MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎక్కడి నుంచి వస్తున్నార్రా బాబు, జడ్జిలకే పిచ్చెక్కిస్తున్న కంటెస్టెంట్స్

ఎక్కడి నుంచి వస్తున్నార్రా బాబు, జడ్జిలకే పిచ్చెక్కిస్తున్న కంటెస్టెంట్స్

ఏంటీ అమ్మాయిల గొప్ప.. మగవారే గొప్పవారు. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఓ కంటెస్టెంట్ వాదన ఇది. అసలేంటి నీ ప్రాబ్లమ్ అంటూ బిందుమాధవి ఏం చేసిందంటే?

2 Min read
Mahesh Jujjuri
Published : Aug 23 2025, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Bigg Boss

ఫైనల్ కు వెళ్లిన ముగ్గురు

ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్లు టాప్ 15 లోకి ప్రవేశించగా, మరి కొంతమందిని హోల్డ్ లో పెట్టారు, మరికొంతమందిని కంప్లీట్ గా ఎలిమినేట్ చేసి తప్పించారు. అయితే ఈ కంటెస్టెంట్స్ ఎంపికలో రకరకాల వ్యక్తులు జడ్జిలకు షాక్ ఇస్తున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ లో హృదయ్ మానవ్ చేసిన రచ్చ చూశాం.. ఇక తాజా ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ రవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.

DID YOU
KNOW
?
ఫైనల్ కు ముగ్గురు
బిగ్ బాస్ తెలుగు అగ్నిపరీక్ష కొనసాగుతోంది. ఇప్పటి వరకు ముగ్గురు కంటెస్టెంట్స్ ఫైనల్స్ కు సెలక్ట్ అయ్యారు.
25
Image Credit : Bigg Boss

బిగ్ బాస్ అగ్నిపరీక్ష

జియో హాట్ స్టార్‌లో ఇటీవల ప్రారంభమైన రియాలిటీ షో బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’. ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సామాన్య ప్రజల నుంచి అత్యుత్తమంగా అనిపించిన 5 మందిని ఎంపిక చేసి, బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు హౌస్‌లోకి పంపడమే ఈ షో ఉద్దేశం. లక్షల దరఖాస్తుల నుంచి కేవలం 45 మందిని ఎంపిక చేసి, విభిన్న టాస్కుల ద్వారా తుది ఐదుగురిని ఎంపిక చేసేందుకు ఈ ప్రక్రియ సాగుతోంది. షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.

Related Articles

Related image1
ఒక్క మనిషిలో ఇంత టాలెంటా? బిగ్ బాస్ అగ్నిపరీక్ష లో జడ్జ్ లను కదిలించిన ప్రసన్న కుమార్ కథ
Related image2
బిగ్ బాస్ సీజన్ 3 లోనే టీవీలు బంద్ చేసేవాళ్ళం.. అందరి ముందు శ్రీముఖి పరువు తీసిన అమ్మాయి
35
Image Credit : Bigg Boss

జడ్జిలకు చిరాకు తెప్పించిన కంటెస్టెంట్

శ్రీకాకుళం కు చెందిన రవి, గ్రూప్ టాస్క్‌లలో డామినేట్ చేయడం, ఇతరులను అణచివేయడం ద్వారా ముందుకు వచ్చాడు. అయితే, ఒక టాస్క్ లో యాంకర్ శ్రీముఖి, అతనిని చీర కట్టి హై హీల్స్ వేసుకుని, "అమ్మాయిలు గొప్పవాళ్లు" అని చెప్పాలని కోరింది. అందుకు రవి స్పందన, "టాస్క్ కోసం చెప్తాను కానీ, నా దృష్టిలో మగవాళ్లే గొప్ప" అని అన్నాడు. .ఈ వ్యాఖ్యలపై న్యాయనిర్ణేత బిందు మాధవి తీవ్రంగా స్పందించి, "ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపో" అంటూ రెడ్ ఫ్లాగ్ చూపించారు. తర్వాత రవి తన అభిప్రాయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ, "ఆడవాళ్లు అరగంట సేపు బిడ్డకు జన్మనిస్తారు, కానీ మగవాళ్లు జీవితాంతం బాధలతో పోరాడతారు" అనే అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలతో న్యాయనిర్ణేతలతో పాటు శ్రీముఖి కూడా తీవ్ర అసహనానికి లోనయ్యారు.

45
Image Credit : Star Maa

కంటెస్టెంట్ రవిపై సోషల్ మీడియాలో విమర్శలు

శ్రీముఖి, “ఒక తల్లి తొమ్మిది నెలల పాటు నరకం లాంటి బాధను అనుభవించి బిడ్డకు జన్మ ఇస్తుంది. ఈ సృష్టిలో అలాంటి బాధను ఎవరూ భరించలేదు. నువ్వు ఈరోజు ఇలా మాట్లాడగలగడం కూడా ఒక స్త్రీ వల్లే సాధ్యమైందని గుర్తుంచుకో” అంటూ గట్టిగా స్పందించారు. ఈ ఎపిసోడ్ ప్రసారం అయిన తరువాత, సామాజిక మాధ్యమాల్లో రవి వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. రకరకాల విమర్శలు వస్తున్నాయి. మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తిని ఈ స్టేజ్‌ వరకు ఎలా తీసుకురాగలిగారు? అనే ప్రశ్నలు నెటిజన్ల నుండి ఎదురవుతున్నాయి.

55
Image Credit : Star Maa

జడ్జిలకు అగ్నిపరీక్షగా మారిన కార్యక్రమం

జియో హాట్ స్టార్ ఇంకా బిగ్ బాస్ టీమ్ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ రవిపై పెరిగిన విమర్శల దృష్ట్యా, అతని తదుపరి ప్రయాణం ఈ రియాలిటీ షోలో కొనసాగుతుందా? అన్నది ఇప్పుడు సందేహాస్పదంగా మారింది. ఇలా బిగ్ బాస్ సెలక్షన్స్ కోసం స్టార్ట్ చేసిన అగ్నిపరీక్ష కార్యక్రమం నిజంగా జడ్జిలకు అగ్నిపరీక్షలా మారింది. ఇప్పటికే ఫైనల్స్ కు ముగ్గరు కంటెస్టెంట్స్ వెళ్లిపోయారు. వారికి ముగ్గురు జడ్జిల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగా. మరికొంత మందికి రెడ్ గ్రీన్ కలిసి వచ్చింది. దాంతో వారు సెకండ్ రౌంట్ లో పోటీని ఎదుర్కొనబోతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved