MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రైతుబిడ్డ ముసుగులో పల్లవి ప్రశాంత్ సైడ్ బిజినెస్... వాళ్ళ దగ్గర లక్షలు వసూలు చేస్తున్న బిగ్ బాస్ విన్నర్!

రైతుబిడ్డ ముసుగులో పల్లవి ప్రశాంత్ సైడ్ బిజినెస్... వాళ్ళ దగ్గర లక్షలు వసూలు చేస్తున్న బిగ్ బాస్ విన్నర్!

 పల్లవి ప్రశాంత్ వ్యవసాయం వదిలేసి సైడ్ బిజినెస్ స్టార్ట్ చేశాడట. ఆ విధంగా లక్షలు సంపాదిస్తున్నాడట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : May 21 2024, 05:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Pallavi Prashanth

Pallavi Prashanth

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా అవతరించాడు పల్లవి ప్రశాంత్. ఒక సామాన్యుడు టైటిల్ కొట్టడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ కామనర్ టైటిల్ కొల్లగొట్టాడు. రైతుబిడ్డ ట్యాగ్ తో హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ కి ఆ ట్యాగ్ కూడా ప్లస్ అయ్యింది. 


 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Pallavi Prashanth

Pallavi Prashanth

 ఫినాలే రోజు కొన్ని అనుచిత పరిణామాలు చోటు చేసుకున్నాయి. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో ఎదుట అల్లర్లకు పాల్పడ్డారు. పోలీసుల సూచనలు పక్కన పెట్టి ర్యాలీ చేసిన పల్లవి ప్రశాంత్ ర్యాలీ నిర్వహించడం వివాదాస్పదం అయ్యింది. కేసులు పెట్టిన పోలీసులు పల్లవి ప్రశాంత్ తో పాటు అత్తని తమ్ముడిని అరెస్ట్ చేశారు. 

36
Pallavi Prashanth

Pallavi Prashanth

రెండు రోజుల అనంతరం పల్లవి ప్రశాంత్ బెయిల్ మీద విడుదలయ్యాడు. పల్లవి ప్రశాంత్ స్టార్ మా లో ప్రసారమైన కొన్ని ఈవెంట్స్ లో పాల్గొన్నాడు. అలాగే తోటి కంటెస్టెంట్స్ తో  గెట్ టుగెదర్ పార్టీలు ఎంజాయ్ చేశాడు. హౌస్లో తనతో సన్నిహితంగా ఉన్న శివాజీ, ప్రిన్స్ యావర్ లను పలుమార్లు కలిశాడు పల్లవి ప్రశాంత్.

46
Pallavi Prashanth

Pallavi Prashanth

అయితే పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాట పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. తాను టైటిల్ గెలిస్తే ఆ ప్రైజ్ మనీ పేద రైతులకు పంచేస్తానని పల్లవి ప్రశాంత్ మాట ఇచ్చాడు. బిగ్ బాస్ షో ముగిసి ఐదు నెలలు అవుతున్నా పల్లవి ప్రశాంత్ ఆ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఒక లక్ష రూపాయలు మాత్రం పంచి పెద్ద ఆర్భాటం చేశాడు. మిగతా డబ్బులు కూడా పంచి వీడియోలు షేర్ చేస్తానని అన్నాడు. 
 

56
Pallavi Prashanth

Pallavi Prashanth

లక్ష రూపాయలు పంచి సైలెంట్ అయిపోయిన పల్లవి ప్రశాంత్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతని గురు శివాజీని కూడా నెటిజెన్స్ ఏకి పారేస్తున్నారు. మిగతా డబ్బులు ఎప్పుడు పంచుతారని కామెంట్స్ పెడుతున్నారు. 
 

66
Pallavi Prashanth

Pallavi Prashanth


మరోవైపు పల్లవి ప్రశాంత్ తన ఫేమ్ ని బాగానే వాడుకుంటున్నాడట. షాప్ ఓపెనింగ్స్, ఈవెంట్స్ కి వెళుతూ డబ్బులు ఛార్జ్ చేస్తున్నాడట. రూ. 2 నుండి 5 లక్షల వరకు ఒక ఈవెంట్ కి కలెక్ట్ చేస్తున్నాడట. నెలకు పల్లవి ప్రశాంత్ సంపాదన రూ. 20 లక్షల పైనే అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా అతనికి మరికొంత డబ్బులు లభిస్తుంది. మొత్తంగా పల్లవి ప్రశాంత్ ఆర్థికంగా సెటిల్ అయ్యాడనే వాదన వినిపిస్తోంది.. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR CM: ఎన్టీఆర్‌ సీఎం అవడం పక్కా, ఆయన పార్టీలో చేరతాం.. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Recommended image3
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved