MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాపై కుళ్లు జోకులేసుకున్నారు, ఆ కమెడియన్ నా గురించి వల్గర్ గా మాట్లాడాడు.. హనీరోజ్ షాకింగ్ కామెంట్స్..

నాపై కుళ్లు జోకులేసుకున్నారు, ఆ కమెడియన్ నా గురించి వల్గర్ గా మాట్లాడాడు.. హనీరోజ్ షాకింగ్ కామెంట్స్..

తన గురించి షాకింగ్ కామెంట్స్ విన్నానంటోంది బాలయ్య భామ హనీరోజ్. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బ్యూటీ.. తనకుజరిగిన అవమానం గురించి వెల్లడించింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 03 2023, 03:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కేరళ అందాల భామ హనీరోజ్.. ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. మళ్ళీ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తుందా అని అంతా ఎదురుచూసేలా ప్రభావం  చూపించింది హనీరోజ్. బాలకృష్ణ  హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య కు జోడీగా నటించింది  హనీ రోజ్. ఈసినిమాతో ఆమెకి తెలుగులో మంచి ఆదరణ లభించింది. 

26

తాజాగా ఓ ఇంటర్వ్యూలో హనీ రోజ్ మాట్లాడుతూ..  షాకింగ్ కామెంట్స్ చేసింది.  ఇండస్ట్రీలో చాలా మంది నాపై కుళ్లు జోకులు వేసుకొని నవ్వుకునేవారు.. నా ముందు చాలా అందంగా ఉన్నావంటూనే పక్కకు వెళ్లి నాపై బాడీషేమింగ్  కామెంట్స్ చేసేవారు. కొన్ని ట్రోల్స్ నవ్వులు తెప్పిస్తుంటాయి.. మరికొన్ని మనసు ఎంతగానో నొప్పిస్తుంటాయి అన్నారు హనీరోజ్. 

36

ముఖ్యంగా తన  శరీరాకృతి గురించి కొంతమంది పిచ్చి కామెంట్స్ చేస్తుంటే హనీరోజ్ చాలా బాధపడేదట. ఏడుపొచ్చినా. దిగమింగుకుని భరించిందట హనీ. అంతే కాదు  ఇప్పటికీ అవి గుర్తుకు వచ్చినప్పుడు  వాటన్నింటిని మర్చిపోవడానికి గట్టిగా  ప్రయత్నిస్తున్నాను అని అన్నారు హనీ రోజ్. అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఒక్కోసారి అదే కొనసాగుతుందంటూ.. ఓ చిన్న ఉదాహరణ కూడా చెప్పింది హనీ. 
 

46

హనీరోజ్ మాట్లాడుతూ.. రీసెంట్ గా ఓ  టీవీ షో కి వెళ్లాను.. అక్కడ నన్ను.. నా శరీరాన్ని  షేమింగ్ చేస్తూ వెటకారంగా మాట్లాడారు. అది విని ఆ షో యాంకర్ కూడా పెద్ద పెద్దగా నవ్వేసింది. కాని ఓమహాళ అయ్యుండి.. సాటి మహిళను అయిన నాపై చేస్తున్న కామెంట్స్ విని వ్యతిరేకించలేదు. అది మానేసి  మానేసి అలా పగలబడి నవ్వడం నాకు అస్సలు నచ్చలేదు అన్నారు హనీరోజ్. అంతే కాదు ఈ విషయంలో  చాలా బాధేసిందంటూ.. ఆవేదన వెల్లడించారు కూడా. 
 

56

ఇక అంతే కాదు  ఓ కమెడియన్ నా శరీర భాగాల గురించి ఏదేదో పిచ్చిగా మాట్లాడాడు.. ఇలా బాడీ షేమింగ్ చేస్తు మహిళలను హేళన చేస్తుంటే.. వాటిని టీవీల్లో చూపించడం ద్వారా ఏ మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఏమో తెలియడం లేదు... అసలు వాళ్లైనా వీటిని ఎలా ప్రసారం ఎలా చేస్తారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది నటి హనీ రోజ్. 

66

ఎప్పుడో 15  ఏళ్ళ క్రితమే ఇండస్ట్రీలో అడుగు పెట్టింది హనీరోజ్. 2005 లో మాలీవుడ్ లో రిలీజ్ అయిన బాయ్ ఫ్రెండ్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. హనీ రోజ్ తెలుగులో కూడా సినిమాలు చేసింది.  ఆలయం, ఈ వర్షం సాక్షిగా మూవీస్ లో నటించింది.. కాని ఈ సినిమాలు ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయి. దాంతో టాలీవుడ్ లో మరేసినిమా చేయలేదు బ్యూటీ.. ఇక ఇన్నేళ్ళ తరువాత మళ్లీ..  బాలయ్యతో నటించిన వీర సింహారెడ్డి మూవీతో మంచి గుర్తింపు లభించింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
అల్లు అర్జున్, ప్రభాస్ తో పాటు, బాలీవుడ్ లో స్టార్స్ గా మారిన టాప్ సౌత్ హీరోలు ఎవరు? నెం1 ప్లేస్ ఎవరిదంటే?
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: గుణతో చేతులు కలిపిన రోహిణీ, మీనాకి చిక్కులు, ప్రమాదంలో బాలు చెల్లెలు మౌనిక
Recommended image3
రాజమౌళి ఫ్యామిలీలో పెత్తనం ఎవరిది, తేడా వస్తే తాట తీస్తారని జక్కన్న చెప్పింది ఎవరి గురించి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved