ఆ స్టార్ డైరెక్టర్ చెంప పగలగొడితే స్టార్ హీరోయిన్ అయిపోతారు, శ్రీదేవి, రాధ, రాధికతో పాటు ఎంత మందిని కొట్టాడో!
చాలా మంది హీరోయిన్లని పరిచయం చేసిన ఘనత దర్శకుడు భారతీరాజా సొంతం. అలా పరిచయం చేసిన హీరోయిన్ల మీద ఆయన చేయి కూడా చేసుకున్నాడు. శ్రీదేవి చెంప చెళ్లుమనిపించాడు.
హీరోయిన్లను కొట్టిన భారతీరాజా
ఎన్నో మాస్టర్ పీస్ సినిమాలు తీసి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న దర్శకుల్లో భారతీరాజా ఒకరు. ఆయన సీతాకోక చిలుక, 16 వయదినిలే, కాదల్ పుక్కల్, అంతిమంతరై వంటి ఎన్నో హిట్ సినిమాలు తీశారు. గ్రామీణ నేపథ్యంతో కూడిన సినిమాలు తీయడంలో దిట్ట అయిన భారతీరాజా, చాలా మంది కొత్తవారిని హీరోయిన్స్ గా పరిచయం చేశారు.
ఈ లిస్ట్ లో రాధ, రాధిక, రేవతి, రేఖ వంటి స్టార్ హీరోయిన్లు ఉన్నారు. వీరు వెండితెరపై వెలిగారు. అంతేకాదు తాను పరిచయం చేసే హీరోయిన్లకు R అనే అక్షరంతో పేరు పెట్టే అలవాటు కూడా ఆయనకు ఉండేది. ఆయన పేరు మార్చకుండా తీసుకున్న ఏకైక హీరోయిన్ ప్రియమణి. భారతీరాజా దర్శకత్వం వహించిన కంగలాల్ ఖైదు సై సినిమాతో ప్రియమణి పరిచయం అయ్యారు.
నటి రాధ
కాగా ఆయన చేతిలో దెబ్బలు తినని హీరోయిన్లే లేరు అని చెబుతారు. ఈరోజుల్లో ఒక హీరోయిన్ ని దర్శకుడు కొడితే ఎంత పెద్ద గొడవ అవుతుందో మనకు తెలుసు. కానీ ఆ రోజుల్లో భారతీరాజా కొడతారని కొందరు హీరోయిన్స్ ఓపెన్ గా చెప్పారు. ఆయన చేతిలో దెబ్బలు తిన్న హీరోయిన్, స్టార్ అయిపోతుందని చాలా మంది నమ్మేవారు. భారతీరాజా చేతిలో దెబ్బలు తిన్న హీరోయిన్ల లిస్ట్ చాలా పెద్దదే.
భారతీరాజా, రాధిక
నటి రాధికను కిజక్కే పోగుమ్ రైల్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం చేశారు భారతీరాజా. ఈ సినిమా ఆమె సినీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచింది. సినిమా మొత్తం ఏడుస్తూనే ఉండే పాత్రలో నటించారు రాధిక. ఆమెకు ఏడుపు రప్పించడానికి డబ్బాలకి డబ్బాలు గ్లిజరిన్ వాడినా ప్రయోజనం కనబడలేదట. దాంతో టెన్షన్ లో ఉన్న భారతీరాజా రాధిక చెంప మీద గట్టిగా కొట్టాడట. ఆ దెబ్బతో రాధిక కళ్ల నుంచి కన్నీరు ధారాళంగా కారాయట.
రేవతి, భారతీరాజా
అలాగే నటి శ్రీదేవి కూడా భారతీరాజా చేతిలో దెబ్బలు తిన్నారట. భారతీరాజా దర్శకత్వంలో శ్రీదేవి నటించిన సినిమా 16 వయదినిలే. ఈ సినిమాలో శ్రీదేవి నటించిన పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో ప్రియుడైన సత్యజిత్ తనను విడిచి వెళ్లిపోయే సన్నివేశంలో శ్రీదేవికి ఏడుపు రాలేదట. దాంతో భారతీరాజా చేతిలో దెబ్బలు తిన్నారట శ్రీదేవి.
రేవతి హీరోయిన్ గా పరిచయమైన సినిమా మన్ వాసనై. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు రేవతి వయసు కేవలం 16 సంవత్సరాలట. ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో కన్నీరు పెట్టుకోవాల్సిన ఉండగా, రేవతికి ఏడుపు రాకపోవడంతో ఆమె చెంప మీద కొట్టాడట భారతీరాజా. ఆ దెబ్బ వల్లే నేను నేడు స్టార్ హీరోయిన్ ని అయ్యానని రేవతి పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.
నటి ప్రియమణి
భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన మరో మాస్టర్ పీస్ కడలోర కవితైగల్. ఈ సినిమాలో సత్యరాజ్, రేఖ జంటగా నటించారు. నటి రేఖకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాలో ఆమె నటించిన జెన్నిఫర్ టీచర్ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు భారతీరాజా తనను కొట్టారని రేఖ బాధపడ్డారట.
పరుత్తివీరన్ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న ప్రియమణిని కూడా హీరోయిన్ గా పరిచయం చేసింది భారతీరాజానే. ఆయన దర్శకత్వం వహించిన కంగలాల్ ఖైదు సై సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు ప్రియమణి. ఈ సినిమాలో భారతీరాజా చేతిలో దెబ్బలు తినకూడదని షరతు పెట్టుకుని నటించిన ప్రియమణికి కూడా ఒక దశలో దెబ్బలు తప్పలేదని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.