MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కాస్టింగ్ కౌచ్ పై నోరువిప్పిన ‘బిగ్ బాస్’ దివి.. ఇప్పుడు ఎక్కువగా అదే జరుగుతోందంటూ.. షాకింగ్ కామెంట్స్.!

కాస్టింగ్ కౌచ్ పై నోరువిప్పిన ‘బిగ్ బాస్’ దివి.. ఇప్పుడు ఎక్కువగా అదే జరుగుతోందంటూ.. షాకింగ్ కామెంట్స్.!

యంగ్ హీరోయిన్, ‘బిగ్ బాస్’ దివి తాజాగా కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో ఎక్కువగా అలాంటివే జరుగుతున్నాయంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మాటలు వైరల్ గా మారుతున్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 13 2022, 06:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యమైన వాటిల్లో కాస్టింగ్ కౌచ్ ఒకటి. అప్ కమింగ్ యాక్ట్రెస్ తమ కేరీర్ లో ముందుకు వెళ్లకుండా ఇది శాపంగా మారింది. ఇప్పటికీ ‘మీ టూ’ ఉద్యమంతో ఒక్కొక్క హీరోయిన్ తమకు ఎదురైన అనుభవాలను నిర్భయంగా వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

తాజాగా బిగ్ బాస్ ఫేమ్, యంగ్ హీరోయిన్ దివి (Divi) కూడా కాస్టింగ్ కౌచ్ (Casting Couch)పై  నోరువిప్పింది. ‘బిగ్ బాస్ తెలుగు’ (Bigg Boss Telugu) సీజన్ 4లో అవకాశం దక్కించుకుని  బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ బ్యూటీ సినీ ఆఫర్లు కూడా బ్యాక్ టు బ్యాక్ అందుతున్నాయి. 
 

36

గతేడాది దివి 'క్యాబ్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ సిరీస్ వాల్యూమ్ 1లో అద్భుతమైన పెర్ఫామెన్ష్ తో ఆడియెన్స్ నుంచి పర్వాలేదనిపించే రెస్పాన్స్ ను దక్కించుకుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ (Godfather) చిత్రంలోనూ ఓ ముఖ్య  పాత్రను పోషించింది.
 

46

ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో దివిని ఓ ఛానెల్ వారు తాజాగా ఇంటర్వ్యూ చేశారు. ఆమె సినీ కేరీర్ గురించి కూడా తెలుసుకున్నారు. ఈ క్రమంలో దివికి ‘కాస్టింగ్ కౌచ్’పై ప్రశ్నలు సంధించారు. ఇండస్ట్రీలో ఇన్నేండ్లు గా ఉంటున్న మీకు ఎప్పుడైనా ఈ పరిస్థితి ఏర్పడిందా? అలాంటప్పుడు ఏం చేశారు? అని ప్రశ్నించారు. 

56

దీనిపై స్పందించిన  దివి షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు మాత్రం అలాంటి సమస్య ఎదురు కాలేదని చెప్పింది. ఏ నటికైనా తను నడుకునే తీరును బట్టే చాలా సమస్యలు దూరమవుతాయని బదులిచ్చింది. దివి మాత్రం మోడలింగ్, షార్ట్ ఫిలిమ్స్ లో వచ్చిన అవకాశాలతోనే ముందుకు వచ్చినట్టు తెలిపింది. 
 

66

అదేవిధంగా, తన గురించి తేలికగా మాట్లాడే చనువు ఎవ్వరికీ ఇవ్వనంటోంది. కానీ అమ్మాయి, అబ్బాయి ఇష్టపడి కమిట్ అవ్వడంలో ఎలాంటి అభ్యంతరం ఉండదని భావించింది. తనకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువగా ఇలాంటిదే జరుగుతోందని’ బదులిచ్చింది. ఓపెన్ గా దివి చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Jailer 2: షూటింగ్ పూర్తవ్వకుండానే 160 కోట్ల డీల్, రజినీకాంత్ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడిందా?
Recommended image2
Ram Charan: పెద్ది రన్‌టైమ్‌ లీక్‌.. వామ్మో మరో `పుష్ప 2` లోడింగ్‌ ?
Recommended image3
Ram Charan: రాంచరణ్ ని కించపరిచేలా కామెంట్స్, క్రెడిట్ ఇవ్వని డైరెక్టర్.. ఒక్క మాటతో నోరు మూయించారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved