భర్త చంకనెక్కిన బిగ్ బాస్ బ్యూటీ పూజా రామచంద్రన్, బెబీ బంప్ ఫోటోలతో సందడిచేస్తోన్న చిన్నది.
భర్త చంకనెక్కింది బిగ్ బాస్ బ్యూటీ పూజా రామచంద్రన్. ప్రస్తుతం ప్రెగ్నెస్సీతో ఉన్న పూజా భర్తతో కలిసి సందడి చేస్తోంది. ఈ ఫోటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ గా కంటే క్యారెక్టర్ రోల్స్ తో బాగా పాపులర్ అయ్యింది పూజా రామచంద్రన్. బిగ్ బాస్ తో మరింత ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఆతరువాత పెద్దగాకనిపించలేదు. ప్రస్తుతం భర్తతో ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది బ్యూటీ. సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తూ సందడి చేస్తోంది.
ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయిన పూజా రామచంద్రన్.. బేబీ బంప్ ఫోటోస్ తో సందడి చస్తోంది. భర్తతో కలిసి స్విమ్మింగ్ ఫూల్ లో సందడి చేస్తోంది. ప్రెగ్నెస్సీతో ఉన్నా కూడా హాట్ హాట్ ఫోటోస్ ఆపడం లేదు బ్యూటీ. భర్తతో కిస్సింగ్ ఫోటోలతో నెట్టింట హడావిడి చేస్తోంది.
2022 నవంబర్లో తాను ప్రెగ్నెంట్ అంటూ అసలు విషయాన్ని వెల్లడించింది పూజా రామచంద్రన్. అప్పటి నుంచీ తన బేబీ బంప్ ఫొటోలతో ఇన్ స్టాను నింపేస్తోంది. ఇదే క్రమంలో తాజాగా ఈమె బేబీ బంప్ తోనే తన భర్త చంకనెక్కి హాట్ టాపిక్ అయ్యింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఇక పూజా రామచంద్రన్ పెళ్లి విషయంలో కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. ముందుగా 2010 లో విజె క్రేప్గ్ ను పెళ్లాడిన పూజా రామచంద్రం ఏడేళ్లు అతనితో కాపురం చేసింది. ఆ తర్వాత అతనితో మనస్పర్థలు రావడంతో 2017లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత యాక్టర్ జాన్ కొక్కెన్ ను పెళ్లాడింది. అతను తమిళ నటుడు.. తెలుగులో కూడా చాలా సినిమాలు చేశాడు.
జాన్ కొక్కెన్ ని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్నిస్టార్ట్ చేసింది పూజా రామచంద్రన్. అయితే జాన్ కు కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం. సార్పట్ట సినిమాలో విలన్ గా నటించి బాగా పాపులర్ అయ్యాడు జాన్.. రీసెంట్ గా అయ్యాడు. అజిత్ హీరోగా వచ్చిన తెగింపు బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు.
ఇక పూజా రామచంద్రన్ విషయానికి వస్తే.. టాలీవుడ్, కోలీవుడ్ లో.. సిద్దార్థ్ హీరోగా రూపొందిన లవ్ ఫెయిల్యూర్, నిఖిల్ హీరోగా రూపొందిన స్వామి రారా, నాగ చైతన్య హీరోగా రూపొందిన దోచేయ్ , లారెన్స్ హీరోగా తెరకెక్కిన గంగ, నాని హీరోగా రూపొందిన కృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యింది బ్యూటీ.
ఇక పూజా రామచంద్రన్ టాలీవుడ్ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ 2 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగు పెట్టింది. గేమ్ లో తన మార్క్ చూపించింది కాని చివరి వరకూ ఉండలేకపోయింది పూజా రామచంద్రన్. 4 వారాలు మాత్రమే హౌస్ లో ఉండి ఎలిమినేట్ అయ్యింది.