MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రేవంత్‌కి సీమంతం.. చంటికి పనిష్‌మెంట్‌.. ఆరోహి-సూర్యల లవ్‌ స్టోరీ బట్టబయలు..Bigg Boss6 - 28th day హైలైట్స్..

రేవంత్‌కి సీమంతం.. చంటికి పనిష్‌మెంట్‌.. ఆరోహి-సూర్యల లవ్‌ స్టోరీ బట్టబయలు..Bigg Boss6 - 28th day హైలైట్స్..

బిగ్‌ బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ 28వ రోజు(శనివారం) షో నాగ్‌ ఎంట్రీతో సందడిగా సాగింది. ఆయన ఎప్పటిలాగే క్లాస్‌ పీకడం, రైట్‌ ఎవరూ రాంగ్‌ ఎవరో చెప్పడం జరిగింది. అయితే  దాదాపు అందరికి టిప్పు ఇచ్చాడు. కానీ నలుగురికి మాత్రం ఏ టిప్పు రాలేదు. దీంతో వారిలో ఒకరికి పనిష్‌మెంట్ ఇవ్వాలని నిర్ణయించారు. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Oct 02 2022, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్‌ బాస్‌ తెలుగు ఆరో (Bigg Boss Telugu 6) సీజన్‌.. షో కాస్త రసవత్తరంగా, మరికాస్త బోరింగ్‌, ఇంకాస్త సోదిగా సాగుతున్నట్టు ఆడియెన్స్‌ నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీంతో టీఆర్‌పీ రేటింగ్‌ కూడా బాగా తగ్గిపోయింది. ఒకానొక దశలో బిగ్‌ బాస్‌ 6ని ఆపేయాలనే ఆలోచనకు కూడా నిర్వహకులు వచ్చినట్టు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హౌజ్‌ మేట్స్ కూడా హౌజ్‌లో తమ ఆట తీరు కూడా అలానే ఉండటం విచారకరం. 
 

26

బిగ్‌ బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ 28వ రోజు(శనివారం) షో నాగ్‌ ఎంట్రీతో సందడిగా సాగింది. ఆయన ఎప్పటిలాగే క్లాస్‌ పీకడం, రైట్‌ ఎవరూ రాంగ్‌ ఎవరో చెప్పడం జరిగింది. అయితే దాదాపు అందరికి టిప్పు ఇచ్చాడు. కానీ నలుగురికి మాత్రం ఏ టిప్పు రాలేదు. దీంతో వారిలో ఒకరికి పనిష్‌మెంట్ ఇవ్వాలని నిర్ణయించారు. మరి ఏ పనిష్‌మెంట్‌ ఇచ్చారనేది చూస్తే. మొదటగా కెప్టెన్‌ అయిన కీర్తిని అభినందించారు నాగ్‌(Nagarjuna).
 

36

అనంతరం.. సూర్య ఫుడ్‌ పడేయడంతో తీవ్రంగా క్లాస్‌ పీకాడు. కెప్టెన్‌గా ఆదిరెడ్డి విఫలమయ్యాడని, అదే సమయంలో ఆరోహిపై కోపంతో తాను ఫుడ్‌ పడేసినట్టు చెప్పిన సూర్యకి గట్టిగా క్లాస్‌ పీకాడు. ఇందులో ఆరోహి,సూర్యల లవ్‌ స్టోరీ బయటపెట్టించాడు నాగార్జున. ఫుడ్‌ విషయంలో ఆరోహి,సూర్యల మధ్య కెమిస్ట్రీ గురించి చెబుతూ, కలవరించిన పేర్లని బయటపెట్టించారు. ఆరోహికి నందు అనే లవర్‌ ఉన్నాడని, సూర్యకి బుజ్జమ్మ ఉందని వారిచేతే చెప్పించాడు. దీంతో ఇప్పటి వరకు తమ మధ్య ఏదో ఉందని అనుకున్నారని, దీంతో అన్నీ క్లీయర్‌ అయ్యాయని ఆరోహి అనడం విశేషం.

46

ఈ క్రమంలో రేవంత్‌ టాపిక్ వచ్చింది. కొంత మార్పులు చేసుకోవాలని చెబుతూనే ఆయన ఆట బాగుందని వెయ్యి రూపాయల టిప్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అయితే రేవంత్‌ భార్య సీమంతం వీడియోని చూపించిన విషయం తెలిసిందే. ఆ విషయంలో రేవంత్‌ ఎమోషనల్‌ అయ్యాడు. కానీ అది చూసిన గీతూ రేవంత్‌ కూడా సీమంతం చేయాలని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్తలు కూడా ఆ ఫీలింగ్‌ని పొందుతారని, అలాంటప్పుడు సీమంతం చేసుకోవడంలో తప్పులేదని గీతూ వాదించింది. బాలాదిత్య కూడా సపోర్ట్ చేయడంతో నాగ్‌ కన్విన్స్ అయ్యాడు. అయితే సీమంతం చేయాలా? వద్దా అనేది బిగ్‌ బాస్‌ని అడిగి తేల్చుకోండి అని తెలిపారు నాగ్‌. 
 

56

ఇలా ఇతర సభ్యుల గురించి, వారి తప్పొప్పుల గురించి చెప్పుకుంటూ వచ్చాడు నాగార్జున. వారి ఆట తీరుని బట్టి టిప్పు ఇచ్చుకుంటూ వచ్చాడు. కానీ ఇందులో ఆదిరెడ్డి, బాలాదిత్య, ఇనయ, చంటిలకు మాత్రం టిప్పు ఇవ్వలేదు. వారికి జీరో వచ్చింది. వీరిలో ఒకరికి ఈ సీజన్‌ మొత్తం కెప్టెన్‌ కాకుండా చేసే పనిష్‌మెంట్‌ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఇంటి సభ్యుల నిర్ణయం ప్రకారం ఆ ఒక్కరు ఎవరనేది నిర్ణయించుకోవాలని చెప్పగా, చివరగా చంటిని తేల్చారు. ఈ ప్రకారంగా ఆయన ఈ ఆరో సీజన్‌ మొత్తానికి కెప్టెన్సీ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. అంతకంటే ముందు నాగ్‌ చంటికి క్లాస్‌ పీకాడు. మీలోని సరైన గేమ్‌ బయటకు రావడం లేదని తెలిపారు. ఇకనైనా కసితో ఆడాలని చెప్పారు.

66

మరోవైపు సభ్యులచే మరో గేమ్‌ ఆడిపించాడు నాగార్జున. హౌజ్‌లో వారు ఎలా ఉంటారనేదాన్ని పానిపూరీ రూపంలో తినిపించి చెప్పాలన్నారు. సోమరి పోతుగా చాలా మంది గీతూకి ఆలూ పూరి తినిపించారు. దీంతోపాటు ఆమెకి ఏడిపించే లక్షణం ఉందని, రూడ్‌గా ఉంటుందని తెలిపారు. అలాగే శ్రీ సత్య కూడా సోమరిపోతుగా తేల్చారు. ఇక రేపు(ఆదివారం) దసరాకి సంబంధించిన పెద్ద ఈవెంట్‌ ఉందని, సాయంత్రం ఆరు గంటల నుంచే షో ప్రారంభమవుతుందని తెలిపారు నాగ్‌. రేపే ఎలిమినేట్‌ అయ్యేది ఎవరో తెలుస్తుందని వెల్లడించారు.
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సంజూ శాంసన్ vs కీర్తి సురేష్ .. వీరిలో నెంబర్ 1 ఎవరో తెలుసా..?
Recommended image2
Maheshbabu కోసం కదిలి వచ్చిన పవన్ కళ్యాణ్‌, వెంకటేష్‌, నాగార్జున.. కట్‌ చేస్తే సినిమా ఫ్లాప్‌
Recommended image3
1000 Crore Heroes: వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిన హీరోలు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved