- Home
- Entertainment
- `బిగ్ బాస్ 9 అగ్నిపరీక్ష` జడ్జ్ లపై సంచలన ఆరోపణలు.. పాటతో మనిషి ప్రాణాలను కాపాడటమే నేను చేసిన తప్పా?
`బిగ్ బాస్ 9 అగ్నిపరీక్ష` జడ్జ్ లపై సంచలన ఆరోపణలు.. పాటతో మనిషి ప్రాణాలను కాపాడటమే నేను చేసిన తప్పా?
`బిగ్ బాస్ అగ్నిపరీక్ష`పై కామన్ మ్యాన్‌గా కంటెస్టెంట్ కోసం పోటీ పడ్డ నర్సయ్య తాత సంచలన ఆరోపణలు చేశారు. జడ్జ్ లపై ఆయన హాట్ కామెంట్ చేశారు.

కామన్ మ్యాన్ కంటెస్టెంట్లని ఎంపిక చేసేందుకు అగ్నిపరీక్ష
బిగ్ బాస్ తెలుగు 9 రియాలిటీ షో ప్రారంభానికి ముందు ట్రైలర్ లాగా `బిగ్ బాస్ అగ్నిపరీక్ష`ని నిర్వహిస్తుంది హాట్ స్టార్. ఇందులో కామన్ మ్యాన్ కంటెస్టెంట్లని ఎంపిక చేస్తున్నారు. ఈ సారి చాలా మంది కామన్ మ్యాన్ కేటగిరి నుంచి కంటెస్టెంట్లని ఎంపిక చేస్తున్నారు. గతంలో ఒక్కరిని ఎంపిక చేస్తే ఎక్కువ అనేలా ఉండేది. కానీ ఇప్పుడు ఐదు నుంచి ఆరుగురిని ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. అందుకోసం వేల అప్లికేషన్స్ వచ్చాయి. వారిలో నుంచి టాప్ 45 కంటెస్టెంట్లని ఎంపిక చేశారు. వీరిలో నుంచి 15మందిని ఫిల్టర్ చేశారు. వీరి లోనుంచి ఐదుగురు కంటెస్టెంట్లని బిగ్ బాస్ తెలుగు 9కోసం ఎంపిక చేయబోతున్నారని సమాచారం.
బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షపై విమర్శలు
చాలా మంది కామన్ మ్యాన్ కంటెస్టెంట్లు బిగ్ బాస్‌పై ఆశలతో వచ్చారు, ఎంతగానో తమ ప్రతిభని చూపించారు. తన ప్రత్యేకతని చాటుకున్నారు. కానీ వారు ఎలిమినేట్ కావడంతో, టాప్ 15కి సెలెక్ట్ కాకపోవడంతో కొంత డిజప్పాయింట్ అవుతున్నారు. చాలా మంది ఈ షోపై విమర్శలు చేస్తున్నారు. నెటిజన్లు కూడా చెత్త షోగా అభివర్ణిస్తున్నారు. అందులో భాగంగా ఓ కంటెస్టెంట్ `బిగ్ బాస్ అగ్నిపరీక్ష`పై అరోపణలు చేశారు. జడ్జ్ లను నిలదీశారు. ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టారని అన్నారు. తనని చులకనగా చూశారని తెలిపారు. ఆయనే జర్నలిస్ట్ గా పాపులర్ అయిన నర్సయ్య తాత. ఆయన తన గొల్లకురుమ వేషాధారణలోనే షోకి వచ్చారు. పాటతో అలరించారట. అయితే తనని ఎంపిక చేయకపోవడంతో ఆయన స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
మనిషి ప్రాణాలను కాపాడటమే నేను చేసిన తప్పా
``తెలంగాణలోని ఒక గొర్రెల కాపరిగా, ఆ కట్టుబొట్టు, ఆ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. అదే సమయంలో ఒక జర్నలిస్ట్ గా ప్రజా సమస్యలపై పోరాడుతూ, జనాలకు అండగా నిలుస్తున్నాను. ఈ మధ్యనే బిగ్ బాస్ అగ్నిపరీక్ష వరకు వెళ్లిన నన్ను ఒక పాటగాడిగా, ఒక రైతు పాట, ఒక తెలుగు భాష పాటని పాడి వినిపించాను. నాపాట విని గుంటూరు జిల్లాలో చెంచయ్య అనే ఒక మనిషి బతికిండు, ఆ పాటరాసి ఆ మనిషి ప్రాణాలను బతికించడమే నేను చేసిన పెద్ద తప్పైంది. ఇంగ్లీష్ చదివి తెలుగు మర్చిపోకురా, తెలుగుతల్లి కీర్తిని జగతికి చాటి చెప్పురా అని ఈ పాట పాడటమే నా తప్పైంది. ఈ పాటని టెలికాస్ట్ కాకుండానే ఎడిటింగ్ చేశారు.
ప్లాన్ ప్రకారమే నన్ను తొలగించారు
నువ్వు బిగ్ బాస్ హౌజ్‌లో ఉంటావో లేదో అని మాకు డౌట్ ఉందని అన్నారు. అసలు నన్ను ఏదైనా ప్రశ్నించారా? అసలు నీలో ఏం ప్రతిభ ఉందని అడగకుండా, వెలికితీయకుండా, ఇలా ఏది చేయకుండా ఎలా నన్ను రిజెక్ట్ చేస్తారు. ఇదిగో ఇది నీకిచ్చినం, ఇందులో నువ్వు నిగ్గలేకపోతున్నావు అని చెప్పడానికి ఒక కారణం ఉండాలి కదా. ఏ కారణం లేకుండా ఎలా రిజెక్ట్ చేస్తారు. ఒక తెలంగాణ కళాకారుడిని, ఒక గొర్రెల కాపరిగా వచ్చిన నన్ను చులకనగా చూసినట్టుగా, ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టే విధంగా చేశారు. ఒక ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశారు. అందులో నాగార్జున ఉంటే ఆలోచన చేసేవారేమో అనిపించింది. ఇప్పటికైనా అన్ని వర్గాలు అండదండగా ఉంటాయని కోరుకుంటున్నా` అని తెలిపారు నర్సయ్య తాత. ప్రస్తుతం ఈ వీడియో వైల్ అవుతుంది. బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షకి నవదీప్, బిందు మాధవి, అభిజీత్ జడ్జ్ లు గా వ్యవహరిస్తున్నారు.