Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?
Bigg Boss 9 Telugu Mid Week Elimination : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి వారం నడుస్తోంది. హౌస్ లో ఏడుగురు ఉండటా.. చివరి వారంలో ఇద్దరు బయటకు వెళ్లాల్సి ఉంది. కాగా మిడ్ వీక్ ఎలిమినేషన్ తో షాక్ ఇవ్వబోతున్నాడట బిగ్ బాస్. ఇంతకీ బయటు వెళ్ళేది ఎవరు?

బిగ్ బాస్ చివరి వారంలో ట్విస్ట్..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సూపర్ సక్సెస్ అయ్యింది. గత రెండు మూడు సీజన్లు టీమ్ ను ఇబ్బందిపెట్టాయి కానీ.. ఈసీజన్ మాత్రం చాలా సక్సెస్ ఫుల్ గా నడిచింది. టీఆర్పీలు కూడా ఈ సీజన్ కు ఎక్కువగానే వచ్చినట్టు తెలుస్తోంది. కాగా బిగ్ బాస్ చివరి అంకానికి వచ్చేసింది. ప్రస్తుతం చివరి వారంలో ఉంది. ఈ వారంలోనే ఎన్నో ట్విస్ట్ లను బిగ్ బాస్ చూపించబోతున్నాడు. ఇప్పటికీ బిగ్ బాస్ లో 7 సభ్యులు ఉన్నారు. వారిలో ఇద్దరు బయటకు వెళ్తేగాని టాప్ 5 ఎవరు అన్నది తెలుస్తుంది. అయితే ఈ వీక్ ఇద్దరిని బయటకు పంపించడానికి మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయబోతున్నాడట బిగ్ బాస్.
బిగ్ బాస్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్
ఇక బిగ్ బాస్ టాప్ 5 ఎవరు అన్నదానిపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. విన్నర్స్ విషయంలో కూడా ముగ్గరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో పవన్ కళ్యాణ్ ముందుండగా.. తనూజ, ఇమ్మాన్యుయెల్ కూడా విన్నర్స్ రేస్ లో ఉన్నారు. కానీ కళ్యాణ్ కే ఎక్కువగా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వారం టాప్ 5 ఎవరో తెలాలి అంటే ఇద్దరిని హౌస్ నుంచి బయటకు పంపించాలి. ఈక్రమంలో పవన్ కళ్యాణ్ మినహా మిగతా ఆరు మంది కంటెస్టెంట్లు ఈ వీక్ నామినేషన్లలో ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పక్కాగా జరగాలి. అందుకే బిగ్ బాస్.. గురువారం మిడ్ వీక్ ఎలిమినేషన్‌ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అది పూర్తిగా ఆడియన్స్ ఓటింగ్ ఆధారంగా జరుగుతుందా? లేక ఈ వారం జరుగుతున్న ఇమ్మ్యూనిటీ టాస్కుల పనితీరును బట్టి జరుగుతుందా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
అర్ధ రాత్రి షాక్ ఎవరికి?
మిడ్ వీక్ ఎలిమినేషన్ లు దాదాపు మిడ్ నైట్ ఎక్కువగా ప్లాన్ చేస్తుంటాడు బిగ్ బాస్. అందరు మంచి నిద్రలో ఉండగా.. లేపి.. షాక్ ఇస్తుంటాడు బిగ్ బాస్. ఈ క్రమంలో ఈ వారం కూడా మిడ్ నైట్ షాక్ తగలబోయేది ఎవరికి అయి ఉంటుందని ఆడియన్స్ ఊహిచికుంటున్నారు. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇన్ని వారాలు బిగ్ బాస్ కాపాడుకుంటూ వస్తున్న సుమన్ శెట్టి.. తో పాటు.. ఇమ్మ్యూనిటీ టాస్కుల్లో ఒడిపోయిన సంజన. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వెళ్తారన్న టాక్ వినిపిస్తోంది. ఆడియన్స్ ఓట్ల పరంగా చూస్తే సుమన్ శెట్టి బయటకు వెళ్లిపోవాలి. సంజనాకు మాత్రం ఓట్లు భారీగానే పడుతున్నాయి. కానీ ఆమె ఇమ్మ్యూనిటీ టాస్కు నుండి అవుట్ అయ్యినట్టు సమాచారం. టాస్క్ ఆధారంగా ఎలిమినేషన్ చేస్తే సంజన గురువారం బయటకు వెళ్లే అవకాశం ఎక్కువ. ఒకవేళ ఓటింగ్ ఆధారంగా ఎలిమినేషన్ జరిగితే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఇమ్మ్యూనిటీ టాస్కులలో ఎవరు టాప్?
ఇమ్మ్యూనిటీ టాస్కుల విషయానికి వస్తే, డిమోన్ పవన్, ఇమ్మానుయేల్, ఎక్కువ పాయింట్లతో సత్తా చాటారు. కానీ ఆడియన్స్ ఓటు అప్పీల్ చేసే అవకాశం మాత్రం ఇమ్మానుయేల్‌కు లభించింది. తాజా ఎపిసోడ్‌లో రెండు టాస్కులలో భరణీ, తనూజ రెచ్చిపోయారు. బాల్స్ టాస్క్‌లో తనూజ టాప్ 1, భరణి టాప్ 2గా నిలిచారు. తర్వాత జరిగిన పజిల్ టాస్క్‌లో భరణి టాప్ 1 తనూజ టాప్ 2 స్థానం సాధించినట్టు సమాచారం. అయితే వీరిద్దరిలో ఆడియన్స్ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం ఇచ్చారు. అందులో తనూజకు ఎక్కువ ఓట్లు రావడంతో ఆమెకు ఓటు అప్పీల్ చేసే అవకాశం వచ్చినట్టు సమాచారం.

