- Home
- Entertainment
- సిరితో రొమాన్స్, ఆ ఒత్తిడితోనే దీప్తి బ్రేకప్ చెప్పింది.. చిచ్చు పెట్టింది వాళ్లే అంటూ షాకిచ్చిన షణ్ముఖ్
సిరితో రొమాన్స్, ఆ ఒత్తిడితోనే దీప్తి బ్రేకప్ చెప్పింది.. చిచ్చు పెట్టింది వాళ్లే అంటూ షాకిచ్చిన షణ్ముఖ్
యూట్యూబ్ వీడియోలతో దీప్తి సునైనా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షో ఆమె క్రేజ్ ని మరింతగా పెంచింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే.

యూట్యూబ్ వీడియోలతో దీప్తి సునైనా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షో ఆమె క్రేజ్ ని మరింతగా పెంచింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక దీప్తి సునైనా ప్రస్తుతం మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో ప్రేమాయణం కొనసాగించింది. రీసెంట్ గానే వీరిద్దరూ బ్రేకప్ అయ్యారు. షణ్ముఖ్ గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 5లో రన్నరప్ గా నిలిచాడు.
వీరిద్దరి బ్రేకప్ ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే బిగ్ బాస్ 5 జరుగుతుండగా దీప్తి సునైనా తన ప్రియుడి కోసం సోషల్ మీడియాలో ఎంతగానో క్యాంపైన్ చేసింది. షణ్ముఖ్ గెలుపు కోసం దీప్తి ఎంతో శ్రమించింది. అది చూసి దీప్తి ప్రియుడిపై ఎంత ప్రేమ చూపిస్తుందో అని నెటిజన్లు అనుకున్నారు.
కానీ బిగ్ బాస్ ముగిసాక కొన్ని రోజులకు వీరిద్దరూ విడిపోయారు. వీరిద్దరి బ్రేకప్ కు కారణం సిరినే అంటూ ట్రోలింగ్ కూడా జరిగింది. బిగ్ బాస్ 5లో షణ్ముఖ్, సిరి ఎంత చనువుగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్రెండ్ షిప్ అంటూనే కిస్సులు, హగ్గులతో మోతెక్కించారు.
ఒకవైపు దీప్తితో రిలేషన్ లో ఉన్నాడు షణ్ముఖ్.. సిరి కి కుడి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అయినా వీళ్ళిద్దరూ ఇలా శృతిమించిపోవడం బాగాలేదు అంటూ ట్రోలింగ్ కూడా జరిగింది. సిరి వాళ్ళ అమ్మ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు షణ్ముఖ్ నిన్ను హగ్ చేసుకోవడం నాకు నచ్చలేదు అని ముఖం మీదే చెప్పేసింది.
తాజాగా షణ్ముఖ్.. దీప్తితో విడిపోవడానికి గల కారణాలు వివరించాడు. చాలా రీజన్స్ ఉన్నాయి అంటూనే అసలు విషయం బయట పెట్టాడు. దీప్తి, నేను విడిపోవడానికి సిరిని నిందించడం కరెక్ట్ కాదు. మేము విడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. నా వల్ల దీప్తి చాలా నెగిటివిటి ఎదుర్కొంది. ఒకరకంగా చెప్పాలంటే దీప్తి, సిరి మంచి స్నేహితులు.
సిరి హౌస్ లో నాకు చాలా సపోర్ట్ చేసింది. అదంతా పక్కన పెట్టి వాళ్ళమ్మ నన్ను తప్పుగా అర్థం చేసుకుంది. ఇక మా ఇద్దరి మధ్య చనువు వల్ల సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీప్తి కుటుంబానికి కూడా నేను, సిరి చనువుగా ఉండడం నచ్చలేదు. దీనితో దీప్తిపై ఒత్తిడి పెరిగింది. మేమిద్దరం విడిపోవడానికి ఇది కూడా ఒక కారణం. కుటుంబ సభ్యుల ఒత్తిడి తమ మధ్య చిచ్చు రాజేసింది అని షణ్ముఖ్ చెప్పకనే చెప్పాడు.
భవిష్యత్తులో మేమిద్దరం కలుస్తామా లేదా అనేది దేవుడిపై ఆధాపడి ఉంటుంది అని షణ్ముఖ్ అన్నాడు. ప్రస్తుతం తాను వర్క్ పైనే ఫోకస్ పెట్టినట్లు షణ్ముఖ్ తెలిపాడు.