MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ 30 టైటిల్ విషయంలో బండ్ల గణేష్ కి బిగ్ షాక్... పవన్ కోసం దాచుకుంటే దోచేశారు?

ఎన్టీఆర్ 30 టైటిల్ విషయంలో బండ్ల గణేష్ కి బిగ్ షాక్... పవన్ కోసం దాచుకుంటే దోచేశారు?

ఎన్టీఆర్ 30 త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్ర టైటిల్ గురించి ఆసక్తికర వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. బండ్ల గణేష్ భద్రంగా దాచుకున్న టైటిల్ ఎన్టీఆర్ దోచేశాడు అంటున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 12 2022, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
NTR 30

NTR 30


పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ నిర్మాత అయ్యాక ఆయనతో రెండు సినిమాలు చేశారు. తీన్ మార్ ప్లాప్ కాగా గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వరుస పరాజయాలతో పవన్ ఇబ్బందిపడుతున్న టైంలో పడ్డ గబ్బర్ సింగ్ పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. వారు కాలర్ ఎగరేసుకొని గర్వపడేలా చేసింది. ఇలాంటి విజయం అందించిన బండ్ల గణేష్ అంటే పవన్ ఫ్యాన్స్ కి ప్రత్యేక అభిమానం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


ఇక వీరిద్దరి కాంబినేషన్లో మరో మూవీ రూపొందాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆ అవకాశం కోసం ఫ్యాన్స్ కి మించి బండ్ల గణేష్ ఎదురుచూస్తున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన కోరిక బయటపెడుతూ ఉంటాడు. పవన్ ఒక అవకాశం ఇస్తే వెయ్యి కోట్లు వసూలు చేసే మూవీ తెరకెక్కిస్తా అంటూ ఇటీవల కామెంట్ చేశారు. 
 

36

పవన్ కళ్యాణ్ ని బండ్ల భక్తితో 'దేవర' అని పిలుచుకుంటారు. ఈ టైటిల్ తో మూవీ చేయాలనే ఆలోచన ఆయనకు ఎప్పటి నుండో ఉంది. దేవర టైటిల్ పవన్ కళ్యాణ్ కోసం చాలా కాలం క్రితమే రిజిస్టర్ చేసి ఉంచారు. పవన్ తో సినిమా చేస్తే ఆ టైటిల్ ఫిక్స్ చేయాలని గట్టి ప్రణాళికతో ఉన్నారు. అయితే బండ్ల గణేష్ ఏళ్లుగా దాచుకుంటున్న ఆ టైటిల్ ఎన్టీఆర్ కొట్టేశాడు అంటున్నారు. 
 

46


దేవర టైటిల్ ని ఛాంబర్ లో రెన్యువల్ చేయించడం బండ్ల గణేష్ మర్చిపోయారట. దీంతో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ టైటిల్ గా దేవర నిర్ణయించారు అంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇదే నిజమైతే బండ్ల గణేష్ కి పెద్ద షాక్ తగిలినట్లే. పవన్ కి ఇద్దామనుకున్న కానుక ఆయన ఇవ్వలేరు. 

56
ntr 30

ntr 30

ఇక ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ పై భారీ చర్చ నడిచింది. ఒకదశలో ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ కోరినట్లు కొరటాల శివ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. ఇటీవల కొరటాల శివ కెమెరామెన్ రత్నవేలు, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ తో భేటీ అయిన ఫోటోలు చక్కర్లు కొట్టాయి.

66


తాజాగా ఎన్టీఆర్ అల్ట్రా స్టైలిష్ లుక్ వైరల్ గా మారింది. జుట్టు స్ట్రైటెన్ చేసి గాగుల్స్ పెట్టి ఎన్టీఆర్ సరికొత్తగా కనిపించారు. ఈ లుక్ ఎన్టీఆర్ కోసమే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ బరువు కూడా తగ్గారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Recommended image2
Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్‌ షాక్‌.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?
Recommended image3
కృష్ణ తలచుకుంటే శోభన్‌బాబుని మించి వేల కోట్లు ఆస్తులు.. సగం చెన్నై, హైదరాబాద్‌ ఆయనదే.. సంచలన విషయాలు వెల్లడి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved