MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • నీ గురించి అన్నీ తెలిసినవాడిగా చెబుతున్నా, ఇక వాడుకోను... పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ ట్వీట్!

నీ గురించి అన్నీ తెలిసినవాడిగా చెబుతున్నా, ఇక వాడుకోను... పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ ట్వీట్!

నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ట్వీట్ వైరల్ అవుతుంది. గురు పౌర్ణిమ వేళ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 03 2023, 04:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Pawan Kalyan

Pawan Kalyan


పెద్దోళ్ళను పూజించడం సాంప్రదాయం. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది అవసరం. ఒక స్థాయిలో ఉన్న హీరోలను పొగడాలి, వాళ్ళ గురించి నాలుగు మంచి మాటలు చెప్పాలి. వేదికలపై  ఊక దంపుడు ఉపన్యాసాలు ఇవ్వాలి. అప్పుడప్పుడు కలిసి ఆశీస్సులు తీసుకోవాలి. పెద్దోళ్ళతో పరిచయాలు అవకాశాలు తెచ్చిపెడతాయి. ప్రయోజనాలు చేకూరుస్తాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


స్టార్ హీరోలను, పెద్ద కుటుంబాలను పూజించినా, అభిమానించినా దాని వెనకున్న కారణం స్వప్రయోజనాలే. అందులో తప్పుబట్టడానికి లేదు. దేవుడికి పూజలు చేసేది కూడా మంచి జరగాలనే కదా...  పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ కి కూడా ఎంతో కొంత స్వార్థం ఉంది. తన దేవుడు పవన్ కళ్యాణ్ తన బ్యానర్ లో ఒక మూవీ చేస్తే లబ్ధి పొందొచ్చనే భావన ఉంటుంది. 

36

2012లో పవన్-బండ్ల గణేష్ కాంబోలో గబ్బర్ సింగ్ తెరకెక్కింది. అది బ్లాక్ బస్టర్. మరలా పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ కి ఛాన్స్ ఇవ్వలేదు. అందుకు కారణాలు తెలియదు. ఆ మధ్య అన్ స్టాపబుల్ షోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రెమ్యూనరేషన్ నాకు పూర్తిగా ఇవ్వలేదని చెప్పాడు. బండ్ల అనుకున్నంత ఇచ్చాడు కానీ నేను అనుకున్నంత ఇవ్వలేదని చెప్పాడు. 

46


బహుశా బండ్ల బ్యానర్లో మూవీ చేస్తే సరిగా రెమ్యూనరేషన్ ఇవ్వడని పవన్ సినిమా చేయలేదేమో. ఓ ఏడాదిన్నర కాలంగా పవన్, బండ్ల మధ్య మాటల్లేవు. పవన్ కళ్యాణ్ అత్యంత అభిమానించే త్రివిక్రమ్ ని బండ్ల అనరాని మాటలు అన్నాడు. అది తెలిసిన పవన్ బండ్లను పూర్తిగా దూరం పెట్టాడు. ఈ మధ్య కాలంలో బండ్ల గణేష్ పవన్ ని కలిసింది లేదు. 

56

బండ్ల గణేష్ కి పవన్ మీద హోప్స్ పోయాయనుకుంటా ఆయన్ని పొగుడుతూనే ఆసక్తికర కామెంట్స్ చేశాడు. బండ్ల గణేష్ తన ట్వీట్లో...  ''గురు పూర్ణిమ సందర్భంగా మా గురువుకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు.. మీరు మీలాగే ఉండాలి మీరు అనుకున్నవన్ని సాధించాలి. కసితో కృషితో మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. మీ స్థాయి ఏంటో? మీ స్థానం ఏంటో? తెలిసిన వాడిగా చెబుతున్న.. ఎప్పుడు ఏ విధంగా మీ కీర్తిని గానీ మీ పేరుని వాడుకొని లబ్ధి పొందను, పొందటానికి కూడా ప్రయత్నించను అనీ.. వీలైతే మీకు సహాయంగా ఉంటాను, లేకపోతే దూరంగా ఉంటాను. అంతేగాని మిమ్మల్ని ఏ విధంగా వాడుకొని నేను ఏ విధమైన లబ్ధి పొందనని, గురు పౌర్ణమి సందర్భంగా గురువు సాక్షిగా చెప్తున్నాను.  నా చూపు నా ఆశ ఒకటే మీరు అనుకున్న ఆశయం సాధించాలి సాధిస్తారు. మీ నిస్వార్ధమైన మీ మనసులాగే మీరు పది కాలాలపాటు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ.. మీ బండ్ల గణేష్'' అని రాసుకొచ్చాడు. 
 

66

సీఎం కావాలన్న పవన్ కళ్యాణ్ ఆకాంక్ష నెరవేరావాలని కోరుకుంటూనే, మీ నుండి ఎలాంటి ప్రయోజనం ఆశించను, లబ్ది పొందను, పేరు వాడుకోనని స్టేట్మెంట్ ఇచ్చాడు. నాతో మీరు మాట్లాడితే చాలు, నాకు సినిమా చేసి పెట్టాల్సిన అవసరం లేదని పరోక్షంగా చెప్పాడని ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. పవన్ ని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ పై జనసైనికులు భిన్నమైన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved