MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • బిగ్‌ బాస్‌ హౌజ్‌లో బిగ్‌ ట్విస్ట్.. ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు రీఎంట్రీ, ఎందుకంటే?

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో బిగ్‌ ట్విస్ట్.. ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు రీఎంట్రీ, ఎందుకంటే?

బిగ్‌ బాస్‌ తెలుగు 8లో మరో ట్విస్ట్ చోటు చేసుకోబోతుంది. ఈ సారి మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు బిగ్‌ బాస్‌. ఇప్పటికే ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు రీఎంట్రీ ఇవ్వబోతున్నారట.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 17 2024, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బిగ్‌ బాస్‌ తెలుగు 8 విజయవంతంగా పదకొండు వారాలు పూర్తి అయ్యాయి. ఈ ఆదివారం ఎపిసోడ్‌లో ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ కాబోతున్నారనేది తేలనుంది. ఇదిలా ఉంటే ఈ సీజన్‌ బిగ్‌ బాస్‌ అంతా ట్విస్ట్ లు, టర్న్ లు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సారి మరో ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లని మరోసారి హౌజ్‌లోకి తీసుకురాబోతున్నారట. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ సారి బిగ్‌ బాస్‌ తెలుగు 8 సీజన్‌కి సంబంధించి పెద్దగా ఆదరణ లేదనే కామెంట్‌ వినిపిస్తుంది. ఆసక్తికరంగా లేదని, చాలా సప్పగా సాగుతుందని, నామినేషన్‌లో తిట్టుకోవడం తప్పితే ఆ తర్వాత అంత కిక్‌ ఇవ్వడం లేదనే కామెంట్‌ ఉంది. ఓ రకంగా నెగటివ్‌ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికే హౌజ్‌లోకి వెళ్లి వచ్చిన వాళ్లు, మాజీ కంటెస్టెంట్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

35

ఈ నేపథ్యంలో షోపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తుంది టీమ్‌. ఈ మేరకు ఇప్పటికే ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లని మరోసారి హౌజ్‌లోకి తీసుకురాబోతుంది. అయితే అది వైల్డ్ కార్డ్ ద్వారా కాదు. కేవలం నామినేషన్‌కే పరిమితం చేస్తుంది. నామినేషన్‌ ప్రక్రియని ఈ సారి కొత్తగా చేయాలని ట్రై చేస్తున్నారు. నామినేషన్‌ని మాజీ కంటెస్టెంట్ల చేత చేయించబోతున్నారు. వారే నామినేట్‌ చేయబోతున్నారట. అందుకోసం ఇప్పటికే ఎలిమినేట్‌ అయిన సోనియా, మెహబూబ్‌, నయని పావని, హరితేజ, శేఖర్‌ బాషా, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, కిర్రాక్‌ సీత, నైనిక వంటి వారంతా మళ్లీ రాబోతున్నారట. 
 

45
photo-star maa big boss telugu 8 promo

photo-star maa big boss telugu 8 promo

ఇప్పటి వరకు హౌజ్‌ మేట్స్ ఇతర కంటెస్టెంట్లలో ఎవరు హౌజ్‌లో ఉండటానికి అనర్హులో చెబుతుంటారు. అందుకు కారణాలు చెబుతారు. ఎక్కువ ఓట్లు పడ్డవాళ్లు నామినేట్‌ అవుతారు. అయితే ఈ సారి హౌజ్‌ని వీడిన కంటెస్టెంట్లు మళ్లీ హౌజ్‌లోకి వచ్చి నామినేట్‌ చేస్తారట. వాళ్ల ఆట తీరుని చెప్పబోతున్నారని, ఎందుకు ఎలిమినేట్‌ కావాలో చెప్పనున్నారట. ఇదొక కొత్త ప్రయోగం చేయబోతున్నారని తెలుస్తుంది. సోమవారం ఎపిసోడ్‌లో ఇది జరగబోతుందని సమాచారం. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. 
 

55
photo-star maa big boss telugu 8 promo

photo-star maa big boss telugu 8 promo

 ఈ వారం నామినేషన్‌లో యష్మి, గౌతమ్‌, పృథ్వీరాజ్‌, తేజ, అవినాష్‌, విష్ణు ప్రియా ఉన్నారు. వీరిలో ఇప్పటికే పృథ్వీరాజ్‌, గౌతమ్‌ సేవ్‌ అయ్యారు. ప్రస్తుతం నామినేషన్‌లో యష్మి, విష్ణు ప్రియా, తేజ, అవినాష్‌ ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్‌ కాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అవినాష్‌, తేజలలో ఒకరు ఎలిమినేట్‌ కాబోతున్నారని సమాచారం.  

read more:టేస్టీ తేజ, అవినాష్ లలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు? కీలకంగా నబీల్ డెసిషన్!

also read: సంక్రాంతి మొనగాడు సూపర్‌స్టార్‌ కృష్ణ ఫస్ట్ టైమ్‌ బరిలోకి దిగిన సినిమా ఏంటో తెలుసా? ఎన్టీఆర్‌కే మతిపోయింది

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Love Story Movies: గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడూ గొడవలేనా.. అయితే ఈ 6 సినిమాలు తప్పకుండా చూడాల్సిందే
Recommended image2
Naa Anveshana: సినిమా రివ్యూలు వద్దు.. యూట్యూబర్లకు నా అన్వేషణ అన్వేష్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏమన్నాడంటే?
Recommended image3
2 కోట్ల సినిమాకు 100 కోట్ల ఆఫరా? 200 కోట్లకు పైగా వసూలు చేసిన హనుమాన్ అంశ్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved