- Home
- Entertainment
- వెండితెరపై పంతులమ్మలు..శభాష్ అనిపించుకున్నది, విమర్శలపాలైంది వీళ్ళే.. నయన్, శృతి హాసన్, ఇలియానా ఇంకా ఎవరంటే
వెండితెరపై పంతులమ్మలు..శభాష్ అనిపించుకున్నది, విమర్శలపాలైంది వీళ్ళే.. నయన్, శృతి హాసన్, ఇలియానా ఇంకా ఎవరంటే
గురువుల గొప్పతరం వివరించేలా వెండితెరపై పలు చిత్రాలు వచ్చాయి. అంతే కాదు గురువులని కామెడియన్లుగా చూపించిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఇక అందాలు ఒలకబోసే హీరోయిన్లు సైతం పంతులమ్మలుగా నటించి మెప్పించారు.

గురువులకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సమానంగా స్థానం కల్పించిన సంసృతి మనది. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ప్రతి ఏటా మన దేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. గురువుల గొప్పతరం వివరించేలా వెండితెరపై పలు చిత్రాలు వచ్చాయి. అంతే కాదు గురువులని కామెడియన్లుగా చూపించిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఇక అందాలు ఒలకబోసే హీరోయిన్లు సైతం పంతులమ్మలుగా నటించి మెప్పించారు. అయితే కొన్ని చిత్రాల్లో హీరోయిన్లు టీచర్స్ గా నటించినప్పటికీ ఆ పాత్రలని కేవలం గ్లామర్ కోసమే వాడుకోవడంతో విమర్శలు మూటగట్టుకున్నారు.
మమతా మోహన్ దాస్ : పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన జనగణమన చిత్రంలో మమతా మోహన్ దాస్ లెక్చరర్ గా పవర్ ఫుల్ పాత్రలో నటించింది. ఎమోషనల్ యాక్టింగ్ తో శభాష్ అనిపించుకుంది.
శృతి హాసన్ : ప్రేమమ్ చిత్రంలో శృతి హాసన్ ఉపాధ్యాయురాలిగా నటించి అదరహో అనిపించింది. ఈ మూవీలో శృతి హాసన్ నటనకి ప్రశంసలు దక్కాయి.
నయనతార: నేనే అంబానీ చిత్రంలో నయనతార ఉపాధ్యాయురాలు పాత్రలో నటించింది. అలాగే పలు తమిళ చిత్రాల్లో నయన్ ఉపాధ్యాయురాలిగా మెప్పించింది.
అనుపమ పరమేశ్వరన్ : రాక్షసుడు చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ టీచర్ పాత్రలో అద్భుతంగా నటించింది. అనుపమ పాత్రకి ఆ మూవీలో ప్రశంసలు దక్కాయి.
ఇలియానా: రవితేజ ఖతర్నాక్ చిత్రంలో ఇలియానా గ్లామరస్ టీచర్ గా నటించింది. అయితే ఇలియానా పాత్రపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి.టీచర్ పాత్రలో అలా కొంగు విప్పి అసభ్యంగా నటించడం ఏంటి అంటూ దుమ్మెత్తిపోశారు.
కమలినీ ముఖర్జీ : శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ చిత్రంలో కమలినీ ముఖర్జీ లెక్చరర్ పాత్రలో నటించింది. అయితే ఆమె పాత్ర కేవలం గ్లామర్ కోసం వాడుకున్నారని, ఉపాధ్యాయురాలు పాత్రలో ఎక్స్ పోజ్ చేయడం ఏంటి అంటూ విమర్శలు వినిపించాయి.
విజయశాంతి: లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పేరు చెప్పగానే ఎక్కువగా పోలీస్, విప్లవ తరహా పాత్రలు కళ్ళముందు మెదులుతాయి. కానీ విజయశాంతి పంతులమ్మగా కూడా అదరగొట్టింది. రేపటి పౌరులు, ప్రతిఘటన చిత్రాల్లో ఉపాధ్యాయరాలిగా నటించింది.
అసిన్ : ఈ చెన్నై చిన్నదాని పేరు చెప్పగానే ఘర్షణ చిత్రంలో పోషించిన టీచర్ రోల్ గుర్తుకు వస్తుంది. టీచర్ గా ఆసిన్ ఆ మూవీలో ఎంతో హుందాగా నటించి మెప్పించింది.