- Home
- Entertainment
- Devatha: దేవి ప్రవర్తన గురించి చింతిస్తున్న రుక్మిణి!మాధవ్ మీద విరుచుకుపడ్డ భాగ్యమ్మ!
Devatha: దేవి ప్రవర్తన గురించి చింతిస్తున్న రుక్మిణి!మాధవ్ మీద విరుచుకుపడ్డ భాగ్యమ్మ!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 12వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. దేవుడమ్మ బాధపడుతూ, ఈ వయసులో మనకి కావాల్సింది ఆస్తులు కాదు మనవులు, మనవరాళ్లు. వాళ్లే మనం ఆనందానికి కారణం అవుతారు అని అంటుంది.పక్క నుంచి ఇదంతా వింటున్న సత్య ఏడుస్తూ దేవుడమ్మ దగ్గరికి వచ్చి హద్దుకొని, ఆంటీ ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలైనా నేను మీకే కోడలుగా పుట్టాలి అని ఉంది ఆంటీ అని ఏడుస్తుంది. అప్పుడు దేవుడమ్మ బాధపడొద్దమ్మా అని సత్య ని ఓదారుస్తుంది. ఆ తర్వాత సీన్లో రుక్మిణి తన గదిలో ఏడుస్తూ, దేవి ఎప్పుడు ఇలా లేదు ఎందుకు తనలో తనే కుమిలిపోతుంది? మరోవైపు సత్య నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది.నేను ఎందుకు తన జీవితాన్ని పాడు చేయాలని చూస్తాను. దాని కోసమే కదా నేను అప్పుడు వెళ్ళిపోయాను. ఈ విషయం ఇప్పుడు పెనిమిటి కి చెప్తే మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో లొల్లి అవుతుంది. వాళ్ళిద్దరూ మధ్య గొడవలు రావడం నాకు ఇష్టం లేదు ఇది పెనిమిదికి చెప్పకపోవడం మంచిది అని అనుకుంటుంది.
మరోవైపు ఆదిత్య, సత్య ఎందుకు అలా రుక్మిణిని అపార్థం చేసుకుంటుంది?రుక్మిణి నన్ను పెనిమిటి అని పిలుస్తుంది ఎందుకంటే తనకు ఇంకొక పేరుతో నన్ను పిలవడం రాదు కాబట్టే కదా, అంతేగాని ఇలా తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా.ఇప్పుడు సత్య గురించి రుక్మిణీ కి చెప్తే మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళితుంది, చెప్పకపోవడమే మంచిది. సత్య ని కూడా రుక్మిణి దగ్గరికి వెళ్లకుండా ఆపి నచ్చgచెప్పాలి అని అనుకుంటాడు ఆదిత్య. ఆ తర్వాత సీన్ లో చిన్మయి రుక్మిణి దగ్గరికి వచ్చి, పడుకుందామా అమ్మా అని అనగా దేవి ఏది అని రుక్మిణి అడుగుతుంది. అప్పుడు దేవి అక్కడికి వస్తుంది. రండమ్మా అందరు పడుకుందాము అని రుక్మిణీ అనగా, నేను ఈరోజు అవ్వతో పడుకుంటాను మీరు పడుకోండి అని దేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రుక్మిణి చిన్మయితో, దేవమ్మకు ఏమైంది.
ఎప్పుడు నాతోనే పడుకుండేది మొదటిసారి నాతో పడుకోను అని అంటుంది అని అనగా, ఏమో నాకు చెప్పడం లేదు అని చిన్మయి అంటుంది.అప్పుడు దేవి ప్రవర్తనను చూసిన చిన్మయి మనసులో, దేవి అమ్మ అడిగినా చెప్పడం లేదంటే ఆఫీసర్స్ అడిగితేనే మాట్లాడుతదేమో అని ఆదిత్య కి ఫోన్ చేసి,ఆఫీసర్ సర్ దేవి ఎందుకో బాధపడుతుంది.భోజనం కూడా చేయలేదు అదేంటో ఎంత ప్రయత్నించినా చెప్పడం లేదు రేపు మీరు స్కూల్ కి రాగలరా, అప్పుడైనా దేవి తన మనసులో మాట మీకు చెప్తుందేమో అని అనగా, దేవికి ఏమైందమ్మా.ఇప్పుడు పక్కనే ఉందా, ఒకసారి ఫోన్ ఇవ్వు అని అనగా, లేదు సార్ తలుపు వేసుకొని గదిలోకి వెళ్ళిపోయింది. రేపు కచ్చితంగా రండి సార్ అని ఫోన్ పెట్టేస్తుంది చిన్మయి. దేవికి ఏమైంది ఇప్పుడు అని ఆదిత్య ఆందోళన పడతాడు. మరోవైపు జానకమ్మ తన కుర్చీలో కూర్చుని ఉండగా మాధవ్ అక్కడికి వస్తాడు.
