దివి చంకనెక్కిన మెహబూబ్: తీరొక్క వేషాలు
First Published Dec 18, 2020, 4:06 PM IST
బిగ్ బాస్ సీజన్ 4 పాల్గొన్న కంటెస్టెంట్స్ బయట సందడి చేస్తున్నారు. ఎలిమినేటై బయటికి వచ్చిన గంగవ్వ, దివి, మోనాల్, దిల్ సే మెహబూబ్, లాస్య, ముక్కు అవినాష్ వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ సెలెబ్రిటీలు. తమతో పాటు హౌస్ లో ఉన్న తోటి కంటెస్టెంట్స్ ని కలిసి ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు.

లాస్య, గంగవ్వ ఇంటికి వెళ్లడం జరిగింది. గంగవ్వ ఇల్లు మరియు పొలాలలో ఇద్దరూ సందడి చేయగా... సదరు వీడియో లాస్య తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయడం జరిగింది. లక్షల్లో ఈ వీడియోలకు వ్యూస్ వస్తుండగా వీళ్ళ వ్యాపారం మంచిగా ఉంది.

ఇక ఈ సీజన్ కి గాను హౌస్ లో కండల వీరుడిగా సందడి చేసిన మెహబూబ్, హౌస్ నుండి బయటికి వచ్చాక... తన సొంత ఊరు గుంటూరుకి వెళుతున్న వీడియో చేయడం జరిగింది. మెహబూబ్ కి గుంటూరులో ఘన స్వాగతం లభించగా... తన ఇల్లు, పేరెంట్స్ ని పరిచయం చేశాడు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?