బంపర్ ఆఫర్: హీరోయిన్ గా బిగ్ బాస్ ఇనాయ... హీరో ఎవరంటే?
బిగ్ బాస్ ఫేమ్ ఇనాయ సుల్తానా బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆమె హీరోయిన్ గా ఓ మూవీ తెరకెక్కుతుంది. ఈ మేరకు ప్రకటన జరిగింది.

ఇనాయ సుల్తానా దశ తిరిగేలా కనిపిస్తుంది. ఆమెకు హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. దీంతో అమ్మడు ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు. 'నటరత్నాలు' టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రానికి ఇనాయ హీరోయిన్ గా ఎంపికయ్యారు. శివ నాగు ఈ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. ఈ మూవీలో హీరో, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.
బిగ్ బాస్ సీజన్ 6 ముగిసి చాలా నెలలు అవుతుంది. ఇనాయకు ఎలాంటి బ్రేక్ రాలేదు. చెప్పుకోదగ్గ ఆఫర్ లభించలేదు. మొదటిసారి ఆమెకు హీరోయిన్ గా ఆఫర్ దక్కింది. నటరత్నాలు మూవీలో ఆమె హీరోయిన్ గా అలరించనుంది. ఈ ప్రాజెక్ట్ పై ఇనాయ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ షోతో ఇనాయ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ రాబట్టారు.
Bigg Boss Telugu 6
బిగ్ బాస్ తెలుగు 6 షోలో బలమైన కంటెస్టెంట్‌గా నిలిచింది ఇనయ. ఆమె సైలెంట్‌గా తన గ్రాఫ్‌ని పెంచుకుంటూ వచ్చింది. పది వారాల తర్వాత ఒక్కసారిగా టాప్ లీగ్‌లోకి దూసుకొచ్చింది. బెస్ట్ కెప్టెన్‌గా, క్వీన్ ఆఫ్ ది హౌజ్‌గా నిలిచిన ఇనయ కానీ అనూహ్యంగా 14వ వారంలో ఎలిమినేట్ అయ్యింది. ఇనయ ఎలిమినేషన్ విషయంలో పెద్ద చర్చ జరిగింది. అది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అనే పలువురు తప్పుబట్టారు .
అప్పటి వరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న ఇనయ ఎలిమినేట్ కావడమేంటని దుయ్యబట్టారు. బిగ్ బాస్ షోపైనే విమర్శలు తలెత్తాయి. ఇలాంటి పనుల వల్లే బిగ్ బాస్ పై అభిప్రాయం పోతుందని, కొందరిని సేవ్ చేయడం కోసం బలమైన వారిని పంపించడం దుర్మార్గం అంటూ దుమ్మెత్తిపోశారు.
బిగ్ బాస్ షో ద్వారా ఇనాయ సుమారు రూ. 20 లక్షలు పారితోషికంగా అందుకుందట. రోజుకి ఆమెకి ఇరవై వేలు ఇచ్చేవారట. వారానికి లక్షా నలభై వేలు అందుకోగా, 14 వారాలకు గానూ రూ. 1960000 పారితోషికంగా ఇనయ పుచ్చుకుందని తెలుస్తుంది. అయితే టాప్ టెన్ కంటెస్టెంట్లతో పోల్చితే ఇది చాలా తక్కువని సమాచారం.