- Home
- Entertainment
- Star Wives: మహేష్, అల్లు అర్జున్, చరణ్, ఎన్టీఆర్.. స్టార్స్ భార్యల మధ్య వార్ ?.. రచ్చ మామూలుగా లేదుగా!
Star Wives: మహేష్, అల్లు అర్జున్, చరణ్, ఎన్టీఆర్.. స్టార్స్ భార్యల మధ్య వార్ ?.. రచ్చ మామూలుగా లేదుగా!
జనరల్‌గా మహేష్, బన్నీ, చరణ్, ఎన్టీఆర్ వంటి బిగ్‌స్టార్స్ మధ్య బాక్సాఫీస్ పోటీ ఉంటుంది. కానీ వారి భార్య నమ్రత, స్నేహారెడ్డి, ఉపాసనల మధ్య కూడా పోటీ స్టార్ట్ అయ్యింది. వీరంతా అక్కడ రచ్చ రచ్చ చేస్తున్నారు.

స్టార్ హీరోలకు భారీ ఫాలోయింగ్ ఉంటుంది. కోట్లలో వారిని అభిమానించే ఫ్యాన్స్ ఉంటారు. అభిమాన హీరో కోసం చొక్కాలు చించుకోవడం, ఫస్ట్ డే ఫస్ట్ షో అభిమాన హీరో సినిమా చూసి తామేంటో చాటుకుంటారు. సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. అదే సమయంలో స్టార్ హీరోల సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఉంటుంది. ఏ హీరో సినిమా కలెక్షన్లు ఎంత అనేది పోటీ పడుతుంటారు. వారి సినిమా అప్‌డేట్లు వచ్చాయంటే నెట్టింట రచ్చ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ స్టార్ హీరోల భార్యలు కూడా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. తమ ఫాలోయింగ్‌ని చాటుకుంటూ తామేంటో నిరూపించుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లు వాడుతూ తామేంటో చూపిస్తున్నారు. ఓ రకంగా పోటీ పడుతున్నారు.
టాలీవుడ్‌లో పెళ్లైన టాప్ స్టార్స్ లో మహేష్ ఒకరు. ఆయన హీరోయిన్ నమ్రతనే వివాహం చేసుకున్నారు. నమ్రత అంటే తెలుగు సినీ ప్రియులకు ముందే పరిచయం. దీంతో ఆమెని సామాజిక మాధ్యమాల్లో చాలా మంది అభిమానులు ఫాలో అవుతుంటారు. అందులో భాగంగా ప్రస్తుతం నమ్రతని 2.1మిలియన్ల(21లక్షలు) మంది అభిమానులు ఫాలో అవుతున్నారు. అంతేకాదు నమ్రత కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. మహేష్‌కి సంబంధించిన అన్ని విషయాలను వెనకాల ఉండి తనే చూసుకుంటున్నప్పటికీ, సామాజిక మాధ్యమాల్లోనూ యాక్టీవ్‌గానే రాణిస్తుంది నమ్రత.
నమ్రత ఎక్కువగా మహేష్ నటిస్తున్న సినిమా అప్‌డేట్లు, తమ ఫ్యామిలీ ఫోటోలు, పండగలు, స్పెషల్ డేస్ విషెస్‌లు తెలియజేస్తుంటుంది. అప్పుడప్పుడు పలు సామాజిక విషయాలపై కూడా ఆమె స్పందిస్తుంది. తన లైఫ్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలను, ఫోటోల వెనుకున్న స్టోరీలను తెలియజేస్తూ అభిమానులను అలరిస్తుంది నమ్రత. అయితే ఇతర హీరోల భార్యలతో పోల్చితే నమ్రత మూడో స్థానంలో ఉందని చెప్పొచ్చు.
ఇక టాప్‌లో ఉన్నది ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. దీంతో స్నేహారెడ్డిని ఏకంగా 7 మిలియన్లు(డెభై లక్షల) మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు. అందులో చాలా వరకు బన్నీ ఫ్యాన్సే ఉంటారని చెప్పొచ్చు. అల్లు స్నేహారెడ్డి.. ఫ్యామిలీ విషయాలను, ముఖ్యంగా తమ పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్‌లకు సంబంధించి ఫన్నీ వీడియోలను, ఫోటో షూట్ పిక్స్ ని, ఇంట్లో చోటు చేసుకునే ఆసక్తికర విషయాలను, బన్నీ సినిమా అప్‌డేట్లు ఇలా అనేక విషయాలను పంచుకుంటుంది. నిత్యం సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటుంది.
ఇతర స్టార్ హీరోల భార్యలకు సాధ్యంకాని విధంగా తాను భారీ ఫాలోయింగ్‌తో దూసుకుపోతుంది స్నేహారెడ్డి. అంతేకాదు స్టార్ హీరోయిన్ల అందానికి ఏమాత్రం తక్కువ కాదు స్నేహారెడ్డి. అడపాదడపా తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది స్నేహారెడ్డి. అందుకే ఆమెకి అంత క్రేజ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో టాప్ చైర్ ఆక్రమించేసింది. ఇక బన్నీ, స్నేహారెడ్డి ఒకరినొకరు ఇష్టపడి పెద్ద సమక్షంలో వివాహం చేసుకోగా, వీరికి కుమారు అయాన్, కూతురు అర్హ ఉన్నారు. అల్లు అర్హ `శాకుంతలం` చిత్రంతో బాలనటిగా వెండితెరకు పరిచయం కాబోతుంది.
టాప్ చైర్‌లో రెండో స్థానంలో నిలిచింది రామ్‌చరణ్ భార్య ఉపాసన. కామినేని ఫ్యామిలీకి చెందిన ఉపాసన ఇప్పుడు పెద్ద వ్యాపారవేత్త. అపోలో ఆసుపత్రులకు సంబంధించిన ఫార్మా విభాగాన్ని ఆమె లీడ్ చేస్తున్నారు. ఆపోలో ఆసుపత్రులకు సంబంధించి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉపాసనకి ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగు మిలియన్స్ ఫాలోవర్స్ ఉంటే, 1.5మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్‌బుల్‌లో ఏడు లక్షలున్నారు. ఇలా మూడు మాధ్యమాల్లోనూయాక్టివ్‌గా ఉంటుంది ఉపాసన.
ఉపాసన ఎక్కువగా తమ ఫ్యామిలీ పిక్స్. చరణ్‌తో వెకేషన్ పిక్స్ తోపాటు తన ఆసుపత్రులు, వ్యాపారాలు,ప్రకటనలకు సంబంధించిన అప్‌డేట్లు, అలాగే సామాజిక కార్యక్రమాలు, చైతన్యం చేసే పోస్ట్ లు, ఇలా అనేక విషయాలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు. మెగా అభిమానులు మెచ్చిన మెగా కోడలుగా రాణిస్తున్నారు. ఉపాసన సైతం అడపాదడ చరణ్‌తోఉన్న క్లోజ్డ్ పిక్స్ ని పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది.
స్టార్ హీరోల భార్యల్లో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పూర్తిగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నారు. ఆమెకి ఇప్పటి వరకు సోషల్ మీడియా అకౌంట్ లేదంటే అతిశయోక్తి కాదు. జనరల్‌గా నందమూరి ఫ్యామిలీ హీరోలెవరైనా తమ భార్యలను బయటకు తీసుకురావడం ఉండదు. వారంతా పూర్తి ప్రైవేట్ లైఫ్‌నే ఇష్టపడుతుంటారు. అందులో భాగంగా సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్‌గా ఉండరు. ఎన్టీఆర్ భార్యనే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.
ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి కూడా కలిసి బయట కనిపించిన సందర్భాలు కూడా చాలా తక్కువ. అంతేకాదు ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టీవ్‌గా ఉంటారు. ఆ లైఫ్‌లోకి తాను వెళ్లాలని అనుకోవడం లేదని చాలా సందర్భాల్లో చెప్పారు. అంతేకాదు సామాజిక మాధ్యమాలు తనని ప్రభావితం చేయలేవని స్పష్టం చేశారు. ఇలాఈ విషయంలో ఎన్టీఆర్ భార్య వెనకబడిందనే టాక్ వినిపిస్తుంది.
నేచురల్ స్టార్ నాని అంజనాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆయన భార్య అంజన కూడా యాక్టివ్‌గానే ఉంటున్నారు. ఆమెకి లక్షకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. వీరితోపాటు సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి వారి భార్యలు అసలు సోషల్ మీడియా వైపే చూడరు. కానీ ఒక్క నాగార్జున భార్య, నటి అమల మాత్రం అడపాదడపా సోషల్ మీడియాలో ఉంటారు. ఆమెకి ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లున్నాయి. అందులోనూ చాలా తక్కువగానే రియాక్ట్ అవుతుంటారు. వీరితోపాటు హీరోల భార్యలు సామాజిక మాధ్యమాల్లో తక్కువగా ఉంటారు. చాలా మంది హీరోల భార్యలకి అసలు అకౌంట్లే లేవు.