- Home
- Entertainment
- దివ్య నిఖిత దెబ్బకి తెల్లముఖం వేసిన అభిజీత్.. శ్రీలీల, సాయి పల్లవి తర్వాత నేనే.. కన్నీళ్లు తెప్పించిందిగా
దివ్య నిఖిత దెబ్బకి తెల్లముఖం వేసిన అభిజీత్.. శ్రీలీల, సాయి పల్లవి తర్వాత నేనే.. కన్నీళ్లు తెప్పించిందిగా
బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో ప్రారంభం అయింది. తొలి పార్టిసిపెంట్ గా అడుగుపెట్టిన దివ్య నిఖిత ఫన్నీగా మాట్లాడుతూనే అభిజీత్ పై సెటైర్లతో చెలరేగిపోయింది. చివరికి కన్నీళ్లు పెట్టించింది.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష షురూ
బిగ్ బాస్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ లో ప్రారంభం కానుంది. అయితే ఈ షోకి కామనర్స్ ని ఎంపిక చేసేందుకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష పేరుతో ప్రీ షో తీసుకువచ్చారు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష తొలి ఎపిసోడ్ ఆగష్టు 22 న ప్రసారం అయింది. ఈ షోకి శ్రీముఖి హోస్ట్ గా చేస్తున్నారు. బిందు మాధవి, అభిజీత్, నవదీప్ న్యాయ నిర్ణేతలు. ఎపిసోడ్ ప్రారంభం కాగానే శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి తెలిపింది.
నైటీ ధరించి వచ్చిన దివ్య నిఖిత
బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మెగా ఆడిషన్స్ మొదలవుతాయి. పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరుగా వస్తారు. న్యాయ నిర్ణేతలు వాళ్ళ గురించి తెలుసుకుంటారు. ముగ్గురు న్యాయ నిర్ణేతలు గ్రీన్ ఫ్లాగ్ ఇస్తే ఆ వ్యక్తి టాప్ 15 కి చేరుకుంటాడు. ఇద్దరు మాత్రమే గ్రీన్ ఫ్లాగ్ ఇస్తే హోల్డ్ లో ఉంటారు అని శ్రీముఖి తెలిపింది. తొలి పార్టిసిపెంట్ గా విజయవాడకి చెందిన దివ్య నిఖిత ఎంట్రీ ఇచ్చింది. ఆమె చాలా ఫన్నీగా నైటీ ధరించి బ్రష్ చేసుకుంటూ ఎంట్రీ ఇచ్చింది. ముందుగా తనని తాను పరిచయం చేసుకున్న దివ్య నిఖిత.. తాను ఎంబీబీఎస్ చదువుతున్నట్లు పేర్కొంది.
శ్రీలీల, సాయి పల్లవి తర్వాత నేనే
ఆమె వాలకం చూసి అభిజీత్ సెటైర్ వేశాడు. ఎంబీబీఎస్ అంటే ఏంటి మాస్టర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్సా అని అడిగారు. దీనితో దివ్య నవ్వేసింది. మీరు బిగ్ బాస్ కి ఎంపికైతే దాదాపు 4 నెలలు మీ చదువుకి దూరం అవుతారు. మీ చదువుని కవర్ చేసుకోవడం కష్టం అవుతుంది.. త్యాగం చేయడానికి రెడీనా అని అభిజీత్ ప్రశ్నించాడు. బిగ్ బాస్ అనేది లైఫ్ టైం ఆపర్చునిటీ.. చదువు కాస్త లేట్ అయినా మేనేజ్ చేసుకుంటా.. ఎందుకంటే నా నాలెడ్జ్ నా మైండ్ లో ఉంది అంటూ దివ్య అదిరిపోయే సమాధానం ఇచ్చింది. ఒక సాయి పల్లవి, ఒక శ్రీలీల, ఒక దివ్య నిఖిత అంటూ తనని తాను ఒక రేంజ్ లో పోల్చుకుంది. సాయి పల్లవి, శ్రీలీల ఇద్దరూ ఎంబీబీఎస్ చదువుతూ సినిమాల్లోకి వచ్చినవారే.
సోఫాలో కూర్చుని మైండ్ గేమ్ ఆడితే సరిపోదు
ఆ తర్వాత తన వ్యక్తిత్వం గురించి, ఫన్నీ నేచర్ గురించి చెప్పి నవ్వించింది. అభిజీత్ ప్రశ్నిస్తూ.. ఇక్కడ శ్రీముఖితో పాటు నలుగురు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎవరు బెస్ట్ ఎవరు వరస్ట్ నీ దృష్టిలో అని ప్రశ్నించాడు. దివ్య నిఖిత ఏమాత్రం మొహమాటం లేకుండా ఫస్ట్ సీజన్ లో పాల్గొన్న నవదీప్ నా దృష్టిలో బెస్ట్ అని నిఖిత తెలిపింది. ఇక వరస్ట్ అని చెప్పను కానీ అభిజీత్ అంటే ఇష్టం లేదు. అంతటితో ఆగలేదు.. అభిజీత్ కి కౌంటర్లు ఇస్తూనే ఉంది. అభిజీత్ ని నామినేట్ చేయాలి అంటే ఎలా చేస్తావు అని శ్రీముఖి దివ్యని ప్రశ్నించింది. దీనితో దివ్య.. అభిజీత్ ఫోటో తీసుకుని.. అభిజీత్ చూడడానికి బావుంటారు.. కానీ ఒక సోఫాలో కూర్చుని మైండ్ గేమ్ ఆడతాను అంటే కుదరదు.. ఫిజికల్ గేమ్స్ కూడా ఆడాలి. ఆయన ఫోకస్ గేమ్ కంటే ఇతర కంటెస్టెంట్స్ పైనే ఎక్కువగా ఉండేది.. అది నాకు నచ్చలేదు అని దివ్య నిఖిత ఊహించని విధంగా అభిజీత్ కి షాకిచ్చింది. అతడి ఫోటో కాల్చేసింది. దీనితో అభిజీత్ తెల్ల ముఖం వేసుకుని కనిపించాడు.
కన్నీళ్లు పెట్టించిన దివ్య నిఖిత
ఆ తర్వాత దివ్య నిఖిత తన లైఫ్ లో జరిగిన ఒక సంఘటనని వివరించింది. జిమ్ లో ప్రమాదం వల్ల తన వెన్నెముకకి గాయం అయినట్లు పేర్కొంది. ఆ టైంలో 6 నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్నా. మా నాన్న నాకు ఆ టైంలో సేవలు చేశారు అంటూ దివ్య కన్నీళ్లు పెట్టుకుంది. ఏ తండ్రి అయినా తన కూతుర్ని బాగా చూసుకుంటారు. కానీ ఆ టైంలో మా నాన్న నాకు ఎంతో ఉన్నతంగా కనిపించారు అని దివ్య తెలిపింది. దీనితో జడ్జీలు ఆమెని అభినందించారు. ఆమె నిజాయతీకి మెచ్చిన ముగ్గురు జడ్జీలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. దీనితో దివ్య నిఖిత నేరుగా టాప్ 15 లోకి చేరింది.