ప్రేమలో పడిన బిగ్ బాస్ అరియనా? రియల్ లవ్ అంటూ ఎట్టకేలకు ఓపెన్!
బిగ్ బాస్ అరియనా ప్రేమలో పడ్డారన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఆమె లేటెస్ట్ కామెంట్ ఇందుకు కారణమైంది.

Ariyana Glory
అరియనా గ్లోరీ గ్లామరస్ ఫోటో షూట్ చేశారు. స్లీవ్ లెస్ జాకెట్, శారీ ధరించి మెస్మరైజ్ లుక్ లో ఆకట్టుకున్నారు. క్లీవేజ్ అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పించారు. కాగా సదరు ఫోటోలకు ఆమె చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి.
Ariyana Glory
ఒకరిని ప్రేమించాలనే భావన లేకుండా ప్రేమలో పడిపోతాం. అదే నిజమైన ప్రేమ. ఆ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంది... అంటూ కామెంట్ పెట్టారు. అరియనా ప్రేమ కథలు వల్లిస్తున్న నేపథ్యంలో ఆమె రిలేషన్ లో ఉన్నారని కొందరు అంచనా వేస్తున్నారు. ఆ లక్కీ ఫెలో ఎవరని అడుగుతున్నారు.
Ariyana Glory
గతంలో అరియనా మ్యారేజ్ పై తన అభిప్రాయం చెప్పారు. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుని సెటిలైపోతాను. భార్యగా మారి పిల్లల్ని కని వారి ఆలనా పాలనా చూసుకోవడం, భర్తకు సేవలు చేయడం ఇష్టమని చెప్పారు. ఆ మాటలు చెప్పి చాలా కాలం అవుతుండగా అరియనా మాత్రం వివాహం చేసుకోలేదు.
Ariyana Glory
ఇటీవల బీబీ జోడి గ్రాండ్ గా ముగిసింది. తృటిలో అరియనా-అవినాష్ టైటిల్ కోల్పోయారు. ఫైమా-సూర్య జోడి బీబీ టైటిల్ అందుకున్నారు. వారికి రూ. 25 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. అరియనా-అవినాష్ రన్నర్ గా నిలిచారు. శ్రీముఖి యాంకర్ గా ఉన్న ఈ షోకి జయం ఫేమ్ సదా, సీనియర్ హీరోయిన్ రాధ, తరుణ్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరించారు. ఫినాలే గెస్ట్ గా శేఖర్ మాస్టర్ వచ్చారు. అయితే అరియనా-అవినాష్ గొప్ప పెరఫామెన్స్ ఇచ్చారు.
ఒకప్పుడు అరియనాకు ఎలాంటి గుర్తింపు లేదు.ఆమెకు బిగ్ బాస్ షో పాపులారిటీ తెచ్చింది.హౌస్లో అరియనా ముక్కుసూటితనం, ప్రశ్నించే తత్వం ఆమెను ప్రేక్షకులు ఇష్టపడేలా చేశాయి. అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనా 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఓ దశలో ఆమె టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యారు. ఫైనల్ లో అనూహ్యంగా వెనుకబడ్డారు.
అరియనా కెరీర్ ని మార్చేసిన ఘనత మాత్రం దర్శకుడు రామ్ గోపాల్ వర్మదే. గతంలో వర్మను ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన అరియనాపై బోల్డ్ కామెంట్ చేశాడు. నిన్ను బికినీలో చూడాలని ఉందని ఓపెన్ గా చెప్పారు. వర్మ కామెంట్ తో ఆ ఇంటర్వ్యూ వైరల్ కావడం.. అరియనా పేరు వెలుగులోకి రావడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 4లో అరియనా కంటెస్ట్ చేసింది.
బిగ్ బాస్ తర్వాత ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. కెరీర్ లో సెట్ అయ్యింది. ఇక లైఫ్ ఇచ్చిన వర్మ కోసం అరియనా ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. జిమ్ ఫిట్ లో వ్యాయామం చేస్తూ వర్మ అడిగే పచ్చి బూతు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అరియనా ప్రైవేట్ పార్ట్స్ ని వర్ణిస్తూ ఆ ఇంటర్వ్యూలో వర్మ రచ్చ చేశారు.అటు బుల్లితెర షోలతో పాటు ఇంస్టాగ్రామ్ వేదికగా అరియనా రచ్చ చేస్తున్నారు.