- Home
- Entertainment
- మహేష్ క్యూట్, పవన్ ఇంటలిజెంట్.. హీరోలపై భూమిక బోల్డ్ కామెంట్.. చిరు, ఎన్టీఆర్, వెంకీ గురించి ఏమన్నదంటే?
మహేష్ క్యూట్, పవన్ ఇంటలిజెంట్.. హీరోలపై భూమిక బోల్డ్ కామెంట్.. చిరు, ఎన్టీఆర్, వెంకీ గురించి ఏమన్నదంటే?
సొట్టబుగ్గల సుందరి భూమిక `ఖుషి` సినిమాతో చేసిన రచ్చ ఎలాంటిదో తెలిసిందే. టాలీవుడ్‌లో హాట్ కేక్ అయిన ఈ భామ స్టార్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Bhumika Chawla
భూమిక పదిహేనేళ్ల క్రితం టాలీవుడ్‌ని ఊపేసిన హీరోయిన్. `ఖుషి` చిత్రంతోనే కుర్రకారుకి డ్రీమ్ హీరోయిన్ అయిపోయింది. ఇందులో నడుము సీన్‌తో యువతని ఉర్రూతలూగించింది. క్యూట్ అందాలతో ఆమె చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ సినిమా కావడం, అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో భూమిక ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది.
ఆ తర్వాత `స్నేహమంటే ఇదేరా`, `వాసు`, `ఒక్కడు`, `మిస్సమ్మ`, `సింహాద్రి`, `సాంబ`, `నా ఆటోగ్రాఫ్`, `జై చిరంజీవ`, `మాయా బజార్`, `సత్యభామ`, `అనసూయ`, `అమరావతి` చిత్రాలతో పదేళ్లపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రాణించింది. స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించడమే కాదు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పించింది. `అనసూయ`, `మిస్సమ్మ`, `అమరావతి` చిత్రాలు ఆమెని నటిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి.
ఆ తర్వాత డౌన్ అయ్యింది భూమిక. పెద్ద హీరోలతో ఆఫర్లు రాలేదు. పైగా ఆమె తెలుగు కాకుండా హిందీ, తమిళం, న్నడ, మలయాళంపై ఫోకస్ పెట్టింది. తెలుగులో సినిమాలు తగ్గాయి. క్రమంగా ఆమె దూరమైంది. మళ్లీ నాని హీరోగా నటించిన `ఎంసీఏ` చిత్రంతో కమ్ బ్యాక్ అయ్యింది. కీలక పాత్రలు, బలమైన రోల్స్ చేసుకుంటూ వస్తుంది. చాలా సెలక్టీవ్‌గా వెళ్తుంది భూమిక.
ఇక కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో దాదాపు అందరు పెద్ద హీరోలతోనూ కలిసి నటించింది భూమిక. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, వెంకటేష్, రవితేజ వంటి వారితో కలిసి నటించింది భూమిక. ఈ క్రమంలో స్టార్ హీరోలపై ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. వారి గురించి ఒక్క మాటల్లో చెప్పాలనేప్రశ్న ఎదురుకాగా, భూమిక ఏం చెప్పిందంటే..
చిరంజీవి గ్రేట్ డాన్సర్ అని, ఎన్టీఆర్ ఫెంటాస్టిక్ డాన్సర్ అని, పవన్ కళ్యాణ్ వెరీ ఇంటలిజెంట్ అని, మహేష్ బాబు వెరీ క్యూట్ అని, వెంకటేష్ గురించి చెబుతూ స్పిరిచ్వల్ అని వెల్లడించింది భూమిక. గతంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో మహేష్ గురించి చెబుతూ ఆయన చాలా ఫన్ పర్సన్ అని చెప్పింది. తాను చాలా మంది హీరోలతో పనిచేశాను, కానీ మహేష్ వేసే జోకులకు నవ్వాపుకోలేము అని వెల్లడించింది భూమిక.
ఇందులో మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. పొట్టిగా ఉండటం ప్లస్ అయ్యిందా? మైనస్ అయ్యిందా అనే ప్రశ్నకి, ప్లస్ అయ్యిందని చెప్పడం విశేషం. భూమిక సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. ఇటీవల ఆమె `సీతారామం`, `బట్టర్‌ఫ్లై` చిత్రాల్లో నటించింది. హిందీ, తమిళ, ఇలా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తుంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె గ్లామర్ ఫోటోలు పంచుకుంటూ ఆశ్చర్యపరుస్తుంది. ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇస్తుంది.