మహేష్-రాజమౌళి మూవీ గూస్‌బంమ్స్ అప్‌డేట్.. వామ్మో జక్కన్న ప్లాన్ మైండ్ బ్లాక్.. ఫ్యాన్స్ కి మరో ట్రీట్?
రాజమౌళి నెక్ట్స్ కూడా మల్టీస్టారర్ చిత్రం చేయబోతున్నారు. మహేష్‌తో రూపొందించబోయే చిత్రం భారీ మల్టీస్టారర్‌గా ఉంటుందని టాక్. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌లో వైరల్‌గా మారుతుంది.
రాజమౌళి వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు చేస్తున్నారు. `బాహుబలి` ఓ రకంగా మల్టీస్టారర్ చిత్రమనే చెప్పాలి. ప్రభాస్‌తోపాటు రానా కూడా నటించి ఆకట్టుకోగా, ఈ భారీ విజువల్ వండర్‌గా సంచలన విజయం సాధించింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టి ఇండియన్ సినిమా రికార్డులను తిరగ రాసింది. టాలీవుడ్ సత్తాని ప్రపంచానికి చాటి చెప్పింది.
ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్`తోనూ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందించారు జక్కన్న. స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో కలిసి `ఆర్‌ఆర్‌ఆర్`ని భారీ స్థాయిలో ఐదువందల కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. కరోనా కారణంగా ఇది నాలుగు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.
రాజమౌళి నెక్ట్స్ సూపర్ స్టార్ మహేష్‌బాబుతో ఉండబోతుంది. ఈ విషయాన్ని రాజమౌళి ఇప్పటికే అనేక సార్లు వెల్లడించారు. ఈ చిత్రం ఫారెస్ట్ నేపథ్యంలో సాగుతుందని, ఇందులో మహేష్‌బాబు అడ్వెంచర్ పాత్రని పోషించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ బిజీగా ఉన్నారట.
ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మరో బిగ్గెస్ట్ సీక్రెట్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కూడా మల్టీస్టారర్‌గా ఉండబోతుంది. మహేష్‌బాబుతోపాటు మరో స్టార్ హీరో కూడా ఇందులో కీలక పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తుంది.
ఓ ప్రముఖ టాలీవుడ్ హీరోనే ఇందులో తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. దాదాపు నలభై నిమిషాల పాటు ఆ పాత్ర నిడివి ఉంటుందని, అది సినిమాకి చాలా కీలకమైన ఎపిసోడ్ అని, అందుకోసం ఓ పెద్ద హీరో కావాల్సి ఉండగా, టాలీవుడ్ హీరోనే తీసుకోవాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని తెలుస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్న నేపథ్యంలో ఆ స్థాయి ఇమేజ్ ఉన్న హీరోనే ఎంచుకోవాలనుకుంటున్నారట జక్కన్న.
అయితే ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉందని, ఇద్దరు హీరోలున్నా, వారిద్దరి కాంబినేషన్‌లో సన్నివేశాలు ఉండవని టాక్. స్పెషల్ రోల్‌కి సంబంధించి స్పెషల్ ఎపిసోడ్ ఉంటుందని, కలిసి నటించే అవకాశం లేదని, ఆ పాత్ర ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా ఉండబోతుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇప్పుడీ వార్త మాత్రం అటు సామాజిక మాధ్యమాల్లో, ఇటు ఫిల్మ్ నగర్‌లోనూ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం మహేష్‌బాబు `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తుండగా, ఇది మే 12న సమ్మర్ స్పెషల్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీంతోపాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మరో సినిమా చేస్తున్నారు. ఇటీవల ఇది ప్రారంభమైంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. అనంతరం రాజమౌళి సినిమా ఉండే ఛాన్స్ ఉంది.