MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • కట్టప్పని మించేలా రవికి లోబో వెన్నుపోటు.. షణ్ముఖ్ పరువు తీసిన నాగ్

కట్టప్పని మించేలా రవికి లోబో వెన్నుపోటు.. షణ్ముఖ్ పరువు తీసిన నాగ్

Bigg Boss 5 Telugu అక్టోబర్ 23 శనివారం వీకెండ్ ఎపిసోడ్ సరదాగా సాగింది. హౌస్ లో సన్నీ కొత్త కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించడంతో సందడిగా మారింది. సన్నీ.. రేషన్ మ్యానేజర్ గా కాజల్ ని నియమించాడు. 

3 Min read
Author : pratap reddy
Published : Oct 23 2021, 10:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

Bigg Boss 5 Telugu అక్టోబర్ 23 శనివారం వీకెండ్ ఎపిసోడ్ సరదాగా సాగింది. హౌస్ లో సన్నీ కొత్త కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించడంతో సందడిగా మారింది. సన్నీ.. రేషన్ మ్యానేజర్ గా కాజల్ ని నియమించాడు. ఇక ఇంటి సభ్యులు సరదాగా ఓ టాస్క్ చేశారు. హౌస్ మేట్స్ తమకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలనుకుంటున్నారో చెబుతారు. వారి మాటలని బట్టి మిగిలిన సభ్యులు వారికి ఎవరు పర్ఫెక్ట్ జోడినో నిర్ణయిస్తారు. ఈ టాస్క్ లో మానస్, ప్రియాంక బెస్ట్ కపుల్ గా నిర్ణయిస్తారు. వీరిద్దరికి హౌస్ మేట్స్ పెళ్లి చేయడంతో ఈ టాస్క్ చాలా సరదాగా సాగుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక హౌస్ మేట్స్ తో కింగ్ Nagarjuna మీటింగ్ మొదలవుతుంది. ముందుగా నాగార్జున రవి నుంచే మొదలు పెడతారు. ఈ వారం హౌస్ లో వరస్ట్ పెర్ఫామర్ ఎవరు అని ప్రశ్నించగా రవి.. ప్రియాంక పేరు చెబుతాడు. ఆ తర్వాత రవి స్టిక్కర్స్ దొంగిలించడం గురించి నాగ్ ప్రశ్నిస్తారు. అవి అక్కడ పడిపోయి ఉంటే తీసుకున్నాను.. దొంగిలించలేదు అని రవి అంటాడు. ఆ తర్వాత విశ్వ కూడా వరస్ట్ పెర్ఫామర్ గా ప్రియాంక పేరే చెబుతాడు. ఇక గుండు సూది కోసం ప్రియాంకని విశ్వ నెట్టివేయడం పై చర్చ జరుగుతుంది. 

37

ఈ చర్చలో అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు నాగ్ వీడియో ప్లే చేస్తాడు. వీడియోలో విశ్వదే తప్పు అని తేలుతుంది. జెస్సి, ప్రియాంక, ప్రియా ముగ్గురూ వరస్ట్ పెర్ఫామర్ గా విశ్వ పేరే చెబుతారు. ఆ తర్వాత ప్రియా.. సన్నీని చెంప పగలగొడతా అని తిట్టడంపై నాగ్ ప్రశ్నిస్తారు. తాను అన్ని సార్లు ఆ మాట అని ఉండకూడదు అని ప్రియా అంటుంది. అలాగే సన్నీ కూడా వివరణ ఇస్తాడు. ఆ టైం లో నన్ను మాత్రమే టార్గెట్ చేయడంతో కోపం వచ్చి నెట్టాను అని అంటాడు. ఇప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం అని అంటాడు. 

47

Vj Sunny ఇతరుల హెల్ప్ తీసుకుని టాస్క్ ఆడడం వల్ల కెప్టెన్సీ క్యాన్సిల్ అని నాగ్ అంటారు. దీనితో ఒక్క నిమిషం హౌస్ మేట్స్ మొత్తం షాక్ లోకి వెళతారు. తాను రక్షించుకోవడం కోసం మాత్రమే సాయం తీసుకున్నానని సన్నీ వివరణ ఇవ్వడంతో నాగార్జున ఓకె చెబుతారు. సన్నీ కెప్టెన్సీ నిలబడుతుంది. తనని ఎదవని చేసి వాడుకున్నారు అంటూ సిరి, జెస్సి పై షణ్ముఖ్ అలిగిన సంగతి తెలిసిందే. ఆ దృశ్యాలకు సంబందించిన ఫన్నీ వీడియోని నాగ్ ప్లే చేశారు. ఈ వీడియోతో షణ్ముఖ్ హౌస్ మేట్స్ ముందు నవ్వులపాలైనట్లు అయింది. 

57

ఇక నామినేషన్స్ లో ఉన్న Lobo, Ravi, జెస్సి, ప్రియా, సిరి, అనీ, శ్రీరామ్, కాజల్ లలో శ్రీరామ్ సేఫ్ అయ్యాడు. అతడికి గోల్డెన్ ఎగ్ రావడంతో నాగ్ శ్రీరామ్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. ఆ తర్వాత నాగ్ లోబోని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. హౌస్ లో ఉన్నారిలో తోపు ఎవరు ? డూపు ఎవరు అని ప్రశ్నించారు. ఇక్కడ లోబోకి తెలియని విషయం ఏమిటంటే.. తనని హౌస్ మేట్స్ బయట టివిలో చూస్తున్నారనే సంగతి లోబోకి తెలియదు. నాగార్జున తనని సీక్రెట్ గానే అడుగుతున్నారు అని అనుకుంటాడు. 

67

హౌస్ లో ప్రియాంక, కాజల్, ప్రియా, రవి, అని, షణ్ముఖ్ లు డూపులుగా చెబుతాడు లోబో. మిగిలిన ఆరుగురు మానస్, సన్నీ, విశ్వ, శ్రీరామ్, సిరి, జెస్సి తోపులుగా చెబుతాడు. లోబో ఎవరి గురించి ఎలా చెప్పినా పెద్దగా ఆశ్చర్యం లేదు.. కానీ రవిని డూపుగా పరిగణించడం అందరికి షాక్ ఇచ్చే అంశమే. రవి, లోబో ఫ్రెండ్ షిప్ గురించి అందరికి తెలిసిందే. కానీ రవిని డూపుగా ఎందుకు చెప్పానో వివరణ ఇస్తాడు లోబో. రవికి తాను అవసరమైనప్పుడు మాత్రమే గుర్తుకు వస్తానని అంటాడు.ఇందంతా టివిలో చూస్తున్న రవి ఒకింత ఆశ్చర్యానికి గురవుతాడు. 

77

ఇక నేటి ఎపిసోడ్ చివర్లో మరొకరు నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు. నామినేషన్స్ లో ఉన్న వారికి ఒక్కొక్కరికి ఒక్కో ఎగ్ ఇస్తారు. ఆ ఎగ్ పగలగొట్టినప్పుడు లోపల రెడ్ కలర్ ఉంటే సేఫ్ కాదు.. గ్రీన్ ఉంటే సేఫ్. దీనితో కాజల్ కు మాత్రమే గ్రీన్ ఎగ్ వస్తుంది.. ఆమె సేవ్ అవుతుంది. మిగిలిన ప్రియా, జెస్సి, లోబో, అనీ, సిరి, రవి లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది సండే ఎపిసోడ్ లో తేలుతుంది. 

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image3
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved