- Home
- Entertainment
- బిగ్ బాస్ షో కోసం వాసంతి ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. వామ్మో గట్టిగానే రాబట్టిందిగా!
బిగ్ బాస్ షో కోసం వాసంతి ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. వామ్మో గట్టిగానే రాబట్టిందిగా!
క్యూట్ అండ్ రొమాంటిక్ లుక్స్ తో బిగ్ బాస్ 6 హౌజ్‌లో అందరిని ఆకట్టుకున్న వాసంతి.. మొన్న ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆమె తీసుకున్న పారితోషికం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.

బిగ్ బాస్ 6(Bigg Boss 6 Telugu) తెలుగులో క్యూట్ అందాలతో మెప్పించింది వాసంతి కృష్ణన్(Vasanthi Krishnan). ఇన్నోసెంట్ గా ఉంటూ అందరి మనసులు దోచుకుంది. అయితే ఊహించిన విధంగా ఆమె ఈ ఆదివారం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. బాలాదిత్య తర్వాత వాసంతి ఎలిమినేట్ కావడంతో ఆమె అభిమానులు, బిగ్ బాస్ లవర్స్ సైతం షాక్‌కి గురయ్యారు. హౌజ్‌కి అందం పోయిందే అనే ఫీలింగ్స్ కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ అందాల భామ బిగ్ బాస్ షోకి గానూ అందుకున్న పారితోషికం(Vasanthi Remuneration) ఇప్పుడు చర్చనీయాంశంగా మారడం విశేషం. కరెక్ట్ గా పది వారాలు హౌజ్‌లో ఉంది వాసంతి కృష్ణన్. అందుకుగానూ ఆమె గట్టిగానే వసూలు చేసిందట. ఆల్మోస్ట్ బిగ్ బాస్ విన్నింగ్ ప్రైజ్‌మనీలో సగం వరకు ఆమె దక్కిందని అంటున్నారు.
వాసంతి పదివారాలు హౌజ్‌లో ఉన్న విషయం తెలిసిందే. మొన్న ఆదివారం ఆమె ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యింది. అయితే ఈ పదివారాలకు గానూ ఆమె సుమారుగా 21లక్షలు పారితోషికంగా అందుకుందని తెలుస్తుంది. రోజుకి ఆమెకి బిగ్ బాస్ నిర్వహకులు 30వేల చొప్పున ఒక్కో వారానికి రెండు లక్షల పదివేలు రెమ్యూనరేష్ ఇచ్చారని టాక్. ప్రస్తుతం ఈ వార్తలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. దీనికితోడు ఇతర గిఫ్ట్ లు కలుపుకుని ఆమెకి దాదాసు బిగ్ బాస్ ప్రైజ్ మనీ(యాభై లక్షలు)లో సగం వరకు ముట్టిందని సమాచారం. మొత్తానికి గట్టిగానే రాబట్టుకుందని అంటున్నారు ఆమె అభిమానులు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలాఉంటే తిరుపతిలో పుట్టి పెరిగిన వాసంతి కృష్ణ.. ఏవియేషన్ స్టడీస్ కోసం బెంగుళూరుకి వెళ్లింది. తనకు పర్సనల్‌గా బెంగుళూరు అంటే ఇష్టం కావడం విశేషం. ఓ వైపు స్టడీస్ చేస్తూనే మోడలింగ్ వైపు ఫోకస్ చేసింది. అలా ఐదారేళ్లు మోడలింగ్ రంగంలో రాణించింది. ఇక కెరీర్ పరంగా నెక్ట్స్ స్టెప్ వేయాలని భావించింది. ఈ క్రమంలో ఆమె నటిగా మారింది.
తెలుగులో వాసంతి `సిరి సిరి మువ్వులు` సీరియల్‌తో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ ఎంతగా ఆదరణ పొందిందో తెలిసిందే. ఈ సీరియల్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యింది వాసంతి కృష్ణన్. దీంతోపాటు `గుప్పెడంత మనసు`, `గోరింటాకు` సీరియల్స్ లో చేసింది. మరింతగా ఆదరణ పొందింది.
ఈ క్రమంలో ఆమెకి సిల్వర్ స్క్రీన్ అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే వాసంతి సంపూర్నేష్ బాబు నటించిన `క్యాలిఫ్లవర్`లో నటించి మెప్పించింది. మరోవైపు సుడిగాలి సుధీర్, అనసూయ, దీపికా పిల్లి, విష్ణు ప్రియా, సునీల్ వంటి వారు కలిసి నటించిన `వాంటెండ్ పండుగాడ్` చిత్రంలోనూ ఓ హీరోయిన్‌గా మెప్పించడం విశేషం. సినిమా ఫలితాన్ని పక్కన పెడితే ఇది వాసంతికి మంచి గుర్తింపే తెచ్చిందని టాక్.
ఇక దాదాపు డెబ్బై రోజులు బిగ్ బాస్ 6 హౌజ్‌లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మకి ఇప్పుడు అవకాశాలు బాగానే వస్తున్నాయని టాక్. షో ద్వారా బాగా పాపులర్ కావడంతో అటు సీరియల్స్, సినిమాల వైపు నుంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని తెలుస్తుంది. మరోవైపు కన్నడలోనూ నటించేందుకు ఆసక్తి చూపుతుందని సమాచారం. మరి ఈ అందాల భామ ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి.