- Home
- Entertainment
- ఘాటు రేపే అందాలతో చెమటలు పట్టిస్తున్న బిగ్ బాస్ దివి.. సిల్క్ స్మితతో పోల్చుతూ నెటిజన్ల రచ్చ..
ఘాటు రేపే అందాలతో చెమటలు పట్టిస్తున్న బిగ్ బాస్ దివి.. సిల్క్ స్మితతో పోల్చుతూ నెటిజన్ల రచ్చ..
బిగ్ బాస్ బ్యూటీ దివి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అద్బుతమైన కవితలు పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. దానికి మించిన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తుంటుంది.

దివి వాద్త్యా లేటెస్ట్ గా రెడ్ శారీలో మెరిసింది. వైట్ డాట్స్ ఉన్న ఎర్రచీ కట్టి హోయలు పోయింది. సన్నని నడుముని చూపిస్తూ కొంటెగా కవ్విస్తుంది. కిల్లింగ్ లుక్స్ తో కేక పెట్టిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇందులో దివి పోజులు ప్రత్యేకంగా నిలిచాయి. ఆమె తన కలల రాకుమారుడికి కోసం వేచి చూస్తున్నట్టుగా కొన్ని పోజులివ్వడం విశేషం. అందాలన్నీ కాబోయే వాడికి వడ్డించేందుకు వేచి ఉన్నట్టుగా ఉన్న దివి లుక్స్ ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట హల్‌చల్ చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నాయి.
దివి ఇందులో టైమ్ ట్రావెల్ అంటూ పేర్కొంది. ఆమె రెట్రో లుక్ లో కనిపించడంతో ఇలా పోస్ట్ పెట్టినట్టుంది. మొత్తానికి తన గ్లామర్ ఫోటోలతో నెట్టింట రచ్చ లేపుతుందీ సెక్సీ బ్యూటీ. దివి ట్రెండీ వేర్‌లో కంటే చీరలోనే మరింత అందంగా, హాట్‌గా ఉంటుంది. అందుకే ఈ బ్యూటీ కూడా చాలా వరకు చీరలోనే కనిపించేందుకు ప్రయత్నిస్తుంది. అలా నెటిజన్ల మనసులను గెలుచుకుంటుంది.
దివి.. కవితలు బాగా రాస్తుంటుంది. తన యవ్వనాన్ని, డ్రీమ్స్ ని, కాబోయే వాడి గురించి, ఊహల్లో తేలియాడుతూ వర్ణిస్తూ తన ఫోటోలు క్యాప్షన్స్ రాస్తుంటుంది. ఆమె కవితల్లో తెలుగుదనం, తెలుగు అమ్మాయి అందం, శృంగారం, ప్రేమ, విరహం ఇలా అన్ని భావాలు కనిపిస్తుంటాయి. అందుకే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
ఇక తాజాగా ఆమె పంచుకున్న ఫోటోలపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఆమె అందాన్ని వర్ణిస్తున్నారు. ఆకాశానికి ఎత్తుతున్నారు. కొందరు వల్గర్ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ఆమె అందాన్ని సిల్క్ స్మితతో వర్ణించడం విశేషం. జూ సిల్క్ స్మిత అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఇలా దివిని చూస్తుంటే తమకి మత్తెక్కినట్టు ఉందని, మందేయకుండానే మత్తు ఎక్కుతుందని అంటున్నారు.
ఇంకొందరు ఇంకాస్త రెచ్చిపోతూ స్వర్గం నుంచి వచ్చిన దివి తారా అని, కళ్లతో కాటేస్తున్న అందాల రాక్షసి అని, హీరోయిన్ మెటీరియల్ అని, ఏదో ఒక రోజు హీరోయిన్ అవుతావని, నీకంటూ ఓ రోజు వస్తుందని, సినిమాల్లో కనిపించాల్సిన అందం, ఇలా సోషల్ మీడియాలో వేస్ట్ అవుతుందని అంటున్నారు. మొత్తానికి దివిని ఆగం పట్టిస్తున్నారు.
బిగ్ బాస్ 4 షోలో పాల్గొని పాపులర్ అయ్యింది దివి. నాజుకూ నడుముతో టీవీ షోలోనే ఊపేసింది. అందరి హృదయాలను గెలుచుకుంది. ఆ తర్వాత ఫైనల్ సెర్మనీలో చిరంజీవిని ఫిదా చేసింది. హైలైట్‌గా నిలిచింది. ఆయన సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఇప్పుడు నెమ్మదిగా సినిమా అవకాశాలు అందుకుంటూ కెరీర్ పరంగా బిజీ అవుతుంది దివి. ఇటీవల `పుష్ప2`లో టీవీ రిపోర్టర్‌గా మెరిసిన విషయం తెలిసిందే.
బిగ్ బాస్ బ్యూటీ దివి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అద్బుతమైన కవితలు పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. దానికి మించిన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తుంటుంది.