- Home
- Entertainment
- చీరకట్టిన ‘బిగ్ బాస్’ బ్యూటీ భాను శ్రీ... ఆ అందాల ధాటికి కుర్రాళ్ల గుండెలు గల్లంతే..
చీరకట్టిన ‘బిగ్ బాస్’ బ్యూటీ భాను శ్రీ... ఆ అందాల ధాటికి కుర్రాళ్ల గుండెలు గల్లంతే..
బిగ్ బాస్ ఫేమ్, నటి భాను శ్రీ (Bhanu Sri) చీరకడితే కుర్రాళ్ల గుండెలు గల్లంతు కావాల్సిందే. ఇటీవల వరుసగా మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తున్న భానుశ్రీ.. తాజాగా శారీలో నాజుకు అందాలతో ఆకట్టుకుంటోంది.

మోడల్ గా తన కేరీర్ ను ప్రారంభించిన భానుశ్రీ.. ఇప్పుడిప్పుడే నటిగా అవకాశాలు అందుకుంటోంది. గతంలో జెమినీ టీవీలో ప్రారమయ్యే టెలివిజన్ డైలీ సీరియల్ ‘జాబిలమ్మ’లో నటించింది. తన పాత్రకు న్యాయం చేయడంతో పలు చిత్రాల్లోనూ అవకాశం దక్కించుకుంది.
ఆ క్రేజ్ తోనే ‘బిగ్ బాస్ తెలుగు’ (Bigg Boss Telugu) సీజన్ 2తో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ రియాలిటీ గేమ్ షోలో భానుశ్రీ తనదైన శైలిలో టాస్క్ లను ఆడి పాపులర్ అయ్యింది. కానీ షో మధ్యలోనే ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత భానుకు మరింత క్రేజ్ పెరిగింది.
ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. ఈ సందర్భంగా భాను తన పాపులారిటీని మరింతగా పెంచుకునేందుకు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా ఉంటోంది. లేటెస్ట్ గా ఫొటోషూట్లు నిర్వహిస్తూ నెటిజన్లను తనవైపు ఆకర్షిస్తోంది.
తాజాగా భాణు శ్రీ పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోల్లో చీరకట్టులో దర్శనమిచ్చింది. అట్రాక్టివ్ శారీని చాలా చక్కగా శరీరానికి అద్దినట్టుగా చుట్టుకుంది. చీరకొంగును చేతికి చుట్టుకొని నడుము అందాలను చూపిస్తూ మతిపోగొడుతోందీ బ్యూటీ. స్లీవ్ లెస్ బ్లాజ్ లో గ్లామర్ షోతో మైస్మరైజ్ చేస్తోంది.
ఇఫ్పటికే ఇన్ స్టాలో 1 మిలియన్ ఫాలోవర్స్ ను దక్కించుకున్న భాను శ్రీ తన పాపులారిటీని పెంచుకునేందుకు ఇలా గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తోంది. ఈ బ్యూటీ అందాలకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. లైక్ లు, కామెంట్లతో ఎంకరేజ్ చేస్తున్నారు.
భానుశ్రీ.. బాహుబలి, కుమారి 21ఎఫ్, కాటమరాయుడు, ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి, ఏడు చేపల కథ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2017లోనే ‘ఇద్దరి మధ్య 18’ అనే చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. చివరిగా ‘నల్లమల’ మూవీలో నటించి ఓ మెస్తారు సక్సెస్ ను అందుకుంది.