ఎందుకమ్మా నువ్వు ఇలాగా బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు.ఆరోజు నువ్వు ఈ విషయం చెప్పను అని చెప్తే ఇప్పుడు ఆనందంగా ఉండే దానివి కదా! నేనెప్పుడైతే రాద నాకు ఇష్టమని చెప్పానో అప్పుడు మీరిద్దరూ నాకు తనని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు కానీ రాధ వద్దంటే ఆగిపోయారు. ఇప్పుడు వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవడం కన్నా అన్నీ తెలిసిన రాదని చూసి పెళ్లి చేసుకుంటే చిన్మయి,దేవి ఆనందంగా ఉంటారు కదా. ఎప్పటికైనా వాళ్ళిద్దరూ నా పిల్లలే. రాధ నీ ఎలాగైనా నేను నా సొంతం చేసుకుంటాను. అన్ని బాగుంటే ఈపాటికి రాద నా పెళ్ళం అయిపోయింది. చివరి నిమిషంలో వచ్చి నువ్వు చెడగొట్టావు అని తిట్టుకుంటాడు. ఆ తర్వాత రోజు ఉదయం ఆదిత్య ఎక్కడికో బయలుదేరుతుండగా సత్య ఆపి టిఫిన్ చేయు ఆదిత్య అని అంటుంది. వద్దు అని ఆదిత్య అనగా, బయట ఎవరైనా భోజనం పెడుతున్నారా అని సత్య అంటుంది.
దానికి ఆదిత్య కోప్పడి, షట్ అప్ సత్య ఏం మాట్లాడుతున్నావు ఎందుకంత తప్పుగా ఆలోచిస్తున్నావు అని అనగా, ఏం లేదు ఆదిత్య ఇక్కడ తినట్లేదు అంటే బయట ఎవరో భోజనం పెడుతున్నారనే కదా అర్థం అని అనగా, అర్థం పర్థం లేకుండా మాట్లాడొద్దు సత్య అని చెప్పి ఆదిత్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.వెనకనుంచి చూస్తున్న దేవుడమ్మ దంపతులు ఆందోళన పడి, వీళ్లిద్దరూ ఎప్పుడు ఇలా లేరు వీళ్ళ మధ్య మూడో మనిషి ఎవరైనా వచ్చుంటారు అని అనుమానపడతారు. అప్పుడు దేవుడమ్మ, రుక్మిణి చచ్చిపోయినప్పుడు ఆదిత్య సత్య నీ కొన్ని సంవత్సరాల పాటు పాటించుకోలేదు.
అయినా సత్య ఏమాత్రం బాధపడకుండా ఎప్పుడూ ఆదిత్య వెన్నంటే ఉన్నది. ఇప్పుడు ఇలా గొడవలు వస్తున్నాయి అంటే ఇంట్లో సమస్య కాదు బయట మూడో వ్యక్తి తలదూర్చడం వల్లే అయ్యుంటుంది.అదేంటో కచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో రుక్మిణి పని చేస్తూ ఉండగా మాధవ్ రుక్మిణిని చూస్తూ ఉంటాడు. అది చూస్తున్న భాగ్యమ్మ కోపంతో రగిలిపోతుంది. అప్పుడు రాధ దగ్గరికి వెళ్లి, రాధమ్మ నువ్వు జానకమ్మ గారి దగ్గరికి వెళ్లి ఏమైనా కావాలేమో కనుక్కొని పైకి పంపిస్తుంది.
ఇంతలో మాధవ్ సార్ మీకు ఏమైనా కాఫీ కావాలా అని కాఫీ తెచ్చి కావాలని మాధవ్ కాళ్ళ దగ్గర పడేస్తుంది భాగ్యమ్మ. అప్పుడు మాధవ్ అరుస్తూ, అసలు నీకు బుద్ధున్నదా వేడి వస్తువులు జాగ్రత్తగా తీసుకురావాలి కదా కళ్ళు నెత్తికెక్కాయ అని అడగగా, భాగ్యమ్మ చుట్టూ చూసి ఎవరూ లేరు అని గమనించి, కళ్ళు నాకు నెత్తికెక్కడం కాదురా నీకు నెత్తికెక్కి అని అంటుంది. భాగ్యమా మాటలకు మాధవ్ ఆశ్చర్యపోయి, ఏంటి మాటలు లెగుస్తుంది అని అడుగుతాడు.మాట కాదురా నా చెయ్యి లెగుస్తుంది నువ్వు చేసే పనులు అంతా బక్వాసుగా ఉన్నాయి.
అసలు అంత గలీస్ పనులు ఎలా చేస్తున్నావురా. నా కూతురు రా రుక్మిణి, నా బిడ్డకు ఏవైనా సమస్య వస్తే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నావు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!