బిగ్ బాస్ బ్యూటీ సిరి చిలిపి పోజులతో పిచ్చెక్కించే పోజులు.. నిండైన దుస్తుల్లో మంత్రముగ్దుల్ని చేస్తుందిగా..
బిగ్ బాస్ పోరి సిరి హన్మంతు ఓ వైపు కెరీర్‌ని బిల్డ్ చేసుకునే పనిలో పడింది. మరోవైపు సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. తాజాగా ఈ భామ తన అందాల ఫోటోలతో ఆకట్టుకుంటుంది.
సిరి హన్మంతు.. బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ 5లో పాల్గొని ఆకట్టుకుంది. ఇందులో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆమెకి, షణ్ముఖ్ కలిసి నానా రచ్చ చేశారు. అది ఏకంగా షణ్ముఖ్ లవర్ ఆయనకు బ్రేకప్ చెప్పేంత వరకు వెళ్లింది.
నిజానికి సిరి చాలా వరకు లిమిట్స్ లోనూ ఉంది. కానీ షణ్ముఖ్ సైకలాజికల్‌గా ఆమెని ఇబ్బంది పెట్టాడు. బట్ తాను మాత్రం ఎక్కడా హద్దులు దాటకుండా మెచ్యూర్డ్ గా గేమ్‌లు ఆడుతూ ఆకట్టుకుంది. చాలా వరకు ఆడపులిలా ఆమె హౌజ్‌లో ఉంది. అదే విధంగా ఎంటర్‌టైన్ చేసింది.
బిగ్ బాస్ ఈ బ్యూటీకి విశేష గుర్తింపుని తీసుకొచ్చింది. పాపులర్ చేసింది. దీంతో యూట్యూబ్ స్టార్ నుంచి ఇప్పుడు నటిగా, యాంకర్‌గా మారిపోయింది. ఓ వైపు వెబ్ సిరీస్‌లు, మరోవైపు టీవీ షోస్ చేస్తూ బిజీగా ఉందీ అందాల భామ. అందులో భాగంగా గ్లామర్ డోస్ కూడా పెంచుతుంది.
ఆ మధ్య హాట్ ఫోటో షూట్‌లతో ఆకట్టుకుంది. అందులో భాగంగా ఇప్పుడు ట్రెడిషనల్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తుంది. యాష్ కలర్ డ్రెస్‌లో మెరిసిందీ అందాల భామ. ట్రెడిషనల్ లుక్‌లో కట్టిపడేస్తుంది. క్యూట్ అందాలతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. నెట్టింట వైరల్‌గా మారింది.
సిరి తన ప్రియుడు శ్రీహాన్, ఫ్రెండ్స్ తో కలిసి రాత్రి ఎంజాయ్ చేసింది. చిన్న పాటి పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోని సైతం ఆమె ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఇందులో క్యూట్‌గా మెరిసిపోతుంది సిరి హన్మంత్. ఏంజెల్ లాగా ఉంది.
ఇందులో ఆమె స్పందిస్తూ, మీ మనసుకి మాత్రమే మీ పరిమితి అంటూ కామెంట్ చేశారు. ఆమె ఫోటోలపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ ఏంజెల్ అని, క్యూట్ బ్యూటీ, బ్యూటీఫుల్ లేడీ అని కామెంట్ చేస్తున్నారు. శ్రీహాన్‌తో కలిసి డాన్సు వీడియోలు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.
సిరి హన్మంతు ప్రస్తుతం యాంకర్ రవితో కలిసి ఓ షో చేసింది. మరోవైపు ప్రియుడు శ్రీహాన్‌తో `మేడమ్ సర్` అనే ఫిల్మ్ కూడా చేసింది. ప్రస్తుతం ఆహాలో ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తుంది.మరోవైపు డాన్సు వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటుంది.