కుమారి ఆంటీ బిజినెస్ ని దెబ్బతీసిన బిగ్ బాస్ కీర్తి... ఒక్క వీడియోతో అంతా మటాష్!
తెలుగు రాష్ట్రాల్లో కుమారి ఆంటీ సంచలం కాగా రోజుకు వందల మంది ఆమె వద్ద భోజనం కొనుగోలు చేస్తున్నారు. ఆమెకు ఉన్న గుడ్ విల్ దెబ్బ తీసేలా బిగ్ బాస్ కీర్తి భట్ వీడియో చేసి వదిలింది.
Keerthi bhat
కుమారి ఆంటీ అనూహ్యంగా పాప్యులర్ అయ్యారు. దశాబ్దానికి పైగా కుమారి ఆంటీ హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తుంది. వెజ్, నాన్ వెజ్ వంటకాలతో ఆమె భోజనం అందిస్తున్నారు. రోజుకు వందల మంది ఆమె వద్ద భోజనం చేస్తారు.
Keerthi bhat
దీంతో యూట్యూబర్స్ ఆమె వీడియోలు చేసి సోషల్ మీడియాలో వదిలారు. అవి కాస్తా వైరల్ కావడంతో సెలబ్రిటీ అయిపోయింది. ఆమె కస్టమర్స్ సంఖ్య భారీగా పెరగడంతో... దుకాణం వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లా అండ్ ఆర్డర్ సమస్య నేపథ్యంలో పోలీసులు కుమారి ఆంటీ దుకాణం క్లోజ్ చేయించారు.
Kumari Aunty
అయితే విపరీతమైన నెగిటివిటి వచ్చింది. ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలుగజేసుకుని ఆమె వ్యాపారాన్ని పునరుద్ధరించుకునేలా ఆదేశాలు జారీ చేశాడు. ఈ సంఘటన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కుమారి ఆంటీ పేరు మారుమ్రోగింది.
Keerthi bhat
బుల్లితెర షోలలో కూడా ఆమె సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే... బిగ్ బాస్ ఫేమ్, సీరియల్ నటి కీర్తి భట్.. కుమారి ఆంటీ ఫుడ్ పై నెగిటివ్ రివ్యూ ఇచ్చింది. తనకు కాబోయే భర్త విజయ్ కార్తీక్ తో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్లిన కీర్తి... భోజనం టేస్ట్ చేసింది.
Keerthi bhat
అనంతరం... కార్తీక్, కీర్తి తమ అభిప్రాయం తెలియజేశారు. అక్కడ కుమారి ఆంటీ లేదట. వైట్ రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై తీసుకున్నారట. కీర్తి కనీసం ఒక్క ముద్ద కూడా తినలేకపోయిందట. ప్లేటు పక్కన పడేసి వేరే ఫుడ్ స్టాల్ వద్ద భోజనం చేయగా... అది కొంచెం బెటర్ అట.
Keerthi bhat
అసలు ఎందుకు అంత హైప్ వచ్చిందో తెలియదు. కుమారి ఆంటీ భోజనం అసలు ఏం బాగోలేదు. ధరలు కూడా ఎక్కువ. కొంచెం వైట్ రైస్, నాలుగు చికెన్ ముక్కలు వేసి రూ. 170 తీసుకుంటున్నారు. ఆ ధరకు ఫుడ్ వర్త్ కాదు. మాకు నచ్చలేదు. ఒకటే కారం. కుమారి ఆంటీ కంటే నేను చాలా బాగా చేస్తాను, అని కీర్తి అన్నారు.
Kumari Aunty
కీర్తి భట్ వీడియో పై మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. కొందరు ఆమెను సమర్థిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. నిజం ఏదైనా... కీర్తి భట్ కామెంట్స్ కుమారి ఆంటీ బిజినెస్ ని దెబ్బ తీసేలా ఉన్నాయి. కీర్తి మాటలు విన్నవారు కుమారి ఆంటీ వద్ద భోజనం చేసేందుకు ఇష్టపడకపోవచ్చు...