ఏడాది వరకు మరో ఛానల్ లో నో ప్రోగ్రాం... బిగ్ బాస్ అగ్రిమెంట్ ఎంత కఠినమో బయటపెట్టిన అవినాష్!
First Published Dec 31, 2020, 5:21 PM IST
బిగ్ బాస్ హౌస్ లో ఉండడం అంత చిన్న విషయం కాదు. ఎమోషనల్ గా ఫిజికల్ గా పోరాడాల్సి ఉంటుంది. హౌస్ లో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు ఒక్కొక్కసారి యుద్ధాన్ని తలపిస్తాయి. బిగ్ బాస్ ఆదేశం వస్తుందంటే చాలు కంటెస్టెంట్స్ భయపడతారు. కంటెస్టెంట్స్ బయటికి వచ్చాక కూడా తిప్పలు వుంటాయని అవినాష్ తాజా ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

బిగ్ బాస్ నిర్వాహకులు పెట్టే కొన్ని కఠిన నియమాలు, అగ్రిమెంట్స్ గురించి ఆయన తెలియజేయగా, అందరూ షాక్ అవుతున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అవినాష్ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. (Photo courtesy: Mirror Tv)

బిగ్ బాస్ ప్రసారమైన స్టార్ మా ఛానల్స్ వారు హౌస్లో కి వెళ్లే ప్రతి కంటెస్టెంట్ తో అగ్రిమెంట్ చేసుకుంటారట. దాని ప్రకారం... హౌస్ నుండి బయటికి వచ్చిన ఏ కంటెస్టెంట్ ఏడాది వరకు ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనకూడదట. కేవలం ఈవెంట్స్, సినిమాలలో నటించడానికి ఛాన్స్ ఇస్తారట.
(Photo courtesy: Mirror Tv)
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?