కొన్నిసార్లు హై డ్రామా, సినిమా తరహాలో డైరెక్షన్.. బిగ్ బాస్ షోపై ఉన్న పెద్ద అనుమానం నిజమేనా?
బిగ్ బాస్ షో అంటేనే సోషల్ మీడియాలో పెద్ద హంగామా ఉంటుంది. ఎన్ని సీజన్లు గడుస్తున్నా బిగ్ బాస్ షోపై ఉండే అనుమానాలు అలాగే కొనసాగుతున్నాయి.
సెప్టెంబర్ 1 ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి బిగ్ బాస్ తెలుగు 8 షో ప్రారంభం కాబోతోంది. సీజన్ 3 నుంచి హోస్ట్ గా కొనసాగుతున్న నాగార్జున బిగ్ బాస్ 8కి కూడా హోస్ట్ గా చేస్తున్నారు. ఈసారి ఎంటర్టైన్మెంట్ కి, ఫన్ కి లిమిటే లేదు అనే నినాదంతో బిగ్ బాస్ 8ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
బిగ్ బాస్ షో అంటేనే సోషల్ మీడియాలో పెద్ద హంగామా ఉంటుంది. ఎన్ని సీజన్లు గడుస్తున్నా బిగ్ బాస్ షోపై ఉండే అనుమానాలు అలాగే కొనసాగుతున్నాయి. బిగ్ బాస్ షో అనేది రియాలిటీ షో. కంటెస్టెంట్లు హౌస్ లో ఉన్న రూల్స్ కి అనుగుణంగా సహజ సిద్ధంగా రియల్ లైఫ్ లో లాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. గేమ్స్, టాస్క్ లు ఆడడం..కబుర్లు చెప్పుకోవడం లాంటివి ఉంటాయి. రియల్ లైఫ్ లో బిహేవ్ చేస్తున్నట్లే బిహేవ్ చేయాలి.
కానీ చాలా మందిలో ఉన్న అనుమానం, చాలా సీజన్లుగా బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే.. బిగ్ బాస్ షో రియాలిటీ షో కాదు.. అంతా స్క్రిప్టెడ్ అని. ఒక స్క్రిప్ట్ ప్రకారం కంటెస్టెంట్స్ ని నిర్వాహకులు నటింపజేస్తుంటారు అనే అనుమానాలు ఉన్నాయి.
కొన్ని సార్లు కంటెస్టెంట్స్ మధ్య హై డ్రామా, ఎమోషన్స్ చూసినప్పుడు బిగ్ బాస్ షో ఏమైనా డైరెక్షన్ లో, స్క్రిప్ట్ ప్రకారం సాగుతుందా అనే అనుమానాలు కలగడం సహజం. అయితే దీనిపై కంటెస్టెంట్స్, నిర్వాహకులు చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు. బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్ కాదు. అవన్నీ రియల్ ఎమోషన్స్ అని తెలిపారు.
అయితే గతంలో కొందరు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకి వచ్చాక ఈ రూమర్స్ పై స్పందించారు. బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్ కాదు కానీ.. కావాలంటే మీరు ఇలా చేయొచ్చు అంటూ హింట్స్ ఇస్తారని తెలిపారు. కొన్నిసార్లు కంటెస్టెంట్స్ అటెన్షన్ కోసం కూడా ఫేక్ ఎమోషన్స్ తో హంగామా చేస్తారనే వార్తలు ఉన్నాయి. సినిమా తరహాలో డైరెక్షన్ ఉంటుందనే రూమర్స్ ని మాత్రం ఖండించారు.
గత సీజన్ లో శివాజీ, శోభా శెట్టి, అమర్ దీప్, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్ హైలైట్ అయ్యారు. మరి బిగ్ బాస్ 8లో హంగామా సృష్టించే కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. అసలు పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరెవరు అనే ఉత్కంఠకి మాత్రం మరి కొన్ని గంటల్లో తెరపడనుంది.