నాగార్జునగారు నాకు దేవుడే, ఆయన డబ్బుతోనే ఆస్తులు కొన్నా..కానీ క్యారెక్టర్ మీద మచ్చ వేస్తే ఊరుకోను
బిగ్ బాస్ సీజన్ 7 విజేత శివాజీనే అని అంతా భావించారు. కానీ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో శివాజీ పల్లవి ప్రశాంత్, యావర్ లకు సపోర్ట్ చేస్తూ తాను గేమ్ ఆడడం తగ్గించారు.
బిగ్ బాస్ సీజన్ 7 ముగిసింది. కానీ ఆ హీట్ ఇంకా తగ్గలేదు. బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే తర్వాత బయట జరిగిన అల్లర్లు, వాహనాలపై దాడులతో సరికొత్త వివాదం రాజుకుంది. తన అభిమానులని పల్లవి ప్రశాంత్ రెచ్చగొట్టేలా వ్యవహరించాడని, పోలీసులకు సహకరించలేదని అతడిని అరెస్ట్ చేశారు. అయితే పల్లవి ప్రశాంత్ బెయిల్ పై బయటకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ క్రమంలో బిగ్ బాస్ షోలో హైలైట్ అయిన మరో కంటెస్టెంట్ నటుడు శివాజీ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రారంభంలో బిగ్ బాస్ సీజన్ 7 విజేత శివాజీనే అని అంతా భావించారు. కానీ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో శివాజీ పల్లవి ప్రశాంత్, యావర్ లకు సపోర్ట్ చేస్తూ తాను గేమ్ ఆడడం తగ్గించారు.
శివాజీ, శోభా శెట్టి మధ్య జరిగిన సంఘటనలు.. నాగార్జునతో శివాజీ వాగ్వాదం లాంటి వ్యవహారాలు బాగా హైలైట్ అయ్యాయి. తాజాగా ఇంటర్వ్యూలో శివాజీ ఇలాంటి వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జున గారికి ఎదురెళ్లి వాదించడాన్ని శివాజీ సమర్థించుకున్నారు. నాగార్జున గారు నాకు దైవంతో సమాధానం. నాకు ఫస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చింది ఆయనే.
నాగార్జున గారి నిర్మాణంలో శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి చిత్రంలో నటించా. అప్పటికి మాకు రెండు ఎకరాలు మాత్రమే ఉండేది. నాగార్జున గారు ఇచ్చిన డబ్బు, మాస్టర్ చిత్రానికి వచ్చిన డబ్బుతో అప్పటి రెట్లని బట్టి ఐదు ఎకరాలు కొన్నా అని శివాజీ తెలిపారు. కాబట్టి నాగార్జున గారిని నేను దైవంగానే భావిస్తా. కానీ నా క్యారెక్టర్ మీద మచ్చ పడుతున్నప్పుడు ఎదురుగా దేవుడు ఉన్నా తల దించుకుని ప్రశ్నిస్తా. అందులో తగ్గేది లేదు.
శోభా శెట్టిని గొంతుమీద కాలేసి తొక్కుతా అని శివాజీ హౌస్ లో అన్నారు. అక్కడ జరిగిన ప్రణామాల క్రమంలో ఏ తెలుగు వాడు అయినా అమ్మాయిని అయినా అబ్బాయిని అయినా సహజంగా తిట్టే మాట అది అని తెలిపారు. నన్ను చివర్లో విలన్ గా చూపించే ప్రయత్నాలు జరిగినట్లు కూడా శివాజీ తెలిపారు.
నాగార్జున గారు క్షమాపణ చెప్పమన్నా నేను తగ్గనిది అందుకే. అయినా నేను అక్కడ ప్రశ్నించింది నాగార్జున గారిని అని నేను అనుకోవడం లేదు. నాగార్జున గారు తనకి ఉన్న సమాచారం మేరకు నడుచుకుంటారు. చేసింది అంతా బిగ్ బాస్. కాబట్టి నేను ప్రశ్నించింది బిగ్ బాస్ నే కానీ నాగార్జునని కాదు అని శివాజీ అన్నారు.
ఇక ప్రశాంత్, యావర్ గురించి మాట్లాడుతూ వాళ్లిద్దరూ ట్యాలెంట్ ఉన్న యువకులు. ప్రశాంత్ కి నేను జస్ట్ సపోర్ట్ ఇచ్చా. తన గేమ్ తాను ఆడి గెలిచాడు. మా స్నేహం ఇకపై కూడా కొనసాగుతుంది. హౌస్ లో నాతో కొంతమంది నటించారు. బయటకి వచ్చాక ఆ విషయం అర్థం అయింది అంటూ శివాజీ హాట్ కామెంట్స్ చేశారు.