ఇక టెన్త్ క్లాస్ వచ్చే సరికి ఆ ఆలోచనలు పెరిగిపోయాయి.. రాను రాను నాకు అమ్మాయిగా ఉండాలనిపించింది. అలా పదవ తరగతి తర్వాత హైదరాబాద్ కు వచ్చాను. ఆపని ఈపని చేస్తూ..మేకప్ ఆర్టిస్ట్ గా చేశారు.. అలా జబర్దస్త్ స్టేజ్ ఎక్కాను.. లేడీ గెటప్ లు వేశాను.. కొంత డబ్బు సమకూర్చుకుని.. ఆడబ్బుతో సర్జరీ చేయించుకున్నాను అన్నారు పింకీ.
సర్జరీ అయితే అయ్యింది కాని.. నా అన్నవారు నాతో లేరు.. నన్ను చూసుకునేవారు లేరు.. విపరీతమైన నొప్పి.. రక్తం కారిపోతోంది.. అయినా సరే పట్టుదలతో నన్ను నేను ఓదార్చుకుని.. డిల్లీ ఏయిర్ పోర్ట్ నుంచి గేట్ వరకూ నడుచుకుంటూవెళ్ళాను. సర్జరీ తరువాత హెల్త్ కండీన్ బాగా పాడైపోయింది. ఇక నేను ఉంటానో లేదో కూడా తెలియదు.. ఆ టైమ్ లో ఎంతో బాధను అనుభవించాను.. అన్నారు ప్రియాంక సింగ్.
అంతే కాదు అనారోగ్యంతో తాను ఇంకొన్ని సర్జరీలు చేయించుకోవల్సి వచ్చిందట. దాంతో తన బ్యాంక్ బ్యాలన్స్ మొతం జీరో అయిపోయిందని . మళ్ళీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయి వరకు చేరుకున్నాను అంటూ ఆమె తన భాధను వెల్లడించింది పింకీ. అంతే కాదు జీవితంలో అన్ని కోల్పోయానేమో అన్న బాధలో మూడు సార్లు సూసైడ్ చేసుకుందట ప్రియాంక సింగ్. కాని మూడు సార్లు మరణం చివరి వరకూ వెళ్ళి బయటకు వచ్చాను అంటుంది బ్యూటీ.
స్కూల్ డేస్ లో.. ముఖ్యంగా 10 లో అవమానాలు చాలా జరిగాయి. అందరూ హేళన చేసేవారు.. కాని నేను పట్టించుకోలేదు..కాని అందరూ ఏదైతే అన్నారో నాన్న నోటి నుంచి కూడా అదే మాట వచ్చింది అప్పుడు తట్టుకోలేకపోయాను.. వెంటనే కిరోసిన్ పోసుకునిఅంటించుకున్నాను. 60 శాతం కాలిపోయినా కూడా హాస్పిటల్ కు తీసుకువెళ్తే బ్రతికిపోయాను అన్నారు ప్రియాంక. ఇక నా జీవితంలో ఒకరినే చాలా ఘాడంగా ప్రేమించాను.. ఆ ప్రేమలో ఫెయిల్ అయినపుడు.. స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నాను.. అప్పుడు కూడా బ్రతికి బయట పడ్డాను..
ఇక ఆ తర్వాత సర్జరీ అయ్యాక ఆర్థరైటిస్ రావడంతో .. ఆ బాధ భరించలేక మళ్ళీ స్లీపింగ్ పిల్స్ తీసుకున్నాను.. అప్పుడు కూడా నేను చావలేదు. దాంతో నాకు ఇక్కడ ఏదో రాసి పెట్టి ఉంది అనిపించింది. అందుకే దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడేమో అనిపించింది. అందుకే మొండిగా బ్రతకడం నేర్చుకున్నాను.. ఒక్కొ మెట్టు ఎక్కుతూ.. కాస్త ఈ పోజిషన్ కు వచ్చాను. ప్రస్తుతం హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను అన్నారు ప్రియాంక సింగ్.
ఆమె చేతిలో ప్రస్తుతం బోలెడు ఆఫర్లు ఉన్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తుందట. అలాగే చిన్న చిన్న సినిమాలతో పాటు హీరోయిన్ గా కూడా చేస్తుందట ప్రియాంక. అయితే బిగ్ బాస్ లో కూడా మానసు ను ప్రియాంక ఇష్టపడింది. బయటకు చెప్పకపోయినా.. ప్రేమించింది. కాని సమాజాం ప్రభావ.. మానస్ పర్సనల్ లైఫ్ ను డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేక ఆమె వెనకడుకు వేసింది.