బయటపడ్డ `భగవంత్ కేసరి` కలెక్షన్ల గోల్ మాల్.. షాకిస్తున్న వాస్తవ వసూళ్లు.. అనిల్ రావిపూడి ప్లాన్ రివర్స్?
నందమూరి బాలకృష్ణ.. నటించిన `భగవంత్ కేసరి` మూవీ వందకోట్లు దాటిందని చిత్ర బృందం చెబుతోంది. కానీ వాస్తవ కలెక్షన్లు మాత్రం షాకిస్తున్నాయి. దీంతో కలెక్షన్ల గోల్ మాల్ వ్యవహారం బయటపడుతుంది.
బాలకృష్ణకి సరైన మాస్, యాక్షన్ మూవీ పడితే ఎలా ఉంటుందో `అఖండ`, `వీరసింహారెడ్డి` చిత్రాలు నిరూపించాయి. మంచి సందేశం, సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవించిన `అఖండ` భారీ విజయాన్ని సాధించింది. వంద కోట్లకుపైగా వసూళ్లని రాబట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన `వీరసింహారెడ్డి`కి డివైడ్ టాక్ వచ్చినా, సంక్రాంతి పండగ కావడంతో మంచి వసూళ్లు రాబట్టి భారీగా లాభాలు తెచ్చింది. అయితే ఇప్పుడు `భగవంత్ కేసరి`తో హ్యాట్రిక్ కొట్టినట్టు టీమ్ చెబుతుంది.
Bhagavanth Kesari Review
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన `భగవంత్ కేసరి` ఏడు రోజుల్లో 115కోట్లు రాబట్టిందని టీమ్ ప్రకటించింది. దాదాపు యాభై కోట్లకుపైగా షేర్ వచ్చిందని, బ్రేక్ ఈవెన్‌కి దగ్గరలో ఉందని చెబుతుంది. కానీ వాస్తవ కలెక్షన్లు మాత్రం షాకిస్తున్నాయి. ఫస్ట్ టైమ్ బాలయ్య- అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా రియల్ కలెక్షన్లు పూర్తి భిన్నంగా ఉన్నాయి. టీమ్ ప్రకటించిన దాంట్లో సగం మాత్రమే ఉండటం గమనార్హం.
`భగవంత్ కేసరి` నిజానికి సుమారు రూ.72కోట్ల బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. అంటే సుమారు 74కోట్ల షేర్ వస్తే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ లెక్కన సినిమా 150కోట్ల గ్రాస్ సాధించాలి. అయితే ప్రస్తుతం ఈ సినిమా రూ.80కోట్ల లోపే గ్రాస్ సాధించిందట. ఇంకా వంద కోట్లు కూడా దాటలేదని డిస్ట్రిబ్యూటర్ల నుంచి అందుతున్న సమాచారం. ఈ లెక్కన ఈ వారం రోజుల్లో రూ.37కోట్ల షేర్ రాబట్టింది. ఇంకా బ్రేక్ ఈవెన్ కావాలంటే 37కోట్ల షేర్ రాబట్టాలి. అంటే 70కోట్ల గ్రాస్ రావాలి. కానీ నిన్నటి నుంచే ఈ సినిమా కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయి.
ఈ వారం పెద్ద సినిమాలు లేకపోవడంతో అది `భగవంత్ కేసరి`కి కలిసి రావచ్చు. కానీ ఏం చేసినా మరో పది నుంచి పదిహేను కోట్లు(షేర్) మాత్రమే రాబట్టగలదు. ఈ లెక్కన మరో 20కోట్లు నష్టాలను మిగిల్చుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో వాస్తవంగా `భగవంత్ కేసరి` ఇంత తక్కువగా ఉంటే నిర్మాతలు, దర్శకుడు మాత్రం సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అంటూ వాస్తవానికి మించి కలెక్షన్లు పోస్టర్ లో వేసి ఊదరగొడుతున్నారు. అందరిచేత ఆ మాట పలికిస్తున్నారు.
డిస్ట్రిబ్యూటర్ల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం వారికి దాదాపు 20 శాతం నష్టాలను తీసుకొస్తుందని అంటున్నారు. నైజాంలో కొంత బెటర్‌గానే ఉన్నా, ఏపీలోని డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువగా నష్టపోతారని తెలుస్తుంది. ఈ లెక్కన `భగవంత్ కేసరి` ఫ్లాప్ మూవీ జాబితాలోనే చేరిపోతుందని చెప్పొచ్చు. అయితే ఓవర్సీస్‌లో మాత్రం ఈ సినిమా సేఫ్‌లోకి వెళ్లిపోవడం విశేషం.
కలెక్షన్ల మాయాజాలం దర్శకుడు అనిల్ రావిపూడికి కొత్తేమీ కాదు. ఆయన `ఎఫ్3` చిత్రం నుంచి చేస్తున్నదే. ఈ చిత్రం అప్పట్లో వంద కోట్లు వసూలు చేసిందని భజన చేశారు. కానీ వాస్తవంగా అది యాభై నుంచి 60కోట్లలోపే సాధించింది. డిస్ట్రిబ్యూటర్లకి నష్టాలనే తెచ్చింది. వాస్తవంగా ఆ మూవీ ఫ్లాప్ చిత్రమే. కానీ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్‌రావిపూడి అందరిని మ్యానేజ్ చేసి మాయ చేశారు. వాస్తవాలు బయటకు రానివ్వకుండా చేశారు. ఆ తర్వాత అనిల్ చేసిన `సరిలేరు నీకెవ్వరు` కూడా పెద్ద హిట్ కాదు, బ్రేక్ ఈవెన్ వరకు వెళ్లింది. అది కూడా సంక్రాంతికి రావడం వల్ల. లేదంటే ఆ చిత్రం కూడా పరాజయం చెందేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
`ఎఫ్3` విషయంలో చేసిందే ఇప్పుడు `భగవంత్ కేసరి`కి చేస్తున్నారు. అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. నిత్యం సోషల్ మీడియాలో, మీడియాలో ఈ విషయాలను రుద్దుతున్నారు. రివ్యూల నుంచి టాక్, కలెక్షన్ల వరకు అన్నింటిని మ్యానేజ్ చేస్తున్నారు. కానీ సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు అన్నీ బయటకొస్తున్నాయి. `భగవంత్ కేసరి` కలెక్షన్లు గోల్ మాల్ వ్యవహారం కూడా బయటపడుతుందని అంటున్నారు నెటిజన్లు. అయితే ఇదంతా కొందరు బాలయ్య వ్యతిరేకులు చేస్తున్న పనిగా నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇది నెట్టింట రచ్చ రచ్చ అవుతుంది.
ఈ సినిమా టాక్ పరంగా యావరేజ్‌గా చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే బిలో యావరేజ్. శ్రీలీల ఎలిమెంట్లు, అమ్మ సెంటిమెంట్, గుడ్‌టచ్ బ్యాడ్ టచ్ తప్ప సినిమాలో మరే మ్యాటర్ లేదు. శ్రీలీలది కూడా అమ్మాయిలు షేర్ లాగా ఉండాలనే అంశం తప్ప, సీన్లలో బలం లేదు. ఎమోషన్ లేదు. ఫన్ కూడా కొంత వరకే వర్కౌట్ అయ్యింది. లాగ్, బలం లేని సీన్లు, పసలేని డైలాగులతో నెట్టుకోచ్చాడు అనిల్ రావిపూడి. ఒకటి రెండు యాక్షన్ సీన్లు మాత్రం మెప్పించాయి. దసరా పండక్కి వచ్చి కూడా ఇంత తక్కువగా కలెక్షన్లు ఉండటానికి కారణం.. చంద్రబాబు అరెస్ట్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాండివ్వడం, ఎలక్షన్లు ప్రభావం గట్టిగా ఉందని