Bhumika: బీచ్ లో చీరకట్టు అందాలు.. వన్నె తరగని అందంతో సీనియర్ హీరోయిన్
పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు భూమిక లక్కీ హీరోయిన్. వీరి ముగ్గురితో భూమిక నటించిన చిత్రాలు ఘనవిజయం సాధించాయి. యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది.

Bhumika Chawla
పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు భూమిక లక్కీ హీరోయిన్. వీరి ముగ్గురితో భూమిక నటించిన చిత్రాలు ఘనవిజయం సాధించాయి. యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఆల్ టైం క్లాసిక్ ఖుషి చిత్రంతో భూమిక పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఒక్కడు, సింహాద్రి చిత్రాలు భూమికని తిరుగులేని హీరోయిన్ గా నిలబెట్టాయి.
Bhumika Chawla
ప్రస్తుతం Bhumika Chawla వయసు 43 ఏళ్ళు. సహజంగానే ఈ వయసులో హీరోయిన్ గా ఆఫర్లు తగ్గుతాయి. కానీ భూమిక ఎప్పుడూ వెండి తెరకు దూరంగా లేదు. తన వయసుకు తగ్గ రోల్స్ చేస్తూనే ఉంది. అక్క, వదిన తరహా పాత్రలు చేస్తూనే కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తోంది. గత ఏడాది భూమిక Seetimaarr చిత్రంలో గోపీచంద్ కు అక్క పాత్రలో నటించింది.
Bhumika Chawla
గతంలో భూమికకు తన భర్తతో విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన ఫోటోస్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో భూమిక తన భర్త భరత్ ఠాకూర్ తో కలసి ఉన్న రొమాంటిక్ స్టిల్స్ కూడా పోస్ట్ చేసింది.
Bhumika Chawla
నిర్మాత భరత్ ఠాకూర్ ని భూమిక 2007లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత భూమిక హీరోయిన్ రోల్స్ తగ్గించి.. క్యారెక్టర్ రోల్స్ లో నటిస్తోంది. టాలీవుడ్ లో భూమికకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి.
Bhumika Chawla
తన వైవాహిక జీవితం ఒడిదుడుకులతో సాగినట్లు భూమిక గతంలో పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది భూమిక, భరత్ విడిపోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ వార్తలని భూమిక ఖండించింది.
Bhumika Chawla
తన మ్యారేజ్ లైఫ్ లో ఇబ్బందులు నిజమే అయినప్పటికీ తాము అన్నింటిని ఎదుర్కొంటూ అర్థం చేసుకుంటూ కలసి జీవిస్తున్నట్లు భూమిక ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది.
Bhumika Chawla
14 ఏళ్లుగా మనం కలసి జీవిస్తున్నాం. మన లైఫ్ లో సంతోషాలు, కన్నీళ్లు ఉన్నాయి. ఎత్తు పల్లాలు ఉన్నాయి. ఇప్పటికి కొన్ని విషయాలు నేర్చుకుంటూ కలిసే ముందుకు సాగుతున్నాం. ఒకరినొకరం అర్థం చేసుకుంటున్నాం. ఎవరి వృత్తిలో వారు కొనసాగుతూ ముందుకు వెళుతున్నాం అని భూమిక పోస్ట్ పెట్టింది.
Bhumika Chawla
తాజాగా భూమిక తన ఇన్స్టాగ్రామ్ లో సింపుల్ చిరునవ్వుతో ఉన్న ఫొటోస్, కూల్ లుక్ లో ఉన్న ఫోటోలని షేర్ చేసింది. అలాగే పిల్లగాలికి ఆస్వాదిస్తున్న పిక్స్ ని కూడా అభిమానులతో పంచుకుంది. బీచ్ లో చల్లని సాయంత్రం వేళ చీరకట్టులో భూమిక ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తోంది.