MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bhumika: పొట్టిగౌన్‌లో ఫారెన్‌ వీధుల్లో ఓపెన్‌గా తిరుగుతున్న `ఖుషీ` భామ.. లేట్‌ వయసులో మరింత క్యూట్‌గా..

Bhumika: పొట్టిగౌన్‌లో ఫారెన్‌ వీధుల్లో ఓపెన్‌గా తిరుగుతున్న `ఖుషీ` భామ.. లేట్‌ వయసులో మరింత క్యూట్‌గా..

`ఖుషీ` హీరోయిన్‌ భూమిక లేట్‌ వయసులోనూ ఘాటు అందాలతో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె సెకండ్‌ ఇన్నింగ్స్ లో టాప్‌ గేర్‌లో దూసుకుపోతుంది. సినిమాల పరంగానే కాదు, గ్లామర్‌ పరంగా రెచ్చిపోతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 17 2022, 10:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

రీఎంట్రీ తర్వాత గ్లామర్‌ డోస్‌ పెంచిన భూమిక వరుసగా ఫోటో షూట్లు చేస్తూ వాటిని అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఫారెన్‌లో ఎంజాయ్‌ చేస్తున్న పిక్స్ ని షేర్‌ చేసింది భూమిక. ఇందులో పొట్టిదైన బ్లాక్‌ గౌన్‌లో హోయలు పోయింది. మోకాళ్ల పైకున్న గౌన్‌లో ఫోటోలకు పోజులిస్తూ రెచ్చిపోయింది. ఫారెన్‌ వీధుల్లో ఓపెన్‌గా తిరుగుతూ ఎంజాయ్‌ చేస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకోగా అవి తెగ ఆకట్టుకుంటున్నాయి. అయితే లేట్‌ వయసులోనూ ఘాటు అందాలతోనే కాదు, క్యూట్‌ అందాలతోనూ కనువిందు చేస్తుంది భూమిక. లేటెస్ట్ ఫోటోల్లో ఆమె ఎంతో క్యూట్‌గా ఉండటం విశేషం. వయసు పెరిగే కొద్ది క్యూట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌ అవుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 

39

భూమిక తెలుగులో చాలా సినిమాలు చేసినా పవన్‌ కళ్యాణ్‌తో చేసిన `ఖుషీ` ఆమెకి మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుంది.ఈ  చిత్రంతో ఆమె స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఇందులో పవన్‌.. భూమిక నడుముని చూసే సీన్‌ ఆ తర్వాత స్టోరీ టర్న్ తీసుకున్న తీరు ఆడియెన్స్ ని కట్టిపడేస్తుంది. సినిమా బ్లాక్‌ బస్టర్‌ విజయంలో భాగమైంది. అప్పట్లో ఇదొక ట్రెండ్‌ సెట్టింగ్‌ మూవీ కావడం విశేషం. 
 

49

ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసిన భూమిక మ్యారేజ్‌ తర్వాత సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇటీవల మళ్లీ రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. `ఎంసీఏ`లో కీ రోల్‌లో మెప్పించింది.  సీనియర్‌ హీరోయిన్‌ భూమిక రీఎంట్రీ తర్వాత మరింత హాట్‌గా కనిపిస్తుంది. అప్పట్లో అందాలు దాచిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం హద్దుల్లేవని చాటుకుంటోంది. ఛాన్స్ ల కోసం రెచ్చిపోతుంది. 

59

అయితే తరచూ ఆమె పంచుకుంటున్న గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి. నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. ఇటీవల షేర్‌ చేసిన చిత్రాలు సైతం ఆద్యంతం కనువిందు చేస్తున్నాయి. హీరోయిన్‌గా చేసేటప్పుడు భూమిక ఈ రేంజ్‌లో హాట్‌ షో చేసింది తక్కువ. కానీ ఇప్పుడు రెట్టింపు ఎనర్జీతో గ్లామర్‌ షో చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మొత్తంగా సినిమా ఛాన్స్ ల కోసమే ఇదంతా అంటున్నారు నెటిజన్లు. 

69

`యువకుడు` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది భూమిక చావ్లా. ఆ తర్వాత చేసిన `ఖుషీ` చిత్రంతో సూపర్‌ హిట్‌తోపాటుస్టార్‌ ఇమేజ్‌ని అందుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సి అవసరం రాలేదు. వరుసగా ఆమెకి భారీ ఆఫర్లు క్యూ కట్టాయి. అందులో `స్నేహమంటే ఇదేరా`, `వాసు`, `ఒక్కడు` చిత్రాల్లో అలరించింది. మహేష్‌తో చేసిన `ఒక్కడు`తో మరో బ్లాక్‌ బస్టర్‌ని సొంతం చేసుకుంది. 

79

`మిస్సమ్మ`, `సింహాద్రి`, `సాంబా`, `నా ఆటోగ్రాఫ్‌`, `జై చిరంజీవ`, `మాయా బజార్‌`, `సత్యభామ`, `అనసూయ`, `స్వాగతం`, `అమరావతి`, `యాగం` వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. అయితే ఇందులో `సత్యభామ`, `అనసూయ`, `అమరావతి` వంటి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు కూడా ఉండటం విశేషం. ఈ చిత్రాలతో భూమిక నటిగా విశేషంగా ఆకట్టుకుంది. 

89

అయితే ఆ తర్వాత భూమిక కెరీర్‌ గాడి తప్పింది. ఆమె చిన్న సినిమాలు చేయడంతో పెద్ద సినిమాలు పోయాయి. పెద్ద సినిమాలు సక్సెస్‌ కాకపోవడంతో చిన్న చిత్రాల ఆఫర్లే వచ్చాయి. దీంతో సెకండ్‌ గ్రేడ్‌ హీరోయిన్‌గా మారిపోయింది భూమిక.

99

 `ఎంసీఏ` తర్వాత మళ్లీ వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తుంది. `సవ్యసాచి`,`రూలర్‌`, `సీటీమార్‌` సినిమాలు చేసింది.ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా, హిందీలో మరో సినిమా చేస్తుంది భూమిక. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Recommended image2
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Recommended image3
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved