- Home
- Entertainment
- పూరికి బండ్లన్న ఉసురు గట్టిగా తగిలిందిగా.. అందుకే 'లైగర్' దెబ్బైపోయిందా, నెటిజన్ల ట్రోలింగ్
పూరికి బండ్లన్న ఉసురు గట్టిగా తగిలిందిగా.. అందుకే 'లైగర్' దెబ్బైపోయిందా, నెటిజన్ల ట్రోలింగ్
ప్రీమియర్ షోల నుంచే లైగర్ చిత్రానికి నిరాశాజనకమైన టాక్ మొదలయింది. మరోసారి పూరి జగన్నాధ్ రొటీన్ కంటెంట్ తో విసుగు పుట్టించాడు అంటూ నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు.

ఎప్పుడు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో తెలియని పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 'లైగర్' మూవీ తెరకెక్కింది. ఫస్ట్ లుక్ అప్పటి నుంచి పాన్ ఇండియా చిత్రంగా భారీ హైప్ బిల్డప్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ మేకోవర్ యువతని, మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకర్షించింది. ఈసారి పూరి జగన్నాధ్ మినిమమ్ గ్యారెంటీ మాస్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.
కానీ ప్రీమియర్ షోల నుంచే లైగర్ చిత్రానికి నిరాశాజనకమైన టాక్ మొదలయింది. మరోసారి పూరి జగన్నాధ్ రొటీన్ కంటెంట్ తో విసుగు పుట్టించాడు అంటూ నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. సినిమాకి ఊహించని విధంగా హైప్ బిల్డ్ కావడం.. సినిమా చూస్తే ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకున్నారు. కొందరైతే బండ్ల గణేష్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ పూరిపై విరుచుకుపడుతున్నారు.
పూరి జగన్నాధ్ కి బండ్ల గణేష్ ఉసురు బాగా తగిలింది అంటూ ట్రోల్ చేస్తున్నారు. పూరి తనయుడు ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ పూరి జగన్నాధ్ పై డైరెక్ట్ గా అటాక్ చేశాడు. సొంత కొడుకుని పట్టించుకోకుండా ఎవరెవరినో సూపర్ స్టార్స్ చేస్తావు ఏంటి అన్నా అంటూ బండ్ల గణేష్ పూరిని విమర్శించిన సంగతి తెలిసిందే. లైగర్ టాక్ తేడా కొట్టడంతో ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బండ్లన్న ఉసురు, వదిన ఉసురు, పూరి కొడుకు ఉసురు బాగా తగిలింది. అందుకే అందుకే లైగర్ చిత్రం డిజాస్టర్ అవుతోంది. తీసింది చెత్త సినిమా.. దానికి పోయి ఒక సంవత్సరం టైం తీసుకున్నాడు. ఫామ్ లో ఉన్న రోజుల్లో ఇలాంటి మూవీని పూరి 40 రోజుల్లో ఫినిష్ చేసేవాడు. పూరి కూడా నెమ్మదిగా ఆర్జీవీలాగా మారిపోతున్నాడు. పూరిని ఇలా చూస్తుంటే బాధగా ఉంది అంటూ నెటిజన్లు చేస్తున్న విమర్శలు వైరల్ అవుతున్నాయి.
చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ మాట్లాడుత.. జీవితంలో వ్యాంపులు వస్తుంటారు పోతుంటారు.. కానీ ఫ్యామిలీ శాశ్వతం అంటూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కొడుకుని పట్టించుకోవడం లేదని కూడా బండ్ల ఆరోపించారు. బండ్ల గణేష్ వ్యాఖ్యలకు ఆ తర్వాత పూరి ఘాటుగానే బదులిచ్చాయారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే అనేక అనర్థాలు జరుగుతాయని కామెంట్స్ చేశారు.
మరికొందరు నెటిజన్లు అయితే పూరి జగన్నాధ్ ఇక రిటైర్ కావలసిన టైం వచ్చింది అంటూ బాహాటంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తప్ప పూరికి ఇటీవల గొప్ప విజయం అంటూ లేదు. అది కూడా మణిశర్మ సాంగ్స్, రామ్ డాన్సులతో గట్టెక్కింది అని నెటిజన్లు అంటున్నారు. బద్రి, ఇడియట్, పోకిరి, చిరుత, దేశముదురు లాంటి రీసౌండింగ్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన పూరికి ఈ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు.