MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bathukamma Song : మంగ్లీ స్టైల్లో మరో బతుకమ్మ పాట రెడీ.. ఐదు గంటల్లోనే లక్ష వ్యూస్, యూట్యూబ్ ను షేక్ చేస్తోందిగా

Bathukamma Song : మంగ్లీ స్టైల్లో మరో బతుకమ్మ పాట రెడీ.. ఐదు గంటల్లోనే లక్ష వ్యూస్, యూట్యూబ్ ను షేక్ చేస్తోందిగా

బతుకమ్మ పాట అనగానే మంగ్లీ పేరు గుర్తుకువచ్చేలా పరిస్థితి మారుతోంది. ఇప్పటికే ఈమె ఆడిపాడిన అనేక బతుకమ్మ పాటలు సూపర్ హిట్ అయ్యాయి… తాజాగా మరో పాట విడుదలై యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.

3 Min read
Author : Arun Kumar P
Published : Oct 08 2026, 01:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బతుకమ్మ పాట
Image Credit : Youtube Screenshot/Mangli Official Channel

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బతుకమ్మ పాట

Mangli Bathukamma Song : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో బతుకమ్మను పేర్చి, చుట్టూ చేరి ఆడబిడ్డలు పాటలు పాడుతూ జరుపుకునే వేడుక ప్రతి ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పండగలోని ప్రకృతి అందాలు, మహిళల సందడి, పూలతో ముడిపడిన సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఎన్నో బతుకమ్మ పాటలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. తాజాగా ప్రముఖ గాయని మంగ్లీ మరో కొత్త బతుకమ్మ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బతుకమ్మ సంబరాలకు అద్దం పట్టేలా సాంగ్
Image Credit : Youtube Screenshot/Mangli Official Channel

బతుకమ్మ సంబరాలకు అద్దం పట్టేలా సాంగ్

మంగ్లీ పాటలో బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ పల్లెల్లో కనిపించే సంప్రదాయ వాతావరణాన్ని ప్రధానంగా చూపించారు. బతుకమ్మను పూలతో పేర్చడం నుంచి మహిళలు, ఆడబిడ్డలు చుట్టూ చేరి పాటలు పాడుతూ సంబరాలు చేసుకోవడం వరకు పండగలోని ముఖ్యమైన అంశాలను ఈ యూట్యూబ్ వీడియోలో అందంగా ఆవిష్కరించారు.

ఇక ప్రకృతి, పూలు, వర్షం, పల్లె జీవనం వంటి అంశాలను బతుకమ్మ వేడుకతో అనుసంధానిస్తూ పాట సాగుతుంది. రంగురంగుల పూలతో పరిసరాలు కళకళలాడటం, వాటి పరిమళాలతో పల్లె వాతావరణం నిండిపోవడం వంటి దృశ్యాలను పాటలోని భావాలకు అనుగుణంగా చూపించారు.

బతుకమ్మ పండగకు ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని కూడా ఈ పాట ప్రత్యేకంగా చూపిస్తుంది. పూలను సేకరించడం, వాటితో బతుకమ్మను పేర్చడం, ప్రకృతిని ఆస్వాదిస్తూ వేడుక చేసుకోవడం వంటి అంశాలు పాటలో ప్రధానంగా కనిపిస్తాయి. ఇలా బతుకమ్మను కేవలం ఒక పండగగా కాకుండా ప్రకృతిని ఆరాధించే వేడుకగా చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. ఆకాశం, వాన చినుకులు, పూలు, పచ్చని పల్లె వాతావరణం వంటి అంశాలను ఒకదానితో ఒకటి కలిపి వీడియోను రూపొందించారు.

35
అదిరిపోయే లిరిక్స్..
Image Credit : Youtube Screenshot/Mangli Official Channel

అదిరిపోయే లిరిక్స్..

''సింగిడి సినబోయినాది అమ్మను జూసి.. ఆ రంగులె తడబడినై బొడ్డెమ్మను జూసి'' అంటూ అద్భుతమైన పదాలతో మంగ్లీ బతుకమ్మ సాంగ్ మొదలవుతుంది. ప్రకృతిని, సాంప్రదాయ బతుకమ్మ వేడుకలను వర్ణిస్తూ ఈ పాట ముందుకు సాగుతుంది. రంగురంగుల పూలను గడపగడపకి చేర్చి పరిమళాలను వెదజల్లే పండగ ఇది... వేలాది పూలను ఒక్కటిచేసి బతుకమ్మ కొత్తజన్మని ఎత్తుతుంది అనే మాటలు అద్భుతం. ''ఈ బతుకమ్మ వేడుకను చూడాలని భూమి ఆకాశాన్ని ఆహ్వానించింది... దీంతో ఆకాశం పరవశించి చినుకై గంగమ్మను చేరుతుంది'' ఈ మాటలు చాలవా ఈ బతుకమ్మ పాట ఎంత బాగుందో చెప్పడానికి.

ఇక ఆడబిడ్డలు ఇష్టంగా నిన్ను తలచుకుంటూ బతుకమ్మ ఆడతారు... నిష్టగా కొలిచి మట్టి గొంతులతో పాటలు పాడతారంటూ మరో చరణం ప్రారంభం అవుతుంది. పలహారాలతో సద్దిని పెట్టి తొమ్మిదిరోజులు కొలుస్తారు.. వాటిని ఆరగించు తల్లి అని కోరినట్లు ఉంటుంది. సప్పట్ల సందడిలో పూల అంగడి సాగినట్లు వేడుకలుంటాయి... మిన్నంటిపోయే సంబరాలను ఊరంతా చూస్తుందని.. చివరికి మత్తడి దుంకే చెరువుల్లోకి బతుకమ్మ చేరుతుంది ఈ పాట సాగుతుంది.

ఇలా బతుకమ్మ పండగరోజు ఉదయం వాకిట్లో ముగ్గుపెట్టే దగ్గరినుండి సాయంత్రం బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చేవరకు ప్రతి ఒక్కటి వివరిస్తూ ఈ బతుకమ్మ పాట సాగుతుంది. ఒక్కసారి వింటే మళ్ళీమళ్లీ వినాలి అనిపించేలా ఉన్న ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేయడానికి సిద్దమవుతోంది.

45
మంగ్లీ గొంతులో జానపద సొబగులు
Image Credit : Youtube Screenshot/Mangli Official Channel

మంగ్లీ గొంతులో జానపద సొబగులు

తెలంగాణ జానపద గీతాలకు మంగ్లీ స్వరం ప్రత్యేకంగా సరిపోతుంది. ఆమె గాత్రంలోని జానపద మాధుర్యం ఈ బతుకమ్మ పాటకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది. పండగ వాతావరణానికి తగ్గట్టుగా ఉత్సాహంగా, అదే సమయంలో సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఆమె పాటను ఆలపించారు.

బతుకమ్మ గొప్పతనాన్ని తెలియజేసేలా, తెలంగాణ ఆడబిడ్డలు సులభంగా పాడుకునేలా పాటకు సాహిత్యాన్ని తిరుపతి మట్ల అందించారు. పూల పండగలోని భావోద్వేగాన్ని, మహిళల ఉత్సాహాన్ని, ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా సాహిత్యాన్ని రూపొందించారు.

పాట సాహిత్యానికి, మంగ్లీ గాత్రానికి సరిపోయేలా మదీన్ ఎస్కే సంగీతాన్ని అందించారు. జానపద ఛాయలను కొనసాగిస్తూనే ఆధునిక శ్రోతలకు నచ్చేలా మ్యూజిక్‌ను రూపొందించారు. పాట ప్రారంభం నుంచి చివరి వరకు బతుకమ్మ పండగ ఉత్సాహం కనిపించేలా సంగీతాన్ని మలిచారు.

సందర్భానికి తగ్గట్టుగా మంగ్లీ స్టెప్పులు

పాట వీడియోలో బతుకమ్మ వేడుకలను కళ్లకు కట్టినట్లు చూపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పల్లె వాతావరణం, పూల అలంకరణలు, మహిళల బతుకమ్మ ఆట వంటి దృశ్యాలతో వీడియోను రూపొందించారు. ఇక మంగ్లీ కూడా పాటకు అనుగుణంగా అక్కడక్కడ స్టెప్పులు వేశారు. అయితే పాటలోని పండగ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన చోట మాత్రమే డ్యాన్స్‌ను ఉపయోగించారు. దీంతో వీడియోలో అతి లేకుండా సహజమైన పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈ కొరియోగ్రఫీకి సహానా శెట్టి పనిచేశారు.

బతుకమ్మ పండగలోని రంగులు, పూల అందాలు, పల్లె జీవనశైలిని తెరపై అందంగా చూపించడంలో కెమెరా, ఎడిటింగ్ విభాగాలు కీలకంగా నిలిచాయి. డీఓపీ కెప్టెన్ సాయికిరణ్ చిత్రీకరణ బాధ్యతలు చేపట్టగా, ఎడిటర్ రాజు పాటకు తుది రూపం ఇచ్చారు.

పాటలోని ప్రతి భాగానికి అనుగుణంగా దృశ్యాలను జోడించడంతో బతుకమ్మ వేడుక ప్రేక్షకుల కళ్లముందు జరుగుతున్న అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా పూలతో నిండిన బతుకమ్మలు, మహిళల సందడి, పల్లె వాతావరణం వంటి విజువల్స్ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.

55
బతుకమ్మ స్ఫూర్తిని చాటే పాట
Image Credit : Youtube Screenshot/Mangli Official Channel

బతుకమ్మ స్ఫూర్తిని చాటే పాట

మొత్తంగా ఈ పాటలో బతుకమ్మను కేవలం ఒక పండగగా కాకుండా తెలంగాణ సంస్కృతి, మహిళల ఆత్మీయత, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధానికి ప్రతీకగా చూపించే ప్రయత్నం చేశారు. మంగ్లీ గాత్రం, తిరుపతి మట్ల సాహిత్యం, మదీన్ ఎస్కే సంగీతం, సహానా శెట్టి కొరియోగ్రఫీ, కెప్టెన్ సాయికిరణ్ కెమెరా పనితనం, ఎడిటర్ రాజు ఎడిటింగ్ కలిసి పాటకు ప్రత్యేకమైన రూపాన్ని తీసుకొచ్చాయి.

బతుకమ్మ పండగ సందర్భంగా విడుదలైన ఈ పాట తెలంగాణ పల్లె సంస్కృతిని, ఆడబిడ్డల సందడిని, పూల పండగలోని ప్రకృతి అందాలను ఒకేసారి ప్రేక్షకులకు పరిచయం చేసేలా ఉంది. ముఖ్యంగా జానపద గీతాలను ఇష్టపడే వారికి మంగ్లీ గాత్రంలో వచ్చిన ఈ బతుకమ్మ పాట ఆకట్టుకునే అవకాశం ఉంది. మంగ్లీ అఫిషియల్ (Mangli Official) యూట్యూబ్ ఛానల్లో విడుదలైన ఈ బతుకమ్మ పాట కేవలం గంటల వ్యవధిలోనే లక్షల వ్యూస్, వేల లైక్స్ పొందింది... ఈ దూకుడు చూస్తుంటే మంగ్లీ ఖాతాలో మరో మిలియన్స్ వ్యూస్ సాంగ్ లోడ్ అవుతున్నట్లు కనిపిస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వినోదం
పండుగలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Parasuram: పూరి, త్రివిక్రమ్ తర్వాత నువ్వే అని ముంచేశారు.. కృతజ్ఞతతో ఆ హీరో తండ్రి పేరే నా కొడుక్కి పెట్టా
Recommended image2
Chiranjeevi Villain: వాచ్‌మన్ నుంచి చిరంజీవి విలన్ వరకు.. ఒక్క దెబ్బకు 10 సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నటుడు
Recommended image3
YouTuber Madhumita: కిలాడీ యూట్యూబర్ మధుమితపై దొంగతనం కేసు.. తెలివిగా మెడలో గొలుసు కొట్టేసింది
Related Stories
Recommended image1
Bathukamma: బొడ్డెమ్మ పండుగకి, బ‌తుక‌మ్మ పండుగకి తేడా ఏంటో తెలుసా.?
Recommended image2
Bathukamma Celebrations : గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా బతుకమ్మ వేడుకలు.. ప్లాన్ ఇదే..: కల్వకుంట్ల కవిత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